ETV Bharat / state

సోలార్ వెలుగులు, ఇంకుడుగుంతలు - పర్యావరణ మిత్రగా ఫ్యూచర్​సిటీ బిల్డింగ్

నెట్​ జీరో భవనంగా ఎంపిక చేసిన ఇండియన్ గ్రీన్​ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధులు - పర్యావరణ మిత్ర భవనంగా ఫ్యూచర్​సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ భవనం గుర్తింపు - రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం

Future City Development Authority
ఫ్యూచర్​సిటీలో రేవంత్ రెడ్డి(File Photo) (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 9, 2026 at 12:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

FCDA Building Got Environmental Protection Identity : భారత్‌ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌సీడీఏ) నూతన కార్యాలయం ప్రారంభానికి ముందే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపును సాధించింది. భవన నిర్మాణంలో పర్యావరణానికి హాని కలగని పదార్థాలు వినియోగిస్తుండటం, కురిసిన ప్రతి వాన బొట్టునూ వృథా కాకుండా భూగర్భంలోకి మళ్లించేలా శాస్త్రీయ వాననీటి సంరక్షణ వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. సోలార్​పవర్​ వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఈ కార్యాలయాన్ని నెట్‌ జీరో బిల్డింగ్‌ కింద ఎంపిక చేయడం విశేషం.

Future City Development Authority
Future City Development Authority Building (Eenadu)

సీఎం చేతుల మీదుగా ప్రారంభం : అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్‌సీడీఏ ఆఫీస్​ ప్రారంభం చేయడానికి బుధవారం అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఎఫ్​డీసీఏ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సమీపంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

సౌరవిద్యుత్‌, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, బయో డైజెస్టర్‌

  • ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో అధునాతన పర్యావరణ పరిరక్షణ దిశగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
  • 15 కిలోవాట్ల సోలార్ విద్యుత్‌ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఇది కాలుష్య రహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, కర్భన ఉద్గారాలను తగ్గిస్తుంది
  • అధికారులు, మల్టీనేషనల్​ కంపెనీల ప్రతినిధులు ఈవీ కార్లలో వస్తే వాటి కోసం రెండు ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
  • కార్యాలయ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ వ్యర్థాలతో బయోగ్యాస్, ఎరువులను ప్రోడ్యూస్​ చేయనున్నారు. ఇందుకు బయో డైజెస్టర్‌ ప్లాంటును సైతం అక్కడే ఏర్పాటుచేశారు.
  • ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ హోదాలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రత్యేక ఛాంబర్లను ఏర్పాటు చేశారు.
  • ఐటీ, సాఫ్ట్​వేర్​ కంపెనీల తరహాలో వర్క్‌స్టేషన్లను నిర్మాణం చేశారు.
  • ఫ్యూచర్‌సిటీలోని భవిష్యత్తులో రాబోయే ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల అభివృద్ధికి ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా ఎఫ్​సీడీఏ కార్యాలయం మారనుంది.

ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికం కానుంది : పొంగులేటి, శ్రీధర్‌బాబు

నాకు పదేళ్ల సమయం ఇవ్వండి, న్యూయార్క్​ను మరిపించే నగరం కడతా : సీఎం రేవంత్​