ETV Bharat / state

మద్యం రవాణా కుంభకోణం కేసు అప్డేట్స్ - మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం - వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ - కారుమూరిని హైదరాబాద్‌ కొండాపూర్‌లో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు

Ap Liquor Transportation Scam Updates
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 23, 2026 at 5:34 PM IST

|

Updated : August 23, 2026 at 5:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ap Liquor Transportation Scam Updates : ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కీలక పరిమాణం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇవాళ హైదరాబాద్​ కొండాపూర్​లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం కారుమూరిని అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగిదంటే : లిక్కర్ స్కాంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైఎస్సార్సీపీ ముఠా మద్యం రవాణా కాంట్రాక్టులో కూడా దోపిడీకి తెగబడిందని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కుంభకోణంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ కొన్ని నెలల కిందట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఆర్​) నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇందులో భాగంగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ డి.వాసుదేవరెడ్డి, వైఎస్సార్సీపీ ముఠా తరఫున అన్నీ తానై వ్యవహరించిన రాజ్‌ కెసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్‌ ఇళ్లల్లో ఈడీ సోదాలు చేసింది. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురూ ప్రస్తుతం రిమాండ్‌లోనే ఉన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ సైతం వీరిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చి విచారించింది.

AP Liquor Scam Case Updates : తాజాగా ఇవాళ కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం రవాణా కుంభకోణంలో వైఎస్సార్సీపీ ముఠా రూ.195 కోట్లు దోచుకున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ తేల్చింది. అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవ రెడ్డి లిక్కర్​ రవాణా టెండర్‌ను తమ ముసుగు సంస్థ సిగ్మాకు కట్టబెట్టారని వెల్లడించింది. ఒక్కో మద్యం కేసుకు కిలోమీటరుకు రూ.13ల చొప్పున చెల్లించే రవాణా ఛార్జీలను రూ.35కు పెంచేసి దోచుకున్నట్లు తెలిపింది.

మరోవైపు కోస్తాంధ్రలో రవాణా వాహనాల కోసం సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే సంస్థతో సిగ్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని సిట్‌ తెలిపింది. ఈ సంస్థను నాటి మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు రంగంలోకి దించారని తన కుమారుడు కారుమూరి సునీల్, కోడలు కీర్తి ఆ సంస్థతో మరో ఒప్పందం చేసుకున్నట్లు సృష్టించారని గుర్తించింది. పేరుకే సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌ తప్ప నిర్వహణ మొత్తం కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీలే చూసుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలింది. ఈడీ విచారణలోనూ ఇదే వెల్లడైంది.

Karumuri Nageswara Rao Arrest : సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ వల్లు సందీప్‌ అనే వ్యక్తిదని సిగ్మా నుంచి ఆ సంస్థ ఖాతాల్లోకి రూ.68 కోట్లు చేరగా అందులోంచి రూ.15 కోట్లు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి జమైనట్లు వెల్లడైంది. మరికొంత సొమ్ము నగదు రూపంలో వారికి అందినట్లు ఈడీ గుర్తించింది. రెండు నెలల క్రితం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ చేసిన సోదాల్లో ఈ హవాలా లావాదేవీల ఆధారాలు, సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌తో కుదిరినట్లు చెబుతున్న ఒప్పంద పత్రాలు లభ్యమయ్యాయి. ఒప్పందపత్రం అసలైనదేనా? హవాలా లావాదేవీల ఇతర వివరాలేంటనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేస్తోంది.

మద్యం రవాణా కుంభకోణం - హవాలా లెక్క తేల్చనున్న నోటు ముక్క

మద్యం రవాణా కేసులో సునీల్​కు 14 రోజుల రిమాండ్‌ - మాజీ మంత్రి కారుమూరికి ఈడీ నోటీసులు

Last Updated : August 23, 2026 at 5:44 PM IST