ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి - 'థాంక్యూ డిప్యూటీ సీఎం సార్' అంటూ ప్లకార్డులు
గొల్లప్రోలులో సుద్ధగడ్డ వాగుపై వంతెనను పరిశీలించిన పవన్ - గొల్లప్రోలులో స్థానిక చిన్నారులతో ముచ్చటించిన పవన్‌కల్యాణ్ - జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో పవన్‌కల్యాణ్ సమీక్ష

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 10, 2026 at 4:34 PM IST
|Updated : January 10, 2026 at 7:51 PM IST
Deputy CM Pawan Kalyan Second Day in Kakinada District: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండో రోజూ పర్యటించారు. గొల్లప్రోలులో సుద్ధగడ్డ వాగుపై నిర్మించిన నూతన వంతెనను పవన్ పరిశీలించారు. బ్రిడ్జి లేక వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నామంటూ ఏడాదిన్నర కిందట ప్రజలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న పవన్ వంతెన కడతామంటూ హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారమే ఏడాదిన్నరలోనే వంతెన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వంతెన నిర్మాణం పూర్తి చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ డిప్యూటీ సీం సార్ అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలతో పవన్ కాసేపు ముచ్చటించారు.
అనతరం కాకినాడ వెళ్లిన పవన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు అదుపు చేయడంపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొన్నారు.
పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా: మానవతాదృక్పథంతో వైద్యులు ప్రజా సేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలు, పల్లెలకు వెళ్లి పేదలకు వైద్య సేవలందించాలని కోరారు. చదువుకున్న వాళ్లంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంకోసలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా వైద్యులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించాలని కోరారు. వైద్య నిపుణులు తమ సేవలు విస్తరించాలని ఆయన సూచించారు. విద్యావంతులు కులమతాలకు అతీతంగా ఆలోచించాలని డిప్యూటీ సీఎం కోరారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసించారు. వైద్యులు మానవతాదృక్పథంతో ప్రజా సేవ చేయాలని సూచించారు. డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒకసారైనా గిరిజన ప్రాంతాలకు వెళ్లాలిని అన్నారు.
''రంగరాయ వైద్యకళాశాల కాకినాడ జిల్లాకు మూలస్థంభం. ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన ప్రతీ విద్యార్థి డాక్టర్‌గా మాత్రమే కాదు. మంచి మనిషిగా నిలబడాలి అన్నదే కళాశాల ఉద్దేశ్యం. పూర్వ విద్యార్థులు అందరూ రూ.10 కోట్ల 11 లక్షల వ్యయంతో నిర్మించబోయే భవనంలో బయో కెమిస్ట్రీ విభాగం పరిపాలన కార్యాలయాలు, లెక్చరల్ హాళ్లు, నర్సింగ్ ల్యాబ్ వంటి అధునాతన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ కాలేజీలో పూర్వ విద్యార్థులు ఇలా చేస్తే గనక ఏ కాలేజీలు ప్రైవేట్ పర్వం చేయాల్సిన అవసరం రాదు. మీ కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.'' - పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం
అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలి: పవన్ కల్యాణ్
సంక్రాంతి అంటే కోడిపందేలు, జూదాలు మాత్రమే కాదు - గోదావరి జిల్లాల ఆతిథ్యం రుచి చూపాలి: పవన్ కల్యాణ్

