ETV Bharat / state

ప్రత్యేక ఆకర్షణగా మిలటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కమాండెంట్‌ స్టాళ్లు

ఎంసీఈఎంఈ కమాండెంట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు - స్వదేశీ సాంకేతికతతో రక్షణ రంగంలో దూసుకుపోతున్న భారత్‌ - స్వదేశీ రక్షణరంగ పరికరాల్ని తయారుచేస్తున్న భారత్‌

ELECTRONIC MECHANICAL ENGINEERING
ELECTRONIC MECHANICAL ENGINEERING (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 9:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Military College Of Electronic And Mechanical Engineering Stall : డిఫెన్స్‌ ఏ దేశానికైనా అత్యంత కీలకమైన రంగాల్లో ఒకటి. భారత్‌ సైతం స్వదేశీ సాంకేతికతతో రక్షణ రంగంలో దూసుకుపోతోంది. విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తూనే వీలైనంత మేర స్వదేశీ రక్షణరంగ పరికరాల్ని తయారుచేస్తోంది. స్టార్టప్‌లు, డీఆర్‌డీవో వంటి సంస్థలతో కలిసి నడుస్తున్న భారత రక్షణ వ్యవస్థతో కలిసి పని చేయడానికి నూతన స్టార్టప్‌లు సైతం ముందుకొస్తున్నాయి. మరోవైపు సికింద్రాబాద్‌లోని మిలటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కమాండెంట్‌ ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దేశ భద్రత, యుద్ధ రంగంలో సాంకేతికత : సికింద్రాబాద్ తిరుమలగిరిలోని మిలటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కమాండెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్ తొలి రోజు ఘనంగా నిర్వహించారు. రోబోటిక్స్, అటానమస్ డ్రోన్‌ సిస్టమ్స్‌ అండ్ ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి ఉన్నతాధికారులు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. దేశ భద్రత, యుద్ధ రంగంలో సాంకేతికత అవసరాల్ని తెలియజేశారు.

సర్వైవలెన్స్‌ కోసం : సెమినార్‌ తర్వాత ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్లు, యుద్ధ పరికరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మిలటరీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి వాటి గురించి తెలియజేశారు. సర్వైవలెన్స్‌ కోసం ఉపయోగించే డ్రోన్ల సామర్థ్యాల్ని గురించి వివరించారు. ఒక్కో డ్రోన్ దాదాపుగా 10 కిలోమీటర్ల వెర్టికల్ హైట్‌లో పర్యవేక్షణ చేయగలదని వెల్లడించారు. అలాగే వివిధ రకాల యుద్ధ క్షేత్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేని అటానమస్ వెహికిల్‌ మాక్స్‌ను సైతం ప్రదర్శించారు.

"శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి వచ్చి సెంట్రల్​ ఆర్మ్​డ్​ ఫోర్స్​లో ఉద్యోగం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులకు కూడా గర్వంగా చెప్పుకునేలా మూమెంట్ ఇచ్చాను. ఇప్పుడు కానిస్టేబుల్​ కొట్టాను. ఎస్సై కొట్టాలనేది నా డ్రీమ్" -చల్ల ఊహా

రివర్స్ ఇంజినీరింగ్‌తో విడిభాగాల తయారీ : త్రీడీ ప్రింటింగ్ సైతం రక్షణరంగంలో కీలకంగా మారింది. పలు రకాల మెటల్స్‌ను ఉపయోగించి రివర్స్ ఇంజినీరింగ్‌తో విడిభాగాల తయారీ చేస్తున్నారు. పరికరాల తయారీ పూర్తిగా హైదరాబాద్‌లోనే జరుగుతోందని మేజర్ రోహిత్‌ వివరించారు. సాధ్యమైనంత మేర స్వదేశీ సాంకేతికతతోనే తయారీ జరిగిందన్నారు. ప్రదర్శనలో ఫేస్‌ స్కాన్‌ చేసి గుర్తించే రోబోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెమినార్, స్టాళ్ల ప్రదర్శన శనివారం కూడా కొనసాగనుంది.

"నేను ఇది లాస్ట్​ టైం ట్రై చేశాను. అప్పుడు మెరిట్​లో పోయింది, రాలేదు. ఈసారి కష్టపడి ప్రయత్నించాను. దీంతో సెలెక్ట్ అయ్యాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది. జీవితంలో యూనిఫాం జాబ్​ చేయాలని నా డ్రీమ్. ఫైనల్​గా సాధించాను" -సాయి

"నాకు డిఫెన్స్​ సెడ్​ వెళ్లాలనే స్పూర్తి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల అయ్యేది కాదు. ఆ తర్వాత పీజీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్​లో చేరాను. అది లైఫ్​ కాదనుకుని అర్థం చేసుకుని ఈ నోటిఫికేషన్​ చూసి అప్లై చేశాను. మా నాన్న మిల్లులో పనిచేస్తారు. అమ్మ పొలం పనులు చూసుకుంటారు. వాళ్ల కష్టం మనకు తెలుసు కాబట్టి మనకు అది వర్కౌట్​ అవ్వదని ఎస్సేస్సీలో జాయిన్​ అయ్యాను" -

"మా నాన్న అంబులెన్సు డ్రైవర్. మేం ఇద్దరం ఆడపిల్లలం. మా సిస్టర్ ఐటీ రంగంలో స్థిరపడింది. నేనూ అటు వైపే వెళ్లాలనుకున్నా. కానీ నాకు అంతగా ఆసక్తి లేదు. నేను దేశానికి సేవ చేయాలనుకున్నాను. అందుకోసమే ఈ వృత్తిని ఎంచుకున్నాను. చాలా గర్వపడుతున్నాను. ఇది కేవలం ఆఫర్​ లెటర్​ మాత్రమే కాదు. క్రమశిక్షణకు, కష్టానికి వచ్చిన ఫలితం" -అలేఖ్య

దక్షిణాసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన - పెట్టుబడులకు వేదికైన వింగ్స్ ఇండియా 2026