ETV Bharat / state

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ - పలు కీలక శాఖల్లో మార్పులు

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు - 45 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ - జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియామకం - ఏ అధికారి ఎక్కడకు బదిలీ?

IAS Officers Transfers In Telangana
IAS Officers Transfers In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 11:05 AM IST

|

Updated : February 26, 2026 at 11:31 AM IST

3 Min Read
Choose ETV Bharat

IAS Officers Transfers In Telangana : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు మొత్తం 45 మంది అధికారులను ట్రాన్స్​ఫర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్​ బొజ్జాను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ రాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్​ కుమార్ నియమితులయ్యారు. ఆర్థిక, ప్రణాళిక విభాగం సెక్రటరీగా గౌరవ్​ ఉప్పల్​కు బాధ్యతలను అప్పగించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీగా దానకిశోర్​ను నియమించారు. ఏయే విభాగాలకు ఎవరిని నియమించారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఏఎస్ అధికారుల బదిలీలు : సబ్యసాచి ఘోష్‌(ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఫ్లాగ్‌షిప్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్స్‌ యూనిట్‌ అండ్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ), దానకిశోర్‌(ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీలు శాఖలతో పాటు విపత్తు నిర్వహణ(రెవెన్యూ) అదనపు బాధ్యతలు), ఎన్‌.శ్రీధర్‌ (ముఖ్యకార్యదర్శి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం గనులు, జియాలజీ అదనపు బాధ్యతలు), బి.విజేంద్ర (కార్యదర్శి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు కమిషనర్‌ ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌), సంజయ్‌కుమార్‌ (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా), పమేలా సత్పతి(స్పెషల్‌ కమిషనర్, కార్మిక శాఖ), సంతోష్‌ బి.ఎం.(డైరెక్టర్, గిరిజన సంక్షేమం),

కె.విద్యాసాగర్‌(నాన్‌ క్యాడర్‌)(అదనపు సీఈఓ, పరిశ్రమలు, ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్, స్పీడ్‌), పి.కాత్యాయని(జాయింట్‌ ఎండీ, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌), ఎం.సురేందర్‌(నాన్‌ క్యాడర్‌)(అదనపు నోడల్‌ ఆఫీసర్, ప్రజావాణి), భవేశ్‌ మిశ్రా(ప్రస్తుతం పనిచేస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖలోనే స్పెషల్‌ సెక్రటరీ), గౌరవ్‌ ఉప్పల్‌(కార్యదర్శి, ఆర్థిక, ప్రణాళిక టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ అదనపు బాధ్యతలు), అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ (స్పెషల్ సెక్రటరీ, తెలంగాణ భవన్, దిల్లీ), ఎం.హనుమంతరావు (డైరెక్టర్, దేవాదాయశాఖ గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యతలు), ఇ.శ్రీధర్‌ (కార్యదర్శి, నీటిపారుదల), జితేశ్‌ వి.పాటిల్‌(సీఎండీ, టీజీఎస్‌పీడీసీఎల్‌), రాహుల్‌ రాజ్‌(స్పెషల్‌ కమిషనర్, కోఆపరేటివ్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌), సిక్తా పట్నాయక్‌(ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ), డి.దివ్య(స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్, ప్రజావాణి), ముషారఫ్‌ అలీ ఫారూఖీ(సీఎండీ, 3వ డిస్కం)లను నియమించారు. మరోవైపు పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను కూడా నియమించారు.

పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లు : యాదాద్రి భువనగిరి జిల్లాకు అనురాగ్‌ జయంతి, జనగామకు సందీప్‌కుమార్‌ ఝా, జోగులాంబ గద్వాల జిల్లాకు రిజ్వాన్‌ బాషా షేక్‌, కరీంనగర్‌ జిల్లాకు చిత్ర మిశ్రా, సిరిసిల్లకు గరిమ అగర్వాల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అంకిత్, వికారాబాద్​ జిల్లాకు దీపక్ తివారీ, మెదక్ జిల్లాకు ప్రతిమాసింగ్, హనుమకొండకు చాహత్ బాజ్​పాయ్(గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్​గా అధనపు బాధ్యతలు), మహబూబ్​నగర్ జిల్లాకు కలెక్టర్​గా ఖుష్బూ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లు: నిర్మల్ జిల్లాకు అదనపు కలెక్టర్​గా బి. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. వరంగల్​కు వైవీ గణేశ్, వికారాబాద్​ జేసీగా ఉమాశంకర్, నారాయణపేట జిల్లా జి. ఫణీంద్రరెడ్డి, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాకు ఫైజాన్ అహ్మద్ లను ప్రభుత్వం నియమించింది.

ప్రజాావాణి నోడల్ ఆఫీసర్​గా దివ్య : ప్రజావాణి స్టేట్​ నోడల్ ఆఫీసర్​గా డి.దివ్య నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్​గా ఎం.హనుమంతరావుకు బాధ్యతలు అప్పగించారు. కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్​గా పమేలా సత్పతి నియమితులయ్యారు. జనగామ జిల్లా కలెక్టర్‌గా సందీప్‌ కుమార్‌ ఝా బదిలీ అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్‌ జయంతిని ప్రభుత్వం నియమించింది.

అడిషనల్ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) : పి.చంద్రయ్య(మంచిర్యాల), ఎన్‌.ఖీమ్యా నాయక్‌(వనపర్తి), అబ్దుల్‌ హమీద్‌(సిద్దిపేట)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ - సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్

బదిలీకి నై, ఉన్నచోటుకే సై - ఆ జిల్లాలో ఉద్యోగుల పైరవీల రాజ్యం

Last Updated : February 26, 2026 at 11:31 AM IST