ETV Bharat / state

రైతన్నలు 'ఫార్మర్ రిజిస్ట్రీ' చేసుకోండి - ఈ కార్టు ఉంటేనే ప్రభుత్వ పథకాలు

రైలులందరూ ఫార్మర్​ రిజిస్ట్రీ చేయించుకోవాలని పేర్కొన్న వ్యవసాయశాఖ - రైతులకు ఆధార్‌ తరహా కార్డులు - పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు తప్పనిసరి - మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రీకి అవకాశం

Farmer Registry Must for Farmers
Farmer Registry Must for Farmers (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 4:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Farmer Registry Must for Farmers : ఎనిమిది నెలల కిందట ఫార్మర్​ రిజిస్ట్రీ ప్రారంభమైంది. ఇది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్​ చేయాలన్న సంకల్పంతో కేంద్రం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. అయితే దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్​ రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతుల డిజిటల్​ డేటా బేస్​, ఫార్మర్​ రిజిస్ట్రీ ద్వారా రైతుల ఆధార్​ నంబరు, భూమి, ఇతర వివరాలు ఇందులో పొందుపరిచి ఉంటాయి. దీనిలో రిజిస్ట్రీ అయిన రైతులకు మాత్రమే కేంద్రం నుంచి వచ్చే పథకాలైన, పీఎం కిసాన్​, పంటల బీమా తదితర పథకాలు వర్తించే అవకాశం ఉంటుంది. ఇందులో నమోదు కాని వారికి ఇవి వర్తించవు.

ఫార్మర్​ ఐడీ కేటాయింపు : ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్​ రిజిస్త్రీ జరుగుతోంది. రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఫార్మర్​ రిజిస్ట్రీ చేపడుతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్​ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మసీ ఐటీని కేటాయిస్తున్నారు. ముందుగా పీఎం కిసాన్​ లబ్ధిదారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ల జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన వారికి జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

లబ్ధి పొందాలంటే రిజిస్ట్రీ​ ఐడీ తప్పనిసరి : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు నేరుగా అన్నదాతలకు చేరాలనే ఆలోచనతో ప్రత్యేకంగా వారి కార్డులను అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన కింద లబ్ధి పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీ ఐడీ తప్పనిసరి అని అధికారులు తెలుపుతున్నారు. ఇంతే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వం అందించే పలు పథకాలకు ఈ కార్డును ప్రామాణికంగా తీసుకునేందుకు వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్‌ ఐడీ) పొందేందుకు రైతు ఆధార్‌తో పాటు భూ యాజమాన్య పాస్‌ పుస్తకం, ఆధార్‌కు లింకు చేసిన మొబైల్‌ నెంబరు అవసరముంటుంది.

ప్రయోజనాలు ఇవీ :

  • కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలను సులభంగా పొందవచ్చు
  • అన్నదాత వివరాలు కచ్చితంగా నమోదైతే పారదర్శకత పెరుగుతుంది
  • పీఎం కిసాన్​ సహాయానికి ఫార్మర్​ ఐడీ తప్పనిసరి
  • రైతు బీమా రాయితీలు, రుణాలు, ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయి
  • ఒకే ఐడీతో లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది
  • స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి
  • ఫార్మర్​ రిజిస్ట్రీ చేయించుకున్నప్పుడు రైతుకు ఫార్మర్​ ఐడీ ఇస్తారు
  • భవిష్యత్​ పథకాల ప్రయోజనాలు సులభంగా ఉంటాయి

అవసరమైన పత్రాలు :

  • ఆధార్​కార్డు నంబరు
  • భూమి పాస్ పుస్తకం
  • ఆధార్​కి లింకు ఉన్న మొబైల్​ నెంబర్

రిజిస్ట్రేషన్‌ చేయించుకునే ప్రదేశాలు :

  • రైతు వేదికల్లోని వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు
  • సమీపంలో మీ సేవా కేంద్రాల్లో రూ. 15 చెల్లించి ఫార్మర్​ రిజిస్ట్రీ నమోదు చేసుకోవచ్చు

''రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలి. సకాలంలో చేసుకోవటం ద్వారా పీఎం కిసాన్​ నిధులు సైతం రైతుల అకౌంట్లో జమవుతాయి.'' - ధనసరి పుల్లయ్య, డీఏఓ, ఖమ్మం

రైతు విశిష్ట గుర్తింపు నెంబర్​ : ఆధార్​, ఆన్​లైన్​ అడంగల్​లో పేరు సరిగ్గా ఉంటే వెంటనే 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. ఆన్​లైన్​లో పట్టదారు పేరు, ఆధార్​లో రైతు పేరు 80 శాతం సరిగా ఉంటే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తై విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది. 60-80 శాతం వరకు వివరాలు సరిగా ఉంటే దీనిని పరిశీలించేందుకు లాగిన్​కు వెళ్తుంది. వారు సరిగా ఉందని భావిస్తేనే రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది.

ఆధార్​ కార్డు తరహాలోనే రైతులకు ఐడీ కార్డులు - పీఎం కిసాన్​ లబ్ధిదారులకు ఈ కార్డు మస్ట్!

కూరగాయల సాగుతో లాభాలు గడించాలా? - అయితే వీరిని ఫాలో అయిపోండి