ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు - భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ - దిల్లీ నుంచి భోగాపురం వచ్చిన ఎయిరిండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ - జూన్‌లో విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపిన జీఎంఆర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 7:27 AM IST
|Updated : January 4, 2026 at 5:44 PM IST
First Commercial Flight Land in Bhogapuram International Airport : తొలి విమానం రన్‌వేపైకి రయ్‌మంటూ వచ్చింది. ఇది అడుగుపెట్టిన ఆరు నెలల్లో ప్రయాణికుల కోసం లోహ విహంగాలు రెక్కలు కట్టుకుని వాలనున్నాయి. కూటమి ప్రభుత్వ కృషితో నిర్దేశిత గడువుకన్నా ముందే భోగాపురం నుంచి విమానయానం అందుబాటులోకి రానుంది. నేడు ట్రయల్ రన్ నిర్వహించారు.
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాల సంసిద్ధత దిశగా అడుగులు వేస్తూ, వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిని సూచిస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఎంఆర్ గ్రూప్ నాయకత్వం సమక్షంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్‌ను నిర్వహించారు.
తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025 జూన్ మాసం నుంచి ఆపరేషన్ మొదలు కానున్న ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు(ఆదివారం) ఉదయం 11.00 గంటలకు రన్ వేపై తొలి కమర్షియల్ వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
వాటర్ సెల్యూట్ చేసి సాదరంగా స్వాగతం: అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంధిర ప్రసాద్, విజనయనగరం జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ నిర్వహకులు వాటర్ సెల్యూట్ చేసి సాదరంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జీఎంఆర్ గ్రూప్ ఉన్నతాధికారులున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనల ప్రకారం జరిగిన ఈ విమాన ప్రయాణం విజయవంతం కావడంతో, విమానాశ్రయ రస్వీ, సిగ్నల్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టమైంది. విమానాశ్రయానికి అధికారిక ఏరోడ్రోమ్ లైసెన్స్ రావడానికి ఇది అత్యంత కీలకం. సాధారణ ప్రయాణికుల కోసం వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించాలంటే ఈ ప్రక్రియ పూర్తికావడం తప్పనిసరి.
విశాఖ తూర్పు తీరం ఆర్థిక రాజధానిగా: ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ " ఏపీ అభివృద్ధిలో నేడు ఒక దారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నం తూర్పు తీరం ఆర్థిక రాజధానిగా మారనుంది. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజి పనిచేస్తుంది. ఇది ఉపాది అవకాశాలను సృష్టిస్తుంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ప్రజలకు, వ్యాపారాలకు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ విమానాశ్రయం వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఎగుమతులను పెంచుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పర్యాటక సామర్ధ్యాన్ని వెలికితీస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన, వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక, సమగ్ర వృద్ధి ఆధారిత విమానయాన మౌలిక సదుపాయాలను నిర్మించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనం. అందుకు అనుగుణంగా ఉన్న ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినందుకు, అంకితభావంతో పనిచేసిన భాగస్వాములందరినీ అభినందిస్తున్నా" అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ప్రయాణీకులకు అనుగుణంగా డిజైన్ల మార్పు: జీఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు మాట్లాడుతూ "భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆర్ధిక వృద్ధి ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించే ప్రపంచ స్థాయి జాతీయ ఆస్తులను సృష్టించడంలో జీఎంఆర్ గ్రూప్‌కు ఉన్న నిబద్ధతకు నిదడా రెండు దశాబ్దాలకు పైగా, భారత్ సహా విదేశాలలో కొన్ని ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయాలను నిర్మించడం, నిర్వహించడంలో జీఎంఆర్ గ్రూప్ అగ్రగామిగా నిలిచింది. విమానయాన మౌలిక సదుపాయాలను విస్తృత స్థాయి, ప్రయాణీకుల అవసరాలకు అనుగుణమైన డిజైన్ల ద్వారా మార్చామన్నారు.
మరో మైలురాయిగా భోగాపురం: విమానాశ్రయ అభివృద్ధి కార్యకలాపాలు, ఆధునికీకరణ అంతర్జాతీయ భాగస్వామ్యాలతో కూడిన ఎయిర్పోర్ట్ వ్యాల్యూ చైన్ మాకున్న లోతైన అనుభవం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే విమానయాన కేంద్రాలను అందించడంలో మమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. భోగాపురం విమానాశ్రయం ఏపీలో ఉపాది, పర్యాటకం, వాణిజ్యం అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించే ఒక శక్తివంతమైన వృద్ధి ఇంజిన్‌గా అభివృద్ధి చెందుతోంది. జీఎంఆర్ గ్రూప్ మేం, కాలపరీక్షకు నిలబడే జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆస్తులను నిర్మించడాన్ని గర్వంగా భావిస్తాం. భారత విమానయాన రంగంలో, మౌలిక సదుపాయాల అత్యున్నత ప్రమాణాల విషయంలో గ్రూప్ వారసత్వంలో భోగాపురం మరో మైలురాయిగా నిలుస్తుంది" అని వెల్లడించారు.
90 శాతానికి పైగా పూర్తి: జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు మాట్లాడుతూ "భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు 90 శాతానికి పైగా పూర్తి కావడమే కాకుండా, నిర్ణీత గడువు కంటే ముందే పురోగతిలో ఉంది. కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసిన రికార్డు జీఎంఆర్‌కు ఉంది.
భోగాపురం విమానాశ్రయాన్ని అత్యున్నత ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడం అనేది భాగస్వాములందరి సమష్టి కృషికి నిదర్శనం. కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత, ఈ విమానాశ్రయం ప్రపంచ స్థాయి సౌకర్యాలను, ప్రయాణీకులకు సులభతరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఏపీ సహా దేశం కోసం ప్రభుత్వం ఆశిస్తున్న ఆధునిక, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే విమానయాన మౌలిక సదుపాయాల దార్శనికతను మరింత బలోపేతం చేస్తుంది" తెలిపారు.
అత్యాధునిక ప్రత్యేక కార్గో టర్మినల్: భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏపీలో ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుంది ప్రభుత్వం భవిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుంది. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. తద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందంటున్నారు.
జీవీఐఏఎల్(GVIAL) ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ (PPP) నమూనాలో, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (DBFOT) ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేస్తారు. ప్రారంభంలో ఇది ఏడాదికి 6 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించేలా నిర్మిస్తున్నారు. ప్రయాణీకుల రద్దీ పెరుగుదల ఆధారంగా దీని సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తారు. ఈ విమానాశ్రయంలో ఒక ఏరోట్రోపాలిస్, ఏవియేషన్ హబ్, అత్యాధునిక ప్రత్యేక కార్గో టర్మినల్ కూడా ఉంటాయి. ఇవి సమర్ధవంత కార్గో కార్యకలాపాల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంటాయి.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం - ల్యాండ్ అయిన తొలి విమానం
దశాబ్దాల కల సాకారమవుతున్న వేళ - 2026 జాన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ సిద్ధం!

