ETV Bharat / state

సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదు - గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలి: పవన్ కల్యాణ్

పిఠాపురంలో నిర్వహించిన 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో' పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ - పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలని వెల్లడి - సంక్రాంతి అన్ని మతాలు జరుపుకొనే స్థాయికి ఎదగాలని సూచన

PAWAN_IN_SANKRANTI_CELEBRATIONS
PAWAN_IN_SANKRANTI_CELEBRATIONS (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 2:28 PM IST

|

Updated : January 9, 2026 at 2:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pawan Kalyan Speech at Sankranthi Celebrations: తెలంగాణకు ఆంధ్రా ప్రాంత ప్రేమను తీసుకెళ్లండని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్ఆర్​బీహెచ్​ఆర్​ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో' పవన్‌ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పొల్గొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న సంక్రాంతి మహోత్సవాలకు పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రా పిండి వంటలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పరీశీలించారు.

సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదు - గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలి: పవన్ కల్యాణ్ (ETV)

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ సోదరసోదరీమణులను సంక్రాంతికి ఆహ్వానించండని సూచించారు. అంతే కాకుండా తెలంగాణ సోదరసోదరీమణులకు గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలని అన్నారు. పీఠికాపురం సంక్రాంతి ఉత్సవాలకు చిరునామా కావాలని అలానే సంక్రాంతి అన్ని మతాలు జరుపుకొనే స్థాయికి ఎదగాలని చెప్పారు. సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు, పేకాట మాత్రమే కాదని వెల్లడించారు.

సంక్రాంతి సరదాలను నేను కాదనడం లేదు చేసేవాళ్లు చేసుకోండని కానీ పండుగ అంటే కోడిపందేలు, జూదాలు, పేకాటకే పరిమితం కాకూడదని సూచించారు. పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని పిఠాపురం భారతదేశానికి చాలా కీలకమైన శక్తిపీఠం వివరించారు. శ్రీపాద శ్రీవల్లభుడు వెలసిన నేల ఈ పీఠికాపురం అని ఇంకా తాను పిఠాపురంలో పోటీ చేయడం భగవంతుడి సంకల్పం అని కొనియాడారు. అధికారంతో సంబంధంలేకుండా ఆఖరి శ్వాస వరకూ పిఠాపురం కోసం పని చేస్తానని పవన్‌ తెలిపారు.

''పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దానిని వైరల్ చేస్తున్నారు. పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు. పిఠాపురంలో స్కూల్‌లో పిల్లలు కొట్టుకున్నా పెద్ద వార్త అవుతుంది. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలిక కాని నిర్మించడం కష్టం. గత ప్రభుత్వంలో ఏం చేశారో వైఎస్సార్సీపీ నాయకులను అడగండి.''- పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం

కూలగొట్టడం తేలిక కాని నిర్మించడం కష్టం: అలానే పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని వైరల్‌ చేస్తున్నారని ఇంక ఇక్కడ కాకి ఈక పడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్‌ చేయడం మానుకోవాలని ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలిక కాని నిర్మించడం కష్టం అని అన్నారు. ఒక కూటమిని నిర్మించడం చాలా కష్టమని అందరినీ ఏకతాటిపై నడిపించడం అంత తేలిక కాదని వివరించారు.

తాను వ్యవస్థను బలోపేతం చేసేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఏం చేశారో వైఎస్సార్సీపీ నాయకులను అడగండని అన్నారు. పిఠాపురంలో స్కూళ్లో పిల్లలు కొట్టుకున్నా పెద్ద వార్త అవుతుందని పిల్లల కొట్లాటలో కూడా కులాలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో సొంత బాబాయిని చంపినా అది వార్త కాదు అని చెప్పారు. నన్ను పరిమితం చేస్తే నా శక్తిని చంపేసినట్టేనని అదే నన్ను బలోపేతం చేస్తే మరింతగా పని చేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

450 ఏళ్ల ఘన చరిత్ర - కోనసీమ ప్రభల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా

అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి: పవన్​ కల్యాణ్​

Last Updated : January 9, 2026 at 2:49 PM IST