ETV Bharat / state

పిల్లల్లో ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని నింపాలా? - అయితే ఈ విషయాలు వారికి చెప్పండి

చిన్నారుల ఆలోచనా ధోరణి విస్తృతమయ్యేలా చర్యలు - గుడ్​టచ్​-బ్యాడ్​టచ్​పై అవగాహన - అత్యవసర సమయాల్లో ఎలా ప్రవర్తించాలో తెలిపేలా వివరణ - పిల్లల్లో ధైర్యాన్ని నెలకొల్పేలా అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి అంటున్న నిపుణులు

How To Develop Courage In Children
How To Develop Courage In Children (Getty images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 25, 2026 at 5:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

How To Develop Courage In Children : లిఫ్టులో ఇరుక్కున్న ఏడేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులను పదమూడు సంత్సరాల వయసున్న పాప ధైర్యంగా, సమయస్ఫూర్తితో కాపాడింది. దీనికి సంబంధించిన వీడియా సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. అంత చిన్న వయసులోనే ఇంతటి ప్రమాదానికి భయపడకుండా, పెద్దల నుంచి సాయం తీసుకోకుండా వారిని కాపాడిన విధానానికి ప్రతి ఒక్కరూ భేష్​ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఎలా ఎదుర్కోవాలి? : ప్రమాదాలు ఎదురైనా, ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నా, ఇతర సమస్యలు వెంటాడినా వాటికి భయపడకుండా ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను పిల్లలకు తల్లిదండ్రులతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయులు, పెద్దలూ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టసమయాల్లోనూ సమస్యలను ఎదిరించి విజయం సాధించేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు, యాజమాన్యాలూ అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

ఆలోచనా ధోరణి విస్తృతమయ్యేలా : పిల్లలను ఖాళీ సమయాల్లో ఇంటికే పరిమితం చేయవద్దని నిపుణులు అంటున్నారు. బాలల ఆలోచనా ధోరణి విస్తృతమయ్యేలా చిన్నప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనికోసం ఇంటిలోపల, బయట ఎదురయ్యే ఆపదలు ఎలా ఉంటాయో వారితో మాట్లాడాలి. వాటి నుంచి ఏవిధమైన ప్రయత్నాలు చేసి తప్పించుకోవచ్చు అనే విషయాలను వారితో చర్చించాలని నిపుణులు చెబుతున్నారు.

ఏది మంచి ఏది చెడు? : పిల్లలకు ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఏ రకంగా మెలగాలి అనే విషయాలు ఎప్పటి కప్పుడు చెప్పడం ద్వారా వారిలో ధైర్యన్ని, మంచి గుణాలను వికసింపజేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలను ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పాఠశాలలోని ఉపాధ్యాయులు సైతం వీటిపై అవగాహన కల్పించాలని అంటున్నారు. దీనికోసం పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ విషయాలపై పూసగుచ్చినట్టు వివరించండి :

  • ఇంట్లో కూరగాయలు కట్​​ చేసే కత్తులు, కత్తెరలు ఆట వస్తువులు కావని వాటిని వినియోగించడం ప్రమాదమని పిల్లలకు చెప్పాలి. వాటికి దూరంగా ఉండాలని తెలపాలి.
  • పిల్లలకు షర్టు బటన్లు, నాణేలతో ఆడుకోవద్దని చెప్పాలి. ఇవి పొరపాటున నోట్లో ఇరుక్కునే ప్రమాదముందని వారికి తెలియజేయాలి. ఒకవేళ ఇరుక్కుంటే దానిని ఎలా బయటకు తీయాలి అనే విషయాలను వివరించాలి.
  • చిన్నారులకు విద్యుత్తు పరికరాలకు దూరంగా ఉండమని చెప్పాలి. కరెంట్​ షాక్​కు ప్రమాదాల గురించి వివరించాలి. విద్యుత్​ షాక్​కు ఎవరైనా గురైతే వెంటనే ప్లగ్​ తొలగించాలి లేదా స్విచ్​ ఆఫ చేయాలని వివరించాలి.
  • అపార్ట్​మెంట్​లలో లిఫ్టులో ఇరుక్కుంటే కంగారు పడకూడదని అత్యవసర నంబరుకు సమాచారం అందించాలని తెలపాలి.
  • నివాస ప్రాంతాల్లోనే కాకుండా ఎక్కడైనా పొగలు కనిపించినా, మంటలు వ్యాప్తి చెందినా ఆ ప్రాంతం నుంచి దూరంగా పారిపోవాలని చెప్పాలి.
  • వీధిలో కుక్కులు లేదా ఏవైనా జంతువులు దాడి చేసే ప్రమాదముంది. ఇలా ఏ జంతువైనా దాడి చేసినట్టు అనిపిస్తే వాటికి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించాలని పిల్లకు తెలపాలి.

అత్యవసర పరిస్థితుల్లో :

  • పిల్లలతో తల్లిదండ్రుల ఫోన్​ నంబర్లు, ఇంటి చిరునామా తప్పిని సరిగా కంఠస్తం చేయించాలి. అనుకోని పరిస్థితులల్లో పిల్లలు తప్పిపోతే ఈ వివరాలు వారికి ఎంతగానో సాయపడతాయి. ఈ నంబర్ల సాయంతో పిల్లలు సులువుగా తల్లిదండ్రులను చేరుకుంటారు.
  • అత్యవసర సమయాల్లో డయల్​ 100, 112తో పాటు 108ను ఎలా సంప్రదించాలో పిల్లలకు నేర్పించాలి.
  • వారికి అపరిచితులెవరైనా ఇబ్బంది పెడితే నో, గో, టెల్ అనే సూత్రం పాటించాలని వివరించాలి.
  • పరిచయస్తులైనా, కొత్తవారైనా ఇబ్బంది పెడితే నో అని గట్టిగా అరవమని చెప్పాలి. తర్వాత అక్కడి నుంచి జన సంచారంలోకి వెళ్లాలని తెలపాలి (గో). తనకు ఏదైనా ప్రమాదం జరిగినా, అనుకోని సంఘటనలెదురైనా తల్లిదండ్రులు లేదా ఇంట్లోని నమ్మకస్థులతో పంచుకునేలా (టెల్​) అలవాటు చేయాలి.

గుడ్​ టచ్​ - బ్యాడ్ టచ్​ పై అవగాహన : దీనితో పాటు పిల్లలకు మంచి స్పర్శ - చెడు స్పర్శ (గుడ్​ టచ్​ - బ్యాడ్ టచ్​) పై అవగాహన కల్పించాలి. ఈ విషయంపై తల్లిదండ్రులతో పాటు పాఠశాలలోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. చిన్నారుల్లో ధైర్యాన్ని నింపేదుకు దేశభక్తుల చరిత్రలు చెప్పాలి. వారి సాహసగాథలను వివరించాలి.

చిన్నారులే లక్ష్యంగా సైబర్ నేరాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్​ అంటున్న అధికారులు

సెల్​ ఫోన్​కు దూరంగా ఉందాం - మెదడుకు పని చెబుదాం