ETV Bharat / state

'ఫిట్‌ హోగా భారత్‌' సూపర్ సక్సెస్ - చివరి రోజూ రెట్టింపు ఉత్సాహం

హైదరాబాద్ బేగంపేటలోని మయూరి కార్యాలయం ఆవరణలో ఆరోగ్య సందడి - ఫిట్ హోగా భారత్ 30 రోజుల హెల్తీ ప్రయాణం సూపర్ సక్సెస్ - రెట్టింపు ఉత్సాహంతో జుంబా డ్యాన్స్

Fit Hoga Bharat Health Challenge
Fit Hoga Bharat Health Challenge (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 4:54 PM IST

|

Updated : February 22, 2026 at 5:23 PM IST

4 Min Read
Choose ETV Bharat

Fit Hoga Bharat Health Challenge : ఆరోగ్యమే మహాభాగ్యమని, రోజు వారి దినచర్యలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కొంత సమయం కేటాయించడం అనివార్యమని వైద్యులు, యోగా, జుంబా డ్యాన్స్ ఫిట్​నెస్ నిపుణులు పేర్కొన్నారు. జీవనశైలి వ్యాధుల నియంత్రణలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఈటీవీ భారత్ పాత్ర అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ బేగంపేటలోని మయూరి కార్యాలయంలో ఆదివారం ఈటీవీ భారత్ - ఫిట్ హోగా భారత్ గ్రౌండ్ మీటప్​లో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.

విభిన్న కథనాలు, తాజా వార్తలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఈటీవీ భారత్ ఇలాంటి హెల్తీ ఛాలెంజ్ తీసుకురావడం సామాన్యుల పాలిట వరం అని వక్తలు అభిప్రాయపడ్డారు. యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్​నెస్ కార్యక్రమాలు, శిక్షణ చాలా ఖర్చుతో కూడుకున్నవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకువచ్చి 30 రోజుల పాటు ఉచిత ప్రవేశం కల్పించడంపై ప్రతి ఒక్కరూ అభినందించారు.

పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు : ఈటీవీ భారత్ ఫిట్ హోగా భారత్ 30 రోజుల ఛాలెంజ్ జనవరి 19 ప్రారంభమైంది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్​నెస్ ఆన్​లైన్ సెషన్స్​తో పాటు ప్రతి ఆదివారం గ్రౌండ్ మీటప్​లో పాల్గొనే అవకాశం కల్పించారు. 30 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ తీసుకున్నారు.

యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు : ఈటీవీ భారత్ చేపట్టిన ఫిట్ హోగా భారత్ 30 రోజుల ఛాలెంజ్ చివరి గ్రౌండ్ మీటప్ ఆదివారం బేగంపేటలో జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా మయూరి కార్యాలయం ఆవరణలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది. గృహిణులు, యువతులు, వృద్ధులతో పాటు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు వేకువజామునే చేరుకున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రషీదా సిధ్​పూర్వాలా యోగా శిక్షణ ఇచ్చారు. తేలికపాటి ఆసనాలు నేర్పించడంతో పాటు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పద్మాసనం, హలాసనంతో పాటు పలు యోగా భంగిమలు, వాటి ప్రాధాన్యతను వివరించారు.

నిత్యం యోగా, ధ్యానం సాధన చేయాలని తద్వారా జీవనశైలి వ్యాధుల్లో ప్రధానమైన ఒత్తిడిని గెలవొచ్చని వివరించారు. అనంతరం 7 నుంచి 8 గంటల వరకు విజయ తుపురానీ, వనశ్రీ శర్మ ఆధ్వర్యంలో జుంబా, ఫిట్​నెస్ డ్యాన్స్ శిక్షణ ఉత్సాహభరితంగా సాగింది. పిల్లలు, పెద్దలు వయస్సును మర్చిపోయి ఆనందంతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. శరీరంపై బరువు పడకుండా, బరువులేమీ ఎత్తకుండానే ఫిట్​నెస్ ఎలా సాధించాలో చక్కగా వివరించారు. ఫిట్​నెస్ అంటే శారీరకంగా మాత్రమే చూడొద్దని, మానసికంగానూ ఫిట్​గా ఉండాలని విజయ తుపురానీ చెప్పారు.

ఆరోగ్యానికి ఆహారం కీలకం : ఫిట్ హోగా భారత్ 30 రోజుల ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రాయోజకకర్తగా వ్యవహరిస్తోన్న ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రతినిధి హరీశ్ మాట్లాడుతూ, ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యం కాపాడుకోవడం పెనుసవాలుగా మారిందన్నారు. జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో లైఫ్ ​స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యమని తెలిపారు. తినే ప్రతి స్పూన్ ఆహార పదార్థాలను సరైనవి ఎంచుకోవాలని పేర్కొన్నారు.

నిపుణుల పర్యవేక్షణలో యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్​నెస్ శిక్షణ పూర్తి ఉచితంగా అందించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రోజూ ఎంత పని ఉన్నా గంటసేపు ఆన్​లైన్ సెషన్స్​లో పాల్గొన్నామని, సెలవు రోజుల్లో నిర్వహించిన గ్రౌండ్ మీటప్​లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పచ్చని వాతావరణంలో, నిపుణుల పర్యవేక్షణలో సామూహికంగా యోగా, జుంబా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఉత్సాహంగా ఉందన్నారు.

వ్యాయామంతో ఆసుపత్రికి దూరం : మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుడు మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను వివరించారు. వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలని తెలిపారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి హాస్పిటల్ ఆధ్వర్యంలో రిఫ్రెష్​మెంట్ కోసం స్నాక్స్ ఏర్పాటు చేశారు.

"ప్రతీఒక్కరికి జీవనశైలి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది."- శ్రీనివాసరావు, మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుడు

ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వారిలో అవగాహన పెంపొందించడానికి ఈటీవీ భారత్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టిందని ఫిట్​నెస్ ట్రైనర్ విజయ తుపురానీ అన్నారు. ఈటీవీ భారత్ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్న ఆన్​లైన్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రౌండ్ మీటప్​లో పాల్గొన్నందుకు తనకూ చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఉషోదయాన ఉల్లాసంగా, ఉత్సాహంగా! - "యోగా, జుంబా డ్యాన్స్ ఫిట్​నెస్"

'కలిసొచ్చిన అవకాశం, మర్చిపోలేని మధుర క్షణం' - 2 గంటలు జోరుగా, హుషారుగా!

Last Updated : February 22, 2026 at 5:23 PM IST