ETV Bharat / state

ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్‌ విడుదల - దరఖాస్తు చేసుకోండిలా

ఈనాడు జర్నలిజం స్కూల్​ నోటిఫికేషన్​ విడుదల - కొత్తతరం పాత్రికేయులను తీర్చిదిద్దటమే లక్ష్యంగా అడుగులు - మార్చి 25 వరకు దరఖాస్తుల స్వీకరణ - ఏప్రిల్ 5న ప్రవేశ పరీక్ష

Eenadu Journalism School
EJS Notidfication (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 9:39 AM IST

|

Updated : March 1, 2026 at 10:46 AM IST

2 Min Read
Choose ETV Bharat

Eenadu Journalism School Notification 2026 : అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే జర్నలిస్టు వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద మంచి పట్టు మీకు ఉంటే, ఈ సమాచారం కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని కోరుతోంది ఈనాడు జర్నలిజం స్కూల్​.

ఎంపిక : మొదట వివిధ అంశాలపై రాత పరీక్షలు నిర్వహిస్తారు. అందులో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యాన్ని, ఇంగ్లీష్​ టు తెలుగు అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్ని పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రింటింగ్ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్​ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రామోజీ గ్రూప్ సంస్థ నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ, భృతి : ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది కాలం పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు రూ.15,000, తరువాతి ఆరు నెలలు రూ 16,000 చొప్పున నెలవారీ భృతి కూడా చెల్లిస్తారు.

ఉద్యోగంలో : ఈజేఎస్​లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా గొప్ప అవకాశం లభిస్తుంది. సంస్థ నియమ, నిబంధనల ప్రకారం జీతభత్యాలను ఇస్తారు.

దరఖాస్తు విధానం ఇలా చేయాలి : లింక్‌ క్లిక్‌ చేసి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ జిరాక్స్​ను అభ్యర్థులు తమ వద్ద కచ్చితంగా ఉంచుకోవాలి.

ఒప్పంద పత్రం : ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని యాజమాన్యానికి సమర్పించాలి.

అర్హతలు ఇవే

  • తేట తెలుగులో రాయగల మంచి నేర్పు
  • ఇంగ్లీష్​పై అవగాహన
  • లోకజ్ఞానం, కరెంటు అఫైర్స్​పై పట్టు
  • ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న కోరిక
  • మీడియా రంగం స్థిరపడాలనే బలమైన ఆకాంక్ష
  • 01.06.2026 నాటికి 20 నుంచి 30 మధ్య వయసు
  • ఏదైనా డిగ్రీ లేదా డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్న​ విద్యార్థులు

ముఖ్య తేదీలు

  • నోటిఫికేషన్‌ : 01.03.2026
  • ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు: 25.03.2026
  • ప్రవేశ పరీక్ష: 05.04.2026
  • కోర్సు ప్రారంభం: 01.06.2026

దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి

Last Updated : March 1, 2026 at 10:46 AM IST