ఇంట్లో గొడవ - ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
శ్రీసత్యసాయి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అదృశ్యం - నలుగురు కుటుంబసభ్యులు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు - కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 1:22 PM IST
Four Members of Same Family Missing in Sathya Sai District: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రొళ్ల మండలం హెచ్‌టీ హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన వీరేశ్ తాపీ మేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు రోహిణి, రచనతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసైన వీరేశ్ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 27వ తేదీన ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. అదేరోజు రాత్రి ఇంటి నుంచి సుబ్బమ్మ, లక్ష్మి, రోహిణి, రచన బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి బంధువులు వెతుకుతున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో మార్చి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ప్రస్తుతం వీరేశ్ పరారీలో ఉన్నట్లు ఎస్సై గౌతమి చెప్పారు.

