ETV Bharat / state

ఇకపై కెరీర్‌ కేంద్రాల్లో ఉద్యోగ సమాచారం - మార్గదర్శకాలు ఇలా

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు ఇకపై సామాజిక భద్రత కోడ్‌ మార్గదర్శకాల్లో వెల్లడి - ఏటా మార్చి 31న ఎంప్లాయిమెంట్‌ ఇన్ఫర్మేషన్‌ నివేదిక ఇవ్వాలని సూచన

Job Information at Career Centers
Job Information at Career Centers (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 1:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Job Information at Career Centers : ప్రభుత్వ, ప్రైవేట్​ రంగ సంస్థల్లో ఉద్యోగ భర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాతీయ, ప్రాంతీయ కెరీర్​ కేంద్రాల్లో పొందుపరచాలని సామాజిక భద్రత కోడ్​ మార్గదర్శకాల్లో కార్మికశాఖ పేర్కొంది. ప్రతి ఏడాది 31న ఎంప్లాయిమెంట్​ ఇన్ఫర్మేషన్​ నివేదిక ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగులకు సమగ్ర సమాచారం, మార్గదర్శనం కోసం ఉపాధి కల్పన కేంద్రాలను డిజిటల్ కెరీర్​ కేంద్రాలుగా ఉన్నతీకరించాలని పేర్కొంది.

రాష్ట్రం కోసం కెరీర్​ కౌన్సెలింగ్​ : సామాజిక భద్రత కోడ్ మార్గదర్శకాల్లో ఉపాధి సమాచారం, పర్యవేక్షణ కింద ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలిపింది. ఇంతకముందు పేర్ల నమోదుకే పరిమితమైన ఉద్యోగ కల్పన కేంద్రాలను ఆధునికీకరించి వృత్తిపరమైన మార్గదర్శనం కోసం రాష్ట్ర ప్రభుత్వం కెరీర్​ కౌన్సెలింగ్​ కేంద్రాలుగా తీర్చిదిద్దనుంది.

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి :

  • కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర కెరీర్‌ సెంటర్, రాష్ట్రాల నుంచి ప్రాంతీయ కెరీర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
  • ఈ కేంద్రాలను నిర్వహిచేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు ఇతర స్థానిక సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇలా ప్రతి సమాచారం డిజిటల్​ రూపంలో అందుబాటులో పెట్టాలి.
  • సంస్థలు ఉద్యోగుల్ని నియమించుకోవాలనుకున్న సంస్థలు, ఉపాధి కోరుకుంటున్న యువత, ఉద్యోగార్థులు కొత్తగా ఏర్పడిన ఖాళీలు, స్వయం ఉపాధి కోసం కౌన్సెలింగ్​ కోరుకుంటున్న యువత, వ్యక్తుల వివరాలు అందులో తెలిపాలి.
  • ప్రాంతీయ, జాతీయ కెరీర్‌ కేంద్రాలు ఎప్పటికప్పుడు జాబ్​ మేళాలు నిర్వహించాలి. ఉపాధి ఆధారిత సర్వే, అధ్యయనాలతో పాటు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు కార్యాచరణ చేపట్టాలి.
  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఏర్పడిన ఖాళీల వివరాలు, భర్తీ చేయనున్న ఉద్యోగాల సమాచారాన్ని కెరీర్‌ కేంద్రాలకు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా 3-7 రోజుల్లో డిజిటల్‌ ఐడీ కేటాయించాలి.

డిజిటల్, మాన్యువల్‌ రూపంలో రికార్డులు : ప్రతి ఏడాది మార్చి 31 నాటికి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్​, అగ్రిమెంట్​, ఫిక్స్​డ్​ టర్మ్​ ఉద్యోగుల వివరాలు కొత్తగా చేరిన ఉద్యోగులు, అప్పటికే పనిచేస్తున్న వారి హోదాలు, అర్హులు లేకపోవడంతో భర్తీకాని ఉద్యోగాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే ఖాళీల వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు డిజిటల్, మాన్యువ్​ రూపంలో రికార్డులు నిర్వహించాలి. ఏడాదికి కెరీర్​ కేంద్ర అధికారికి రిటర్నుల వివరాలు సమర్పించాలి.

పోస్టులో 40 రోజుల ముందే పూర్తి వివరాలు : అలాగే రాష్ట్రానితి వెలుపల ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని కేంద్ర కెరీర్​ సెంటర్​తో పంచుకోవాలి. కేంద్ర ఉద్యోగాలకు దరఖాస్తు గడువుకు 40 రోజుల ముందు ఈ సెంటర్​లో పూర్తి వివరాలను పోస్టు చేయాలి. 50 మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలన్నీ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వస్తాయి. ఇందులో స్థానిక ఉపాధి దరఖాస్తు గడువుకు కనీసం 15 రోజుల ముందు ప్రాంతీయ కెరీర్​ పోర్టల్​లో ఆ వివరాలు పేర్కొనాలి. కెరీర్​ పోర్టల్​లో పొందుపరిచిన ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయా కేంద్రాలకు 30 రోజుల్లో తెలియజేయాలి.

లెబర్​ కోడ్​లతో సులభతరం : కేంద్ర ప్రభుత్వం నవంబరు 23ను చారిత్రక దినంగా ప్రకటించింది. వేతనాల కోడ్‌-2019తో పాటు 2020 నాటి పారిశ్రామిక సంబంధాలు; సామాజిక భద్రత; వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లను అమలులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ నాలుగు లేబర్‌ కోడ్‌లు కార్మికులకు మరింత సాధికారత కల్పిస్తాయనీ, అలాగే వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయడం ద్వారా ‘వికసిత్‌ భారత్‌’ సాకారానికి బాటలు పరుస్తాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

వారానికి 48 గంటలు మాత్రమే పని - అంతకు మించితే ఓవర్​టైమ్​ వేతనాలు చెల్లించాల్సిందే

వారంలో 4 రోజులే పని.. జీతం తక్కువ.. గ్రాట్యుటీ ఎక్కువ.. జులై 1 నుంచి కొత్త రూల్స్!