ETV Bharat / state

కాసేపట్లో తమ్ముడి పెళ్లి - విద్యుదాఘాతంతో అన్న మృతి

విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలం మిర్తివలసలో విషాదం - తమ్ముడి వివాహం రోజే విద్యుదాఘాతంతో అన్న సతీశ్ మృతి - మేడపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి

Elder_Brother_Die_in_Wedding
Elder_Brother_Die_in_Wedding (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2026 at 1:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Elder Brother Dies in Younger Brother Wedding Day : అందరూ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటూ సందడిగా ఉన్నారు. ఇంతలో ఆ పెళ్లి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. తమ్ముడి పెళ్లిలో అతని అన్న అన్నీ తానై చూసుకుందామనుకున్నాడు. కానీ ఇంతలోనే విధి వారి ఇంట పెను విషాదాన్ని మిగిల్చింది. తమ్ముడి పెళ్లి అనగా అతని అన్న పెళ్లి పనులు చూసేందుకు హైదరాబాద్ నుంచి ఎంతో ఆనందంగా వచ్చాడు. కానీ అదే అతని చివరి రోజు అవుతుందని అనుకోలేదు.​ పెళ్లి కాసేపట్లో జరుగుతుంది అనగా పెళ్లి కొడుకు అన్న తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున స్నానం చేసి బట్టలు మెడపై ఆరవేస్తుండగా లైటింగ్ సీరియల్ సెట్ తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. దీంతో ఆ పెళ్లి ఇంట్లో వివాహ వేడుకలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే

విజయనగరం జిల్లాలోని సంతకవిటి మండలం మిర్తివలస గ్రామంలో పెళ్లి ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. మిర్తివలస గ్రామంలోని పొన్నాడ రమణ చిన్న కుమారుడు దిలీప్ కుమార్ పెళ్లి పనులు చేసేందుకు రెండవ కుమారుడు సతీశ్​ (32) శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి పెళ్లి పనులకు సిద్ధమవుతున్నాడు. స్నానం చేసిన తర్వాత తడి బట్టలు ఆరబెట్టేందుకు మేడ పైకి వెళ్లాడు. ఈ క్రమంలో మేడపైన తడి బట్టలు ఆరపెడుతుండగా లైటింగ్​ సీరియల్ చెట్లకు తడి బట్టలు తగడంతో సతీష్ విద్యుత్ షాక్​కు గురై అపస్మారస్థితిలోకి వెళ్లాడు.

ఏడాది కిందటే సతీష్ వివాహం : దీన్ని గమనించిన బంధువులు సతీశ్​​ని హూటాహుటిన శ్రీకాకుళం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే సతీశ్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన సతీశ్​​కు ఏడాది కిందటే వివాహమైంది. సతీశ్​ హైదరాబాదులో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పని చేస్తున్నాడు. సతీశ్​ మృతి చెందడంతో భార్య, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా వినిపిస్తున్నారు. సతీశ్​ మృతి చెందటంతో దిలీప్ కుమార్ పెళ్లి నిలిచిపోయింది.