ETV Bharat / state

పప్పీల కోసం 'పాఫీ' రెస్టారెంట్ - ప్రత్యేకంగా మెనూ, పుట్టినరోజు వేడుకలు సైతం ఏర్పాటు

విశాఖలో ఆకట్టుకుంటున్న రెస్టారెంట్​ - పప్పిలో కోసం ప్రత్యేక ఏర్పాట్లు - ఈతకొలను, ప్లే జోన్​, సంగీతాన్ని వినిపించే సౌకర్యాలు, ప్రత్యేకంగా మెనూ

Pawfee Restaurant in Visakhapatnam
Pawfee Restaurant in Visakhapatnam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 8:46 AM IST

3 Min Read
Choose ETV Bharat

Pawfee Restaurant For puppies in Visakhapatnam: పెంపుడు జంతువులు ఇంట్లో మనుషులను ఎంతలా పెనవేసుకుంటాయో వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారితో పాటే కలిసి పడుకుంటూ, కలిసి తింటూ, కలిసి నడుస్తూ ఇలా ఇంట్లో ఒక మనిషిలా అవి మనుగడను సాగిస్తాయి. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కానీ పెంపుడు జంతువులను రెస్టారెంట్లకు అనుమతించరు.

విశాఖలోని పాఫీ రెస్టారెంట్: దాంతో కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి డిన్నర్ చేయాలంటే మాత్రం ఆ ఒక్కరోజు మీరు పెంచుకునే జంతువులను ఇంట్లోనే విడిచిపెట్టి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒకింత యజమానుల మనసుకు కొంచెం బాధను కలిగించే అంశంగానే భావించవచ్చు. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు పెంపుడు జంతువులకు సైతం ఆహ్వానం పలుకుతోంది విశాఖలోని పాఫీ రెస్టారెంట్ పెట్​ ఫ్రెండ్లీ రెస్ట్రో కేఫ్. ఇది ప్రధానంగా జంతు ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

పెంపుడు జంతువులకు సౌకర్యాలు: దాదాపు ఆరునెలల క్రితం విశాఖలోని సాగర్​నగర్​లో ఈ తరహా రెస్టారెంట్​ను నెలకొల్పారు. పెంపుడు జంతువుల కోసం పలు సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ రెస్టారెంట్​ ప్రవేశం పూర్తిగా ఉచితం. అయితే పెంపుడు జంతువులకు శిక్షణ పొందిన సిబ్బందితో ఇక్కడ సేవలను అందిస్తారు. ఈ పాఫీ రెస్టారెంట్ పెట్​ ఫ్రెండ్లీ రెస్ట్రో కేఫ్ రెస్టారెంట్​కు తీసుకునివెళ్లే పప్పీలకు ఈతకొలను, ప్లే జోన్​, సంగీతాన్ని వినిపించే సౌకర్యాలున్నాయి. అయితే ఈతకొలను వినియోగానికి మాత్రం కొంచెం రుసుమును తీసుకుంటారు.

పప్పీలకు స్పెషల్ మెనూ: పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా మెనూను అందుబాటులో ఉంచారు. వీటి ధరలను ప్రధానంగా పరిశీలిస్తే రూ.150 నుంచి ప్రారంభం అవుతాయి. చికెన్, మటన్​, చేప, వెజ్​ సూప్స్​, రైస్​బౌల్స్​, చిరుతిండ్లు, బిస్కెట్స్​, కీర, క్యారెట్​, వాటర్​మిలన్​ జ్యూస్​లు మొదలైనవన్నీ అందుబాటులో ఉంటాయి. ఇందులో కొన్ని జంతువులు యజమానితో కలిసి అదే టేబుల్​పై ఆహారాన్ని దర్జాగా తింటాయి.

పుట్టినరోజు వేడుకలు సైతం: పెంపుడు జంతువులకు అవసరమైన పెట్​స్టోర్​, గ్రూమింగ్ ప్రాంతాన్ని సైతం పూర్తి అందుబాటులో ఉంచారు. ఇక్కడ వైఫైను ఉపయోగించుకుని ల్యాప్​టాప్​లో పని చేసుకుంటూ ఒక కాఫీని తాగేలోపల పప్పీకి హెయిర్​ కటింగ్​, స్నానం చేయించి ఇస్తారు. అంతేకాకుండా జంతువుల పుట్టినరోజు వేడుకలకు సైతం ఇక్కడ ఏర్పాట్లు చేయడం విశేషం. ప్రత్యేకంగా డిజైన్​ చేసినట్టువంటి కేకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతోనే: ఇప్పటివరకు దాదాపు 20 కి పైగా పెంపుడు జంతువుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించామని యజమానులు మృణాళిని, బాషా దంపతులు వెల్లడించారు. పెంపుడు జంతువులతో పాటుగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడకు వచ్చి ఉల్లాసంగా గడిపి తిరిగి వెళ్లాననే మంచి ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్​ను ఏర్పాటు చేశామని వీరు తెలియజేశారు.

పప్పీలను పెంచుకోవడంలో ఉపయోగాలు: నిజానికి పప్పీలు చక్కని సొషల్ క్యాటలిస్టులు. అవి వాటిని పెంచుకునే వారు కొత్త మనుషులను కలిసేందుకు, కొత్త స్నేహితులను పొందడానికి, వేరే వాళ్లతో త్వరగా కలిసిపోవడానికి చాలా బాగా దోహదపడతాయి. ఫలితంగా వాటి యజమానుల్లో సామాజిక స్పృహ పెరిగి జీవితంలో అధిక సంతృప్తి కలుగుతుంది.

ఇంట్లో పప్పీలతో కలిసి పెరిగే పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని కొన్ని రీసెర్చులు రుజువు చేశాయి. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో కూడా ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు లాంటివి ఎక్కువగా రాకుండా ఉంటాయట. అలాగే వారిలో శారీరక శ్రమ పెరిగి బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు.

భయమేల ‘పప్పీ’ మేమున్నాంగా! - మూగజీవులకు అండగా స్వచ్ఛంద సేవకులు

కుక్కను పెంచుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్​! ఈ విషయం మీకు తెలుసా?