రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది - సైబర్ నేరాలు పెరిగాయి : డీజీపీ హరీష్‌కుమార్
2025లో పోలీసుల పనితీరుపై నివేదికను ప్రవేశపెట్టిన డీజీపీ - ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ - రోడ్డు ప్రమాదాలు, మహిళలపై హింస కేసులు తగ్గినట్లు వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 5:03 PM IST
AP Police Performance Report in 2025 : రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టినట్లు రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. 2025లో పోలీసుల పనితీరుపై నివేదికను డీజీపీ ప్రవేశపెట్టారు. ఏపీలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గినప్పటికీ అనుకున్న లక్ష్యాలకు చేరలేదన్నారు. గ్రామస్థాయిలో పోలీసులు చేపట్టిన చర్యలతో మహిళలపై హింస, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు తగ్గాయని వివరించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగాయని వెల్లడించారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ , గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆ డబ్బు రికవరీ అసాధ్యం : హిడ్మా ఎన్ కౌంటర్‌ను పోలీస్‌శాఖ విజయంగా, మావోల పరాజయంగా చూడలేమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు ఏపీ పోలీసులకు ప్రధాన సవాలు అని వ్యాఖ్యానించారు. డ్రగ్స్, గంజాయి వేరే రాష్ట్రాల నుంచి రవాణా తగ్గించటంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాలపై ఎక్కువగా అవగాహన ప్రజలకు ఉండాలని తెలిపారు. సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోతే డబ్బు రికవరీ అసాధ్యంగా మారుతోందని వివరించారు.
పోలీసింగ్ విధనంపై వర్క్‌షాప్ : గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రంలో క్రైం రేటు బాగా తగ్గిందని డీజీపీ వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్తు పదార్ధాల రవాణా, సెల్‌ఫోన్ల రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామన్నారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారని స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లల్లో పోలీసింగ్ ఎలా ఉంటుదనే దానిపై వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామన్నారు.
సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందని డీజీపీ వివరించారు. ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ ఎలా చేధించారో వివరిస్తామని తెలిపారు. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్కుషాపు ద్వారా అందరికీ తెలియచేస్తామన్నారు. చట్టానికి అందరూ సమానమేనని వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.
" గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తగ్గింది. మహిళలకు రక్షణ, మత్తుపదార్థాల రవాణా, సెల్‌ఫోన్ల రికవరీలో పురోగతి ఉంది. సాంకేతికత ద్వారా నేరాలను మరింత తగ్గించేలా పోలీసుల చర్యలు ఉంటాయి. పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దానిపై 2రోజుల వర్క్‌షాపు ఉంటుంది. పోలీసు విధుల్లో మార్పులు, సాంకేతికత అందిపుచ్చుకోవడంపై వివరిస్తాం. సంక్రాంతి పండుగ తర్వాత వర్క్‌షాప్ ఉంటుంది. కీలక కేసులు కూడా ప్రస్తావిస్తూ ఎలా ఛేదించారో వివరిస్తాం. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా వర్క్‌షాప్ ద్వారా తెలియజేస్తాం. చట్టానికి అందరూ సమానమే, వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు. సురక్షితమని కొందరు మావోయిస్టులు ఏపీలోకి వచ్చారు. ఎప్పటికప్పుడు నిఘా ఉంచి మావోయిస్టులను పట్టుకున్నాం. సైబర్ నేరాలకు సంబంధించి చైనాలో పెద్ద ముఠాలున్నాయి. మోసం జరిగిన వెంటనే చైనాకు నగదు వెళ్లిపోతోంది. ఇలాంటి కేసుల్లో నగదు వాపస్ అనేది కష్టమైన పని. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మహిళలకు రక్షణ, గంజాయి రవాణా, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం." - హరీష్ కుమార్ గుప్తా, రాష్ట్ర డీజీపీ
వారిపై పీడీ యాక్ట్‌లు : పేకాట క్లబ్బుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పీడీ యాక్ట్‌లు నమోదు చేసే వరకు వెళ్తామన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉండచ్చు, కానీ ఇల్లీగల్‌గా పేకాట ఆడాలని ఉండదన్నారు. డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి బెంగుళూరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న లింకులను బ్రేక్ చేసేందుకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరా అమ్మకాలపై 12 రాష్ట్రాలు, 343 మంది పాత్ర ఉందని వారిపై నిరంతర నిఘా పెట్టీ అమ్మకాలు అరికట్టే దశగా చర్యలు చేపట్టామన్నారు.
వ్యాపారులకు టోకరా వేసిన సైబర్ ముఠా - రూ.32 లక్షలు మాయం
కాగితాలపై 'సైబర్' మాయ! - నేరాలు తగ్గాయంటూ సీఎం ముందే అసత్యాలు?

