పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్‌జీ తీసుకొచ్చాం: పవన్‌కల్యాణ్
ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారిస్తుందని, ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపిన పవన్‌కల్యాణ్ - పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్‌జీ తీసుకొచ్చాంమన్న పవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 2, 2026 at 12:52 PM IST
Deputy CM Pawan Kalyan Speech At VB - G RAMG Launch: పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్‌జీ తీసుకొచ్చామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరాంజీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా నేడు ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు.
ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్‌లో 60 రోజులు విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం రూ.12,845 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పవన్ వివరించారు.
గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా రూ.16,695 కోట్ల ఉపాధి నిధులు వినియోగించాం. 7 వేల కి.మీ. సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 పశువుల నీటితొట్టెలు నిర్మించాం. స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా పారిశుద్ధ్య సేవలతో పరిశుభ్ర వాతావరణం అందించాం. పల్లె పండుగ విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతు పంట సకాలంలో మార్కెట్‌కు చేరుస్తున్నాం. లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు సంకల్పించాం. 2025లో ఐదు జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచాం.' -పవన్ కల్యాణ్, ఉపముఖ్యమంత్రి
వీబీ జీరాం జీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరాం జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా నేడు ప్రారంభమయ్యింది. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికామని కేంద్రం వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద ఇకపై రోజువారీ కనీస వేతనం రూ.300, జాతీయ సగటు రోజువారీ వేతనం రూ. 298 నుంచి రూ. 327కి పెంచారు. ఏడాదికి పని రోజుల సంఖ్య 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. రోజువారీ కూలీ రూ.300 కంటే తక్కువ ఉండకూడదని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖర్చు మించితే రాష్ట్రమే భరించాలి - వీబీ జీరామ్‌జీ అమలుకు మార్గదర్శకాలు
జులై 1న అనంతపురం నుంచి 'వీబీ జీ రామ్‌జీ' ప్రారంభం - దిల్లీలో పవన్ కల్యాణ్ కీలక భేటీలు

