ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవటం బాధ్యతగా భావించాలి : పవన్ కల్యాణ్
రూ. 36 కోట్ల వ్యయంతో 12 నగర వనాలు, 6ఎకో టూరిజం పార్కుల ఏర్పాటు - వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ - కాలుష్యంతో నిండిపోతున్న నగరాలకు ఇవి ఊపిరి పోస్తున్నాయన్న పవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 5:00 PM IST
Pawan on Nature Conservation : ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మనిషి ప్రకృతిని పరిరక్షిస్తూ అభివృద్ధి సాధించినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుందని స్పష్టంచేశారు. అందుకే నక్షత్రవనాలు, రాశి వనాల ద్వారా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల పరిధిలో 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నెల్లూరు నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. రూ.36 కోట్ల వ్యయంతో నగరవనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాల్లో పచ్చదనం పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Pawan Kalyan Inaugurates 18 Parks : నగరాల్లో పచ్చదనం పెంచడానికి ఇవి దోహదపడతాయని పవన్ కల్యాణ్ తెలిపారు. కాలుష్యంతో నిండిపోతున్న నగరాలకు ఇవి ఊపిరి పోస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అర్బన్ గ్రీన్ ఇన్‌ఫ్రాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నగరవనాల్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
"అర్బన్ గ్రీన్ ఇన్‌ఫ్రాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ప్రకృతితో పాటు అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి. నక్షత్రవనాలు, రాశి వనాల ద్వారా సంప్రదాయాలకు పెద్దపీట. నగరవనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వం. ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలి." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
కోస్తా తీరంలో 'గ్రీన్ బెల్ట్' - వృక్ష సంపదను ప్రతి ఒక్కరూ రక్షించాలి: పవన్‌కల్యాణ్
రూ.27 కోట్లతో అరణ్యరామం - శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

