ETV Bharat / state

ఇంజినీరింగ్ సీట్​ ఓకే - మరి జాబ్​ ఎలా? - ఏ కోర్సు, కాలేజీ బెస్ట్​!

ఇండస్ట్రీ ఏం ఆశిస్తుందన్న అంశాలను విద్యార్థులు తెలుసుకోవాలి - నెట్వర్క్ బిల్డింగ్ పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి - విద్యార్థి దశలోనే మంచి సంస్థలో ఇంటర్న్ షిప్ సాధించటం ముఖ్యం

How To Get Engineering Job
How To Get Engineering Job (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 1, 2026 at 4:33 PM IST

3 Min Read
Choose ETV Bharat

How To Get Engineering Job : ఇంజినీరింగ్ సీటు రావడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. కానీ, నాలుగు ఏళ్ల తర్వాత చేతిలో డిగ్రీతో పాటు మంచి ఉద్యోగం రావడం మాత్రం ఒక పెద్ద సవాల్. మారిపోతున్న గ్లోబల్ టెక్నాలజీకి అనుగుణంగా ఏ కోర్సు ఎంచుకోవాలి? కాలేజీల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం పుస్తకాల సిలబస్‌తో ఉద్యోగాలు సాధించవచ్చా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు, విద్యార్థులు, తల్లిదండ్రులకు సరైన దిశానిర్దేశం చేస్తున్నారు ఇండస్ట్రీ, అకాడమిక్ రంగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సైయంట్ టెక్నికల్ ట్రైనింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు.

మంచి ఉద్యోగం సాధించేందుకు టెక్నికల‌్ స్కిల్స్‌, కోడింగ్‌ మాత్రమే సరిపోతుందా? ఇందులో సాఫ్ట్‌స్కిల్స్‌ ముఖ్యపాత్ర ఏంటి? ప్రతిదీ ఏఐతో ముడిపడుతున్న ఈ రోజుల్లో యువత ఏ విధంగా తమ స్కిల్స్‌ అభివృద్ధి చేసుకోవాలి? గ్లోబల్‌ స్థాయిలో ఉద్యోగాలు సాధించేందుకు ఎలాంటి స్కిల్స్‌ ఉండాలి? బ్యాక్‌లాగ్స్‌ విద్యార్థులు సైతం మంచి ప్యాకేజీతో కొలువులు సాధించేందుకు ఏం చేయాలి? ఎలాంటి ప్రాక్టీస్‌ ఉండాలి? వంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

స్టూడెంట్ ఆసక్తి చాలా ముఖ్యం : విద్యార్థులు ఏ బ్రాంచ్​ తీసుకోవాలని అనుకుంటారో ముందుగా కుటుంబంతో కలిసి చర్చించుకోవాలి. విద్యార్థుల ఆసక్తిపై ఏ బ్రాంచ్​, ఏ కోర్సు అంటే చాలా ఆసక్తిగా ఉంటారో ఆ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు నిర్ణయాలు తప్పుడు కావచ్చు. కానీ ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలి. ఇందులో మూడు విషయాలుంటాయి. 1.సరైన బ్రాంచ్​ 2.సరైన కాలేజీ 3.విద్యార్థుల ఆసక్తి, ప్యాషన్​ చాలా ముఖ్యం. వీటిపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఈ విషయాలు తెలుసుకోవడానికి తనతో మాట్లాడుతారని సైయంట్ టెక్నికల్ ట్రైనింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.

ఏఐ వల్ల కోడింగ్​ జాబ్​లకు రిస్క్​ ఉందా : రొటీన్​ అండ్​ రిపీటెడ్​ వంటి జాబ్​లు వెళ్లిపోతాయి. ఇండస్ట్రీలో ఉన్న సామెత 'మీకు ఏఐ గురించి తెలియకపోతే, మిమ్మల్ని ఎలా భర్తీ చేయాలో ఏఐకి తెలుసు'. నిజానికి ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ మీ జాబ్​ను భర్తీ చేయడం లేదు. కానీ ఏఐ తెలిసినవారిని మీ స్థానంలో కూర్చోబెడుతుంది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ వల్ల ఉత్పత్తులు, రెవెన్యూ పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 'డేటా'నే ఆయిల్​. అదే చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇంటర్నెట్​కు ముందు ఆ తర్వాత అన్నట్లు, ఇప్పుడు కృత్రిమ మేధకు ముందు ఆ తర్వాత అన్నట్లు ఉంటుంది. డేటా, ఏఐ, ఐఓటీ, సైబర్​ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్. సీఎస్సీ కోర్​ చేస్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

విద్యార్థులకు ఇండస్ట్రీస్​పై అవగాహన ఉండాలి : విద్యార్థులను అన్ని రంగాలకు సరిపడా నైపుణ్యాలతో తయారు చేయాల్సిన బాధ్యత కాలేజీలకు ఉంటుంది. పిల్లలకు ఇండస్ట్రీస్​పై అవగాహన ఉండాలంటే వారు ఇంటర్న్​షిప్​ కూడా చేసి ఉండాలి. స్టూడెంట్స్ చాలాసార్లు వాళ్లు చేసిన ఒక్క ప్రాజెక్టు గురించి మాత్రమే నాలెడ్జ్ సంపాదించుకుంటారు. కానీ తోటి విద్యార్థులు చేసిన ప్రాజెక్టుపై కూడా ఒక గంట సమయం కేటాయించాలి.

నేర్చుకోవడానికి సిలబస్​ ఒకటి సరిపోతుందా : విద్యార్థులకు ఒక లక్ష్యం ఉండాలి. దానికోసం కష్టపడాలి. షెడ్యూల్స్​ వేసుకుని దాని ప్రకారం నేర్చుకోవాలి. ప్రస్తుతం మల్టిఫుల్​ సైట్స్​ అందుబాటులో ఉన్నాయి. ఎడెక్స్​, కోర్​సిర, లింక్​డిన్​ లెర్నింగ్ వంటివి చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకు ఫ్రీకోర్సులు ఉన్నాయి. బోరింగ్​గా అనిపించినపుడు సినిమాలా చూసుకోవాలి. ఇలా పని పట్ల ఇష్టం ఉండి, ఇంటర్నెట్​ సరిగ్గా వాడుకోవడం నేర్చుకోవాలి.

డిగ్రీ అర్హతతో "బ్యాంక్​ ఆఫ్​ ఇండియా"లో ఖాళీలు - జీతం లక్షపైనే - అప్లై చేసుకోండిలా!

ఐఐటీ దిల్లీలో ఉద్యోగాలు - ఎగ్జామ్​ లేకుండానే రూ.2 లక్షల జీతం!