'కలిసొచ్చిన అవకాశం, మర్చిపోలేని మధుర క్షణం' - 2 గంటలు జోరుగా, హుషారుగా!
బేగంపేటలోని మయూరి కార్యాలయం ఆవరణలో 2 గంటల పాటు ఉత్సాహంగా సాగిన యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్నెస్ శిక్షణ - ఈటీవీ భారత్ ''ఫిట్ హోగా భారత్ గ్రౌండ్ మీటప్"పై అభినందనల వెల్లువ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 4:55 PM IST
|Updated : February 15, 2026 at 8:46 PM IST
Fit Hoga Bharat Free Yoga Zumba Dance Fitness : 'ఉచితంగా యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్నెస్ శిక్షణ, వైద్య నిపుణుల పర్యవేక్షణలో నిత్యం ఆన్లైన్ సెషన్స్. ఇలాంటి అవకాశం మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సెలవు రోజుల్లో ఇలా ప్రత్యక్షంగా ఎంతో మందితో కలిసి ప్రాక్టీస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం" అని ఈటీవీ భారత్ ఆదివారం బేగంపేటలోని మయూరి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఫిట్ హోగా భారత్ గ్రౌండ్ ఈవెంట్లో పాల్గొన్న వారంతా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఈటీవీ భారత్ చేపట్టిన ఫిట్ హోగా భారత్ 30 రోజుల ఛాలెంజ్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు ఆరోగ్యాభిలాషులు, యోగా, జుంబా నేర్చుకోవాలనుకునే వారు బేగంపేటలోని మయూరి కార్యాలయానికి తరలివస్తున్నారు. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రాయోజకకర్తగా వ్యవహరిస్తోంది.
ఈటీవీ భారత్ వెబ్సైట్లో నిత్యం ఆన్లైన్ సెషన్స్ కొనసాగుతుండగా, వందలాదిగా రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొంటున్నారు. ఉదయం 6 గంటలకు యోగా, 7 గంటలకు జుంబా, 7.30 గంటలకు డ్యాన్స్ ఫిట్నెస్ సెషన్స్ ప్రసారం అవుతున్నాయి. ఆయా రంగాలకు చెందిన నిపుణులు యోగా - రషీదా సిధ్పూర్వాలా, జుంబా, డ్యాన్స్ ఫిట్‌నెస్‌పై విజయ తుపురానీ, వనశ్రీ శర్మ శిక్షణ ఇస్తున్నారు. ఇక ప్రతి ఆదివారం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న మయూరి భవనంలో గ్రౌండ్ ఈవెంట్ జరుగుతున్నాయి. చివరి గ్రౌండ్ ఈవెంట్ ఈ నెల 22న జరగనుంది.
ఏమిటీ హెల్త్ ఛాలెంజ్? ఆరోగ్యంపై కనీస అవగాహన, జీవన శైలి వ్యాధులపై నియంత్రణ, మానసిక, శారీరక ఫిట్నెస్ సాధించడం లక్ష్యంగా ఈటీవీ భారత్ 'ఫిట్ హోగా భారత్ - 30 రోజుల హెల్త్ ఛాలెంజ్' రూపొందించింది. వెబ్సైట్లో ప్రత్యేకంగా వైద్య నిపుణుల ఇంటర్వ్యూలు, జీవనశైలి రోగాలు - లక్షణాలపై వ్యాసాలు, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ పూర్తి ఉచితంగానే అందిస్తోంది. ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది.
ప్రశాంత వాతావరణంలో : పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో, తొలి సంధ్య వేళ నిర్వహించే ఈ ఈవెంట్ చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. యోగా నేర్చుకునే, నేర్చుకోవాలనుకునే వారికి సులభమైన పద్ధతుల్లో శిక్షణ ఈ కార్యక్రమం ప్రత్యేకత. శరీరంలో పేరుకున్న మలినాలు, అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంపై వైద్య నిపుణులు పాల్గొని సలహాలు, సూచనలు అందించారు. ఆసక్తిగా పాల్గొంటున్న వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు బహుమతులు అందించడం విశేషం. ఈవెంట్లో పాల్గొన్న వారికి మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తాగు నీరు, స్నాక్స్ అందించారు.
''ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వారిలో చైతన్యం తీసుకురావాలనే సదుద్దేశంతో ఈటీవీ భారత్ చాలా మంచి కార్యక్రమం చేపట్టింది. రోజూ ఆన్లైన్ సెషన్స్‌లో పాల్గొనడంతో పాటు ప్రతి ఆదివారం గ్రౌండ్ మీటప్‌లో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.'' - గంగాధర పాణి, షేక్‌పేట
''ఈటీవీ భారత్ చేపట్టిన ఫిట్ హోగా భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. జుంబా డ్యాన్స్ గురించి తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. కానీ ఇవాళ నేరుగా పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి.'' - శంషాద్, దిల్సుఖ్నగర్
ఆసక్తిగా, ఆనందంగా : విజయ తుపురాని ఆధ్వర్యంలో జుంబా, ఫిట్నెస్ డ్యాన్స్ కొత్త ఉత్సాహాన్నిచ్చిందని పాల్గొన్న వారు తెలిపారు. ప్రత్యేక సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ మైమరచిపోయారు. అంతకు ముందు రషీదా సిధ్పూర్వాలా యోగాసనాలు సాధన చేయించారు. శ్వాస, ధ్యాస తదితర అంశాలను చక్కగా వివరించారు.
మళ్లీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పాల్గొనాలంటే? :
- ఫిట్ హోగా భారత్ చివరి గ్రౌండ్ మీటప్ ఫిబ్రవరి 22న జరగనుంది.
- వేదిక : మయూరి ఆఫీస్, బేగంపేట (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా)
ప్రతి ఒక్కరూ పాల్గొనే ఛాన్స్ : అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపట్టిన ఫిట్ హోగా భారత్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశాన్ని ఈటీవీ భారత్ కల్పిస్తోంది. ఆన్లైన్ సెషన్స్ కోసం https://www.etvbharat.com/fit-hoga-bharat ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. గ్రౌండ్ ఈవెంట్లలో పాల్గొనాలనుకునే వారు నేరుగా సకాలంలో హాజరై పేరు నమోదు చేసుకోవచ్చు.
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఉచిత శిక్షణ 'ఈటీవీ భారత్ - ఫిట్ హోగా భారత్'
ఉషోదయాన ఉల్లాసంగా, ఉత్సాహంగా! - "యోగా, జుంబా డ్యాన్స్ ఫిట్నెస్"

