ETV Bharat / state

రైతుబజార్ల నుంచి కూరగాయలు డోర్‌ డెలివరీ - పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభం

విశాఖలోని ఎంవీపీ రైతుబజారు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక - రవాణా ఛార్జీలు లేకుండా రైతుబజారు ధరలకే కూరగాయలు

Digi Rythu Bazar Service in AP
Digi Rythu Bazar Service in AP (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 9, 2025 at 4:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Digi Rythu Bazar Service in AP: తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ఇంట్లో నిత్యావసరాలు, మందుల వరకు ప్రతిదీ ఆన్​లైన్​లో అందుబాటులో లభిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో డిజిటల్ ప్లాట్​ఫామ్​ క్రేజీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క క్లిక్​తో కొన్ని క్షణాల్లోనే వస్తువులను మన ఇంటి వద్దకు డెలివరీ చేస్తున్నారు. మనకు అవసరమైనవి దుకాణం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆర్డర్​ చేసుకుంటే వచ్చేస్తున్నాయి. వీటికి సంబంధించి ఎన్నో యాప్​లు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం సైతం ఓ వెబ్​సైట్​ను ప్రారంభించింది. దీని ద్వారా ఏకంగా రైతు బజారు నుంచి కూరగాయలు డోర్ డెలివరీ చేసుకోవచ్చు. అసలు ఏంటి యాప్​? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

పైలట్ ప్రాజెక్టుగా: విశాఖలో నగరవాసుల సౌకర్యార్థం రైతు బజార్లలోని కూరగాయలను ఇక నుంచి డోర్‌ డెలివరీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగానూ నగరంలోని ఎంవీపీ రైతుబజారును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఏ విధమైన రవాణా ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేకుండా రైతుబజారులో లభించే ధరలకే వినియోగదారులకు కూరగాయలు అందించనున్నారు. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ మేషంట్ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ డెలివరీ బాయ్స్‌ని నియమిస్తారు. తద్వారా వినియోగదారుల ఇళ్లకు వారి ద్వారా కూరగాయలు సరఫరా చేస్తారు.

ఈ వెబ్​సైట్​లో బుక్ చేసుకోవాలి: రైతుబజారు నుంచి నేరుగా కూరగాయలను వినియోగదారుల ఇంటి వద్దకే అందించేందుకు ప్రభుత్వం https://digirythubazaarap.com వెబ్​సైట్​ రూపొందించింది. ఆన్​లైన్​లో ఈ వెబ్​సైట్​ని క్లిక్​ చేసి రైతుబజారు నుంచి నేరుగా తాజా కూరగాయలు, పండ్లు సులభంగా బుక్‌ చేసుకోవచ్చు. దీనిని స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్​ వంటి క్విక్​ కామర్స్ సేవలకు ఏ మాత్రం తీసుపోని విధంగా తయారు చేశారు. అదే విధంగా డిజిటల్​ చెల్లింపులను సైతం ప్రోత్సహిస్తున్నారు.

కేవలం ఆ సమయాల్లోనే అందుబాటులో: రైతుబజార్లలోని రైతుల వద్ద నాణ్యమైన తాజా కూరగాయలు కొనుగోలు చేసి, వాటిని నేరుగా వినియోగదారులకు సరఫరా చేస్తారు. అయితే ఇది అన్ని వేళల్లో అందుబాటులో ఉండదు. కేవలం రైతుబజారు పని చేసే సమయాల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు ఉన్నారు.

ట్రయల్‌ రన్‌లో భాగంగా ప్రస్తుతం డెలివరీ బాయ్స్‌ ఎంవీపీ రైతుబజారు నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని వినియోగదారుల ఇళ్లకు వెళ్లి కూరగాయలు సరఫరా చేస్తున్నారు. మరో 2 వారాల్లో పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ముగ్గురు డెలివరీబాయ్స్‌ సేవలు అందిస్తున్నారు. వారికి మేషంట్‌ కంపెనీ జీతం చెల్లిస్తుంది.

సరకు నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రస్తుతం రైతుబజార్లకు వచ్చే కూరగాయల్లో నాణ్యత సరిగా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లి, టమాట, నాసిరకంగా ఉంటున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోర్‌ డెలివరీ విధానం ద్వారా నాణ్యమైన కూరగాయలు అందజేయకపోతే వినియోగదారులు తిప్పి పంపించే అవకాశం ఉంది. నాణ్యమైన సరకు ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ విధానానికి ఆరంభంలోనే ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సర్కార్​ కీలక నిర్ణయం - 4 రోజుల ముందుగానే రేషన్‌!

సంప్రదాయ పద్ధతిలో కూరగాయల పెంపకం - ఐదంచెల విధానంలో కొత్త తరహా సాగు