ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు - వెంకన్న సేవలో ఐపీఎల్ క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్

తిరుమల స్వామివారి సేవలో పాల్గొన్న నటి జెనిలియా, దర్శకుడు బోయపాటి శ్రీను- వెంకన్నకు మెుక్కలు చెల్లించుకున్న సినీనటులు శ్రీ విష్ణు, సందీప్‌ సరోజ్‌- ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసిన పండితులు

Director Boyapati, Actress Genelia and Hero Sree Vishnu Visited Tirumala
Director Boyapati, Actress Genelia and Hero Sree Vishnu Visited Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 12:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Director Boyapati, Actress Genelia and Hero Sree Vishnu Visited Tirumala: తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి జెనిలియా,దర్శకుడు బోయపాటి శ్రీను,నటుడు శ్రీ విష్ణు, నటుడు సందీప్ సరోజ్​లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. అలాగే వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నటి జెనిలియా, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు శ్రీ విష్ణు, సందీప్ సరోజ్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.


టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్​ సాధించాలి: ఐపీఎల్ క్రికెటర్ వెంకటేశ్​ అయ్యర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వెంకటేశ్​ అయ్యర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వెంకటేష్ అయ్యర్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను. టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్​ను సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

రేపు శ్రీవారి దర్శనాలకు బ్రేక్​: మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గం.కు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3. 20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ కాలం. 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సాయంత్రం గ్రహణం వీడిన తర్వాత శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభమవనున్నాయి.

రేపటి బ్రేక్ దర్శనాలకు ఈ రోజు సిఫార్సు బ్రేక్ లేఖల స్వీకరణ అనుమతి నిరాకరణిస్తున్నట్లు సంబంధిత అధికారులు వివరిస్తున్నారు. రేపు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు కాగా, ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ నెల 4న సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభం కానుంది. మంగళవారం శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. టీటీడీ విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్‌లైన్‌ టికెట్ల జారీ నిలిపివేసనట్లు స్పష్టం చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ: ఆదివారం తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండింది. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి చూశారు. ఈ క్రమంలో ఆదివారం శ్రీవారిని 83,112 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు కాగా 30,054 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి సమావేశం - రూ.5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

భక్తులకు తప్పనున్న ఇబ్బందులు - శ్రీవారికి నాణేలకు బదులుగా ముడుపు పత్రాలు