ETV Bharat / state

గంజాయి పట్టిస్తే రూ.5 వేల బహుమతి- తాగేవారిని పట్టిస్తే రూ.1,500 : ఈగల్​ టీం

ఈగల్ ఛాలెంజ్'ని ప్రారంభించిన విజయవాడ సీపీ - గంజాయిని అరికట్టేందుకు పోలీసుల ప్రయత్నం - గంజాయిని తీసుకువస్తూ లేదా విక్రయిస్తున్న వారిని పట్టిస్తే నగదు బహుమతి

Eagle Challenge To Reduce The Ganja Supply In State
ఈగల్ ఛాలెంజ్'లో భాగంగా మాదక ద్రవ్యాలపై అడ్డుకట్ట (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 24, 2026 at 12:15 PM IST

2 Min Read
Choose ETV Bharat

Eagle Challenge To Reduce The Ganja Supply In State : ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ఏపీ పోలీస్ ప్రత్యేక విభాగం 'ఈగల్' సరికొత్త ప్రజా భాగస్వామ్య వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ నగర పోలీస్ విభాగం 'ఈగల్ ఛాలెంజ్' పేరిట ఒక వినూత్న నగదు బహుమతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈగల్ టీమ్ తీసుకుంటున్న ముఖ్యమైన చర్యల వివరాల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం.

కార్యక్రమాన్ని ప్రారంభించిన అజిత్​సింగ్​ : విజయవాడ నగరంలో గంజాయిని తీసుకువస్తూ లేదా విక్రయిస్తూ ఎవరైనా పట్టుబడితే రూ. 5,000, అలాగే గంజాయి సేవిస్తూ (ధూమపానం చేస్తూ) పట్టుబడితే రూ. 1,500 బహుమతి ఇస్తామని విజయవాడ నగర పోలీసులు ప్రకటించారు. విజయవాడలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ ఎస్.వి. రాజశేఖర బాబు, 'ఈగల్' ఐజీ ఎ.కె. రవికృష్ణ తెలిపారు. ఆదివారం విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ సెయింట్ ఆన్స్ స్కూల్‌లో 'ఈగల్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన కార్యక్రమాలను వారు వివరించారు.

నగదు బహుమతిని ప్రకటించిన ఈగల్​ : ఇటీవల ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసులకు సంబంధించి 1,287 మందిని పోలీసులు విచారించారు. వీరిలో 1,000 మందికి పైగా పరీక్షల్లో నెగటివ్ ఫలితం వచ్చింది. అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరీక్షించిన 469 మందిలో 128 మందికి గంజాయి పాజిటివ్ అని తేలింది. గంజాయి సేవించిన 129వ వ్యక్తి గురించి సమాచారం ఇస్తే రూ. 1,500 నగదు బహుమతి ఇస్తామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ చంద్రశేఖర్ ప్రకటించారు. గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం అందిస్తే రూ. 5,000 బహుమతి ఇస్తామని తెలిపారు.

ఈగల్ కాల్ సెంటర్ ద్వారా సేవలు : 32 మందిపై ఎన్​డీపీఎస్​ చట్టం కింద చర్యలు 'ఈగల్ ఛాలెంజ్'లో భాగంగా, గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై ఎన్​డీపీఎస్​ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు సీపీ ఎస్.వి. రాజశేఖర బాబు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకే 'ఈగల్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 40,000 విద్యాసంస్థల్లో 'డ్రగ్స్ నో బ్రో' పేరుతో 'ఈగల్ క్లబ్స్' ఏర్పాటు చేశామని, 849 హాట్‌స్పాట్‌లను గుర్తించామని ఈగల్ ఐజీ ఎ.కె. రవికృష్ణ తెలిపారు. 'ఈగల్ కాల్ సెంటర్' ఏర్పాటు చేసిన తర్వాత తల్లులు స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఈగల్ బృందం చేపట్టిన కార్యకలాపాలను 'ఈగల్' కార్యక్రమం వివరిస్తుంది.

గుట్టు చప్పుడు కాకుండా మత్తు దందా - పోలీసుల అదుపులో గంజాయి కింగ్‌పిన్

యువత గంజాయికి దూరంగా ఉండి క్రీడల్లో ముందుకు సాగాలి: హోంమంత్రి అనిత