ETV Bharat / state

యూనిఫామ్‌ వేసుకునే అవకాశం రాలేదు కానీ సైనికుడికి ఆయుధాన్ని అందించే స్థాయికి ఎదిగింది 'ఆమె'

సరిహద్దుల్లో తుపాకీ పట్టాలన్నా, యుద్ధ విమానం నడపాలన్నా ‘ఆమె’ కు ప్రవేశం లేని రోజుల్లో తన కల నెరవేర్చుకుంది డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ చంద్రిక కౌశిక్​

Dr Chandrika Kauhik Woking as Director General of DRDO
Dr Chandrika Kauhik Woking as Director General of DRDO (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 11:49 AM IST

4 Min Read
Choose ETV Bharat

Dr Chandrika Kauhik Woking as Director General of DRDO : సరిహద్దుల్లో తుపాకీ పట్టాలన్నా, యుద్ధ విమానం నడపాలన్నా ‘ఆమె’ కు ప్రవేశం లేని రోజులవి. అయినా ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి అందులో చేరాలని కలలు కన్నారు. కాలం తనకి యూనిఫామ్‌ వేసుకునే అవకాశం ఇవ్వలేదు. కానీ, యూనిఫామ్‌ వేసుకున్న సైనికుడికి ఆయుధాన్ని అందించే స్థాయికి చేర్చింది. ఆమే డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ (పీసీ అండ్‌ ఎస్‌ఐ) చంద్రిక కౌశిక్‌.

చంద్రిక కౌశిక్​ చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలనీ, దేశం కోసం పోరాడాలనీ బలమైన కోరికతో ఉండేవారని తాను చెప్తున్నారు. కానీ చంద్రిక డిగ్రీ పూర్తి చేసే నాటికి (1990ల్లో) అమ్మాయిలు ‘ఫైటింగ్‌ ఫోర్స్‌’లో చేరే అవకాశం లేదు. కేవలం డాక్టర్లు, నర్సులుగానే తీసుకునేవారు. అప్పుడే తనకు ఓ ఆలోచన వచ్చిందని చెబుతున్నారావిడ. తాను నేరుగా యుద్ధం చేయలేకపోయినప్పటికీ యుద్ధం చేసే సైనికుడికి అవసరమైన ఆయుధాన్ని తయారుచేసి ఇవ్వగలని అనుకున్నారు. అలా బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ఎంచుకున్నారు. అప్పటికి ఆ సబ్జెక్టు దేశంలోనే కొత్త. చంద్రికది బహుశా దేశంలోనే తొలి లేదా రెండో బ్యాచ్‌ అని చెబుతున్నారామె. బీఎస్సీ పూర్తయ్యాక మాస్టర్స్‌ చేసి 1991లో డీఆర్‌డీవోలో అడుగుపెట్టారామె. 30 ఏళ్ల ఈ ప్రయాణంలో ఎన్నో క్షిపణి వ్యవస్థలు, రాడార్ల తయారీలో భాగమయ్యారు.

అమ్మే మొదటి రోల్​మోడల్​ : చంద్రిక కౌశిక్​ది దిల్లీ. తనది సాధారణ మధ్యతరగతి కుటుంబం. 40 ఏళ్ల క్రితం ఒక్కరి సంపాదనతో నలుగురు ఆడపిల్లలను పెంచడమంటే మాటలు కాదు. అమ్మ ‘సంతోష్‌’ కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించేవారు. తను సంస్కృతంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్, స్కూల్‌ ప్రిన్సిపల్‌గా రిటైర్‌ అయ్యారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సర్దుకుపోవడం తనే నేర్పారని చెబుతున్నారు చంద్రిక. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ తాను చదువుకునేది చంద్రిక. తానూ తన తోబుట్టువులు ఎప్పుడూ ఖరీదైన బట్టలు వేసుకోలేదని, విలాసాలు ఎరుగని.

కానీ వాళ్ల అమ్మ ఒకే మాట చెప్పేదని ‘తిండి, దుస్తుల విషయంలో రాజీ పడదాం, కానీ మీ చదువు విషయంలో మాత్రం రాజీ లేదు. అదొక్కటే మీ తలరాతను మారుస్తుంది’ అని చెప్పావారని చంద్రిక వివరిస్తున్నారు. అనారోగ్యం ఉన్నా, కష్టాలు చుట్టుముట్టినా ఆవిడ ఎప్పుడూ కుంగిపోలేదని. అమ్మే తన మొదటి రోల్‌ మోడల్‌ అని చెబుతున్నారు. ‘పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎదుర్కోవాలి’ అనే ఆత్మవిశ్వాసాన్ని అమ్మే అందించిందంటున్నారు.

ఆ ప్రాజెక్ట్​ అద్భుతం : తన కెరియర్‌లో అత్యంత సవాలుతో కూడిన, సంతృప్తినిచ్చిన ప్రాజెక్ట్‌ ‘యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌’ (సరిహద్దుల్లో డ్రోన్లతో జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడం) అని చెబుతున్నారు చంద్రిక. ఆరేళ్ల కిందట ప్రపంచం ఇంకా డ్రోన్‌ దాడుల గురించి పెద్దగా భయపడట్లేదని, కానీ మన సరిహద్దుల్లోకి మాత్రం వాటితో ఆయుధాలు, డ్రగ్స్‌ రవాణా అయ్యేవని, అప్పుడు చంద్రిక బృందం రంగంలోకి దిగింది. ఒక డ్రోన్‌ను పసిగట్టడానికి రాడార్, దాన్ని జామ్‌ చేయడానికి జామర్, అవసరమైతే కాల్చడానికి లేజర్‌ ఇలా వేర్వేరు ల్యాబ్‌ల సాంకేతికతను ఒక్కచోట చేర్చి ఓ అద్భుతమైన రక్షణ కవచాన్ని తయారుచేసినట్లు పేర్కొన్నారు. శత్రువు ఆలోచించేలోపే మనం పరిష్కారం కనుగొన్నాంమన్నారు.

అదే పెద్ద సపోర్ట్​ : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో, ముఖ్యంగా డీఆర్‌డీఓలో మహిళల సంఖ్య ఇంకా 20 శాతానికి మించలేదన్నది వాస్తవమని చంద్రిక తెలుపుతున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళ ఉన్నత స్థాయికి ఎదగడం అంత సులువు కాదని, ఆఫీసులో ఎంత పెద్ద సైంటిస్ట్‌ అయినా, ఇంటికి వెళ్లాక అమ్మగా, భార్యగా బాధ్యతలు మోయాల్సిందేనని అంటున్నారు చంద్రిక. పురుషులతో సమానంగా గుర్తింపు రావాలంటే మనం వాళ్లకంటే రెట్టింపు కష్టపడాలని, కానీ, సహకరించే కుటుంబం దొరకడం తన అదృష్టం అని అమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని స్వతంత్రంగా పెంచాలని, చిన్నప్పటి నుంచే వాళ్ల పనులు వాళ్లు చేసుకునేలా అలవాటు చేస్తే మన కెరియర్‌కి అదే పెద్ద సపోర్ట్‌ అని ఆమె తెలుపుతున్నారు.

'ఆడపిల్లలు ఎంత పెద్ద కలలైనా కనండి' : రక్షణ రంగంలో కేవలం పరికరాలను అసెంబుల్‌ చేయడం కాదని, వాటి వెనక ఉన్న ‘బ్రెయిన్‌’ (సాంకేతికత) మనది కావాలని అంటున్నారు చంద్రిక. రాబోయే రోజుల్లో యుద్ధ తంత్రం పూర్తిగా మారబోతోందని, శబ్ద వేగాన్ని మించి దూసుకెళ్లే ‘హైపర్‌ సోనిక్‌’ క్షిపణులు భవిష్యత్తు ఆయుధాలని, వీటిని పసిగట్టడం, అడ్డుకోవడం ఒక పెద్ద సవాలని అంటున్నారు. ఇందులో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ) కీలకం కానుందని వివరిస్తున్నారు. 'ఆడపిల్లలు కలలు కనండి. అవి ఎంత పెద్దవైనా పర్లేదు. మీ నేపథ్యం, పేదరికం, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు.. ఏవీ మీ గమ్యాన్ని అడ్డుకోలేవ'ని చంద్రిక తెలుపుతున్నారు .

మనసులో మాట : ఒత్తిడి అనిపిస్తే హిమాలయాల ఒడిలో గడపడానికి ఇష్టపడతాను అంటున్నారు చంద్రిక. ఆ నిశ్శబ్దం ఎంతో శక్తినిస్తుందనంటున్నరు. తనను నడిపించే పుస్తకం స్వామి శివానంద రాసిన ‘బ్లిస్‌ డివైన్‌’ అని, ఎలాంటి గందరగోళం ఉన్నా అది తనకు దారి చూపిందంటున్నారు చంద్రిక. శాస్త్రవేత్త కాకపోతే తాను టీచర్‌ అయ్యేదని, పిల్లల్ని తీర్చిదిద్దడం తనకిష్టం పేర్కొన్నారు. ఆలోచన నుంచి ఉత్పత్తి (ప్రొడక్ట్‌) తయారీవరకూ ప్రతి దశలోనూ భాగస్వామినై, అది సైన్యం చేతికి వెళ్లినప్పుడు కలిగే సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని చంద్రిక వివరించారు.

తొలి ప్రయత్నంలోనే IES - నాన్న కల ఆమె ర్యాంక్​

అమ్మభాషకు అక్షరసేద్యం - రిటైర్డ్​ ఇంగ్లిష్​ టీచర్​ 'తెలుగు లిపి కాపాడుదాం'