రాజధానిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నాం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
రాజధాని ప్రాంతంలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ - రాష్ట్రంలో రోజుకు 10 వేల డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించడమే లక్ష్యం- ఎయిర్‌బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒప్పందం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 26, 2026 at 11:00 AM IST
Drone Delivery Network in the Capital Region : ప్రస్తుతం డ్రోన్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. వ్యవసాయం, వైద్యం, ఈ-కామర్స్, డెలివరీలు, శాంతిభద్రత పరిరక్షణలో వీటిని విస్తృతంగా వాడుతున్నారు. తాజాగా రాజధాని అమరావతిలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ సంస్థతో అవగాహన ఒప్పందం (MOU) చేసుకుంది. గురువారం దిల్లీలోని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ, ఎయిర్‌బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంతో: అమరావతి, విజయవాడ, గుంటూరులను కలుపుతూ డ్రోన్ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇందుకుగానూ ఎయిర్‌బౌండ్ సంస్థ లాజిస్టిక్స్, ఈ-కామర్స్, హెల్త్‌కేర్ రంగాల్లోని భాగస్వాములతో కలిసి పనిచేయనుంది. వచ్చే ఏడాది రోజుకు 10 వేల డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పని చేస్తోంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ స్వదేశీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని, అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నామని తెలిపారు. దీని వల్ల కనెక్టివిటీతో పాటు ఉద్యోగాలను కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ నిరూపించనుందన్నారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఎయిర్‌బౌండ్ సంస్థ ఒక కొత్త డెలివరీ విధానాన్ని ఆరంభించడమే కాకుండా, కొత్త లాజిస్టిక్స్ వ్యవస్థకు పునాది వేస్తోందని పేర్కొనారు.
డ్రోన్ ఆవిష్కరణల రంగంలో సరికొత్త అవకాశాలు: అమరావతి రాజధాని ప్రాంతంలో డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ మధ్య జరిగిన అవగాహన ఒప్పంద (MoU) సంతకం కార్యక్రమాన్ని వీక్షించడం సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ 'డిజిటల్ ఇండియా' దార్శనికత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతికత ఆధారిత పాలన స్ఫూర్తితో, ఏపీ డ్రోన్ ఆవిష్కరణల రంగంలో సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది" అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Happy to witness the MoU signing between AP Drone Corporation and Airbound to establish the Amaravati Capital Region Drone Delivery Network.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 25, 2026
Driven by Hon'ble PM Shri @narendramodi Ji's vision of Digital India and Hon'ble CM Shri @ncbn Garu's technology-driven governance, Andhra… pic.twitter.com/5zrWFTkqmO
ఎయిర్‌బౌండ్ వ్యవస్థాపకుడు, సీఈవో నమన్ పుష్ప్ మాట్లాడుతూ డ్రోన్ డెలివరీ వస్తు రవాణా వ్యవస్థ స్వరూపాన్నే మారుస్తుందని తెలిపారు. 20 టన్నుల ట్రక్ సామర్థ్యంతో డ్రోన్లు ఒక్కో ప్యాకేజీని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా చేరవేసే నెట్‌వర్క్‌ను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
రైతులకు ఉపయుక్తంగా "అద్దెకు డ్రోన్లు" - బుక్ చేస్తే వచ్చి వాలుతుంది
విద్యుత్ లైన్ల పర్యవేక్షణకు "డ్రోన్లు" - ఏపీలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం

