ఇవాళ ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష?
CM Revanth Review on Elnino : తెలంగాణలో నెలకొన్న కరవు ప్రభావం, ఎల్‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించే అవకాశంఉంది. ప్రస్తుతం దిల్లీపర్యటనలో ఉన్న సీఎం అక్కడే మంత్రులు, అధికారులతో సమావేశంకానున్నట్లు తెలుస్తోంది.

Published : October 12, 2026 at 11:07 AM IST
CM Revanth Review on Elnino : తెలంగాణలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితి, కరవు ప్రభావంపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించే అవకాశం ఉంది. దిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. కన్నాట్‌ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు జరగనున్న ర్యాలీలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు అక్కడే ఎల్‌నినో పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తాగునీరు - సాగునీటి సమస్యలు, లోటు వర్షపాతం, సాగు నీటి ఎద్దడి వంటి వివిధ పరిస్థితులపై సమీక్షించే అవకాశం ఉంది. అనంతరం దీనిపై కేంద్రానికి ఓ నివేదిక అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివిధ శాఖల అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనే ఈ అంశానికి సంబంధించిన సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, సీఎం దిల్లీ పర్యటన కారణంగా అక్కడే సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభం పొంచి ఉందని ఇటీవల నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. కొవిడ్ తరహాలో ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ వరకు తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై ఇప్పటినుంచే ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టంచేశారు. విస్తృత ప్రచారం చేసి ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్న ముఖ్యమంత్రి త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తక్షణ చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎం వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యలను ఎదుర్కోనేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కరెంట్‌ని పొదుపుగా వాడుకోవాలి
రానున్నరోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నా మార్కెట్‌లో అందుబాటులో లేదన్నారు. అందుకే అందుబాటులోఉన్న కరెంట్‌ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
బండలే తప్ప బిందెడు నీళ్లు లేవు - రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భజలాలు
'తెలంగాణలోని కరవు మండలాలను గుర్తించండి' - కలెక్టర్లకు కీలక ఆదేశాలు

