ETV Bharat / state

ఖాతాలోకి డబ్బులు - 100 బోట్లలో ర్యాలీగా వచ్చి ప్రభుత్వానికి మత్స్యకారుల కృతజ్ఞతలు

మత్స్యకారుల సేవలో రెండో ఏడాది నిధులు - కృతజ్ఞతగా బోట్ల ర్యాలీ - మత్స్యకారులకు లోకేశ్ ఆత్మీయ స్వాగతం - మాట మీద నిలబడే తత్వం మత్స్యకారుల నుంచే నేర్చుకోవాలన్న మంత్రి

Fishermen Rally in 100 Boats to Express Gratitude to Government
Fishermen Rally in 100 Boats to Express Gratitude to Government (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2026 at 2:07 PM IST

|

Updated : May 19, 2026 at 2:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Fishermen Rally in 100 Boats to Express Gratitude to Government: 'మత్స్యకారుల నుంచే మాట మీద నిలబడే తత్వం అందరం అలవర్చుకోవాలి’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘మత్స్యకారుల సేవలో’ రెండో ఏడాది నిధుల విడుదల సందర్భంగా వంద బోట్లపై వచ్చిన మత్స్యకారులు సీఎం, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులను ఇంటికి ఆహ్వానించిన మంత్రి లోకేశ్ వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మీయ ఆతిథ్యం అందించారు.

మత్స్యకారుల నుంచే మాట మీద నిలబడే తత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమం కింద రెండో ఏడాది నిధులు విడుదల చేసిన సందర్భంగా వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంలకు చెందిన మత్స్యకారులు వంద బోట్లతో కృష్ణా నదిలో ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రికి, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఖాతాలోకి డబ్బులు - 100 బోట్లలో ర్యాలీగా వచ్చి ప్రభుత్వానికి మత్స్యకారుల కృతజ్ఞతలు (ETV Bharat)

ఇంటికి రమ్మని ఆహ్వానం: బోట్లపై వచ్చిన మత్స్యకారులను ఇంట్లో నుంచి చూసిన మంత్రి లోకేశ్ వారికి అభివాదం చేస్తూ ఇంటికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించారు. అంతా కలిసి ఒక్క మాట అనుకుంటే, దానిపై మత్స్యకారులు నిలబడతారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం ఎంత ధ్వంసమైందో అందరూ చూశారని, అయినా మత్స్యకారులు ఎన్ని కష్టాలు పడినా పిల్లలను బాగా చదివిస్తున్నారని ప్రశంసించారు.

'మత్య్సకారుల పట్టుదలే వేరు. యువగళం పాదయాత్రలో మీరు చూపించిన క్రమశిక్షణ ఎన్నటికీ మర్చిపోలేను. మాట మీదే నిలబడుతారు. మీలో ఐక్యత చాలా గొప్పగా ఉంటుంది. మీ నుంచి మేము చాలా నేర్తుకోవాలి. మత్స్యకారుల కోసం ప్రభుత్వం మెరుగైన సేవలందిస్తుంది. మీకేం కావాలన్నా ధైర్యంగా అడగొచ్చు. ఇది మన ప్రభుత్వం, ఏ సమస్య వచ్చినా మీరు ఇక్కడికి రావచ్చు. ఎలాంటి సహాయమైనా అడగొచ్చు.' -లోకేశ్​, మంత్రి

జువ్వలదిన్నెలో డిఫెన్స్ కంపెనీ: పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఇందులో భాగంగానే జువ్వలదిన్నెలో డిఫెన్స్ కంపెనీకి శంకుస్థాపన చేశామన్నారు. తమిళ జాలర్లు మన వైపు రాకుండా, వాళ్లకు మనకు మధ్య సర్వేలెన్స్ కోసం అటానమస్ పెట్రోలింగ్ బోటును సాగర్ డిఫెన్స్ కంపెనీ ఏర్పాటు చేయనుందని వివరించారు.

మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి: మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య అయినా ఎప్పుడూ తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ఇంట్లో కూర్చోబెట్టుకుని మత్స్యకారులందరితోనూ ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలు దిగారు. తాము సీఎంకు కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే మంత్రి లోకేశ్ తమకు ఆత్మీయ ఆతిథ్యం అందించారని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు.

మత్స్యకారుల సేవలో: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ఈ నిధులు అందిస్తున్నారు. తీరప్రాంత భద్రతతో పాటు సముద్ర జాలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డ్రోన్లు, పెట్రోలింగ్ బోట్లతో అక్రమ వేటను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

తీరానికి రక్షణ - మత్స్యకారులకు వరం - నిజాంపట్నం కోరల్ క్లస్టర్

జగన్​కు ఇదేం రాక్షస మ‌న‌స్తత్వం - ఉద్యోగాలు వ‌స్తాయంటే అడ్డుకుంటాన‌న‌డం సైకోయిజ‌మే: మంత్రులు

Last Updated : May 19, 2026 at 2:40 PM IST