సత్యసాయి సంజీవని హార్ట్కేర్లో ఉచిత శస్త్రచికిత్సలు - వీరికి మాత్రమే చేస్తారు
సిద్దిపేట జిల్లా కొండపాకలో కేంద్రం - పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసా - 336 మంది ప్రాణం నిలిపిన వైద్యులు - పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు మాత్రమే ఇక్కడ శస్త్ర చికిత్స, సర్జరీలు

Published : February 27, 2026 at 3:34 PM IST
Free Surgeries at Sathya Sai Sanjeevani Heartcare : అభం శుభం తెలియని పని మనసులు వారు. కానీ హృద్రోగ సమస్యలతో ఆ చిన్ని గుండెలు తల్లడిల్లుతుంటే, వారికి తోడుగా మేమున్నాం అంటూ అక్కున చేర్చకుంటోంది సిద్దిపేట కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయడానికి కోట్లలో ఖర్చు అవుతుంది. కానీ ఈ హస్పిటల్ మాత్రం ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి ఎన్నో పసి ప్రాణాలను కాపాడుతోంది. అత్యాధునిక వైద్యాన్ని మాత్రం పూర్తి ఉచితంగా అందిస్తూ బాధాతప్తులకు సాంత్వన చేకూర్చుతోంది.
336 మంది చిన్నారులకు చికిత్స : ఈ సెంటర్ ఎంతో మనోవేదనకు గురైన ఆ కన్నవాళ్లను ఓదార్చుతూ తమ పిల్లల ఆరోగ్య భవిష్యత్తుకు భరోసానిస్తోంది. ఈ సత్యసాయి సంజీవని సెంటర్లో ఇప్పటివరకు ఇండియాతో పాటు మరో 14 దేశాలకు చెందిన 233 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 మంది పిల్లలకు కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతంగా పూర్తి చేసి 336 మంది పసిప్రాణాలను కాపాడినట్లు సంస్థ ఛైర్మన్ డా.సి. శ్రీనివాస్ తెలిపారు.
దేశంలో ఉన్న అన్ని సెంటర్లలో ఉచితం : భారతదేశంలో ప్రతి ఏడాది 3.5 లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతోనే జన్మిస్తున్నారు. కానీ వారిని కొంతమందికి సరైన వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఇలాంటి వారికి శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్‌కేర్ అండ్ రీసెర్చ్ అండగా నిలుస్తోంది. కేవలం సిద్దిపేట జిల్లాలోని కొండపాకలోనే కాకుండా నయా పల్వాల్ (హరియాణా), రాయ్‌పుర్ (ఛత్తీస్‌గఢ్), నవీ ముంబయి( మహారాష్ట్ర)లలోనూ మరిన్ని రిసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి పూర్తి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు.
24 గంటల పాటు వైద్యసేవలు : సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రుల్లో పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధులతో జన్మించిన శిశువులకు శస్త్రచికిత్స మొదలుకొని ఔషధాల వరకు అంతా ఫ్రీగానే. చిన్నారితో పాటు ఇద్దరికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ ఆసుపత్రి వలంటీర్లు మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో శిబిరాలు నిర్వహించి మరి లోపాలున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. కొండపాకలో 2024 నవంబర్ 23వ తేదీన హృదయాలయాన్ని ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్లో వంద పడకల సామర్థ్య ఉన్న ఆసుపత్రిలో మోడ్రన్ టెక్నాలజీతో వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు, పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలపాటు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఇక్కడ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఉంది. సాధారణ శస్త్రచికిత్సలలో శరీరాన్ని పెద్దగా కోయాల్సి ఉంటుంది. కానీ దీనిలో అయితే శరీరంలోని రక్తనాళాల ద్వారా నుంచి సన్నని గొట్టాన్ని (క్యాథెటర్) గుండె వరకు పంపించి పరీక్షలు చేస్తారు.
పుట్టుకతో వచ్చే లోపాలకే చికిత్స : ఈ రిసెర్చ్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు మాత్రమే ఇక్కడ శస్త్ర చికిత్స, సర్జరీలు చేస్తారు. గుండెకు రంధ్రం, వాల్వ్‌ల పనితీరు దెబ్బ తినడం, వ్యవస్థ సరిగా లేకపోవడం, ప్రతిస్పందనలు కొరవడడం, అలాగే రక్తసరఫరాలో తేడాలు ఇలా వంద రకాల సమస్యల్ని పరిష్కారాలున్నాయి. తల్లి గర్భంలోనే ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన గుండె సమస్యలు (కంజెనిటర్ హార్డ్ డిఫెక్ట్స్)కు మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు.
ఇలా సంప్రదించాలంటే : ఇక్కడ కనిపిస్తున్న 80101 19000 నంబరుకు కాల్ చేసి లేదా 70751 37733 వాట్సప్ నంబర్‌లో చాట్‌చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.
మంచి ముహూర్తం చూసుకోవాల్సిందే - ఆందోళనకర స్థాయిలో సిజేరియన్లు!
శోభన్‌బాబు మనవడి రికార్డుస్థాయి శస్త్రచికిత్సలు - గిన్నిస్ రికార్డుకు అతి చేరువలో

