ETV Bharat / state

జత దుస్తులతో వస్తే చాలు ఉచిత విద్య, వసతి - జనవరి 20 లాస్ట్​ డేట్​

పేదలకు విద్య, వసతి ఉచితంగా అందిస్తోన్న శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం - 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఏడేళ్లు బోధన - జనవరి 20వ తేదీ వరకే ప్రవేశాలు పొందవచ్చు

SATHYA SAI PRASHANTHI NIKETANAM
సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 2:42 PM IST

1 Min Read
Choose ETV Bharat

Sri Sathya Sai Prashanthi Niketanam Bala Mandir Trust in Kondapaka Siddipet : సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు పేద పిల్లలకు విద్య, వసతి ఉచితంగా అందిస్తోంది. ట్రస్టు ఆధ్వర్యంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌ ద్వారా విద్య, ఆరోగ్యం, పోషకాహార లాంటి పలు సేవలు అందుతున్నాయి. కొండపాకలో మొత్తం 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రామీణ నిరు పేదలకోసం ఏర్పాట్లు చేశారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) విధానంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్​ వరకు ఇంగ్లీష్​ మీడియంలో ఏడేళ్లు బోధిస్తారు. ఇక్కడ ఈ నెల 20వ తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చని కళాశాల ఛైర్‌పర్సన్, ప్రిన్సిపల్‌ పూర్ణిమ స్పష్టం చేశారు.

సంగీతం, నాట్యం, డ్రైవింగ్ క్రీడలు, వంటలు సైతం : ఒక జత దుస్తులతో వస్తే చాలు భారతీయ సనాతన గురుకుల విద్యను ఉచితంగా బోధిస్తారు. ఉండేందుకు వసతి సౌకర్యాలను సమకూరుస్తారు. అకడమిక్‌ విద్యతో పాటు విద్యార్థుల ఆసక్తి మేరకు సంగీతం, నాట్యం, క్రీడలు, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ వంటి ఇతర యాక్టివిటీస్ నేర్పిస్తారు. భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు, కమ్యూనికేషన్స్, లైఫ్‌ స్కిల్స్, వంటలు, డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఇస్తారు. శ్రీసత్యసాయి యూనివర్సిటీ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను సైతం విద్యార్థులు పూర్తి చేయొచ్చు. పీజీ విద్యార్థులకు ప్రతినెలా ఉపకార వేతనం అందిస్తారు. డిగ్రీ పూర్తయ్యాక వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ మిషన్‌లో రెండేళ్ల ఇంటర్న్‌షిప్‌ కోసం వేరే ప్రాంతాలకు పంపిస్తారు. ఇలా ఉచితంగా విద్యతో పాటు వసతి సౌకర్యాన్ని కల్పిస్తున్నందున అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

  • 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది.
  • విద్యార్థులు https:///srisathyasailokasevagurukulam.org/admissions-2026-27// అనే వెబ్​సైట్​ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • సిద్ధిపేట జిల్లా కొండపాక సత్యసాయి ప్రశాంతి నికేతనం క్యాంపస్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం https:///ssspnk.org/ అనే వెబ్​సైట్​ను సంప్రదిస్తే సరిపోతుంది.