ETV Bharat / state

స్టార్టప్​ల కోసం రూ.1000 కోట్ల ఫండ్ - గూగుల్​ అంత ఎత్తుకు ఎదగాలన్న సీఎం రేవంత్​

టీహబ్​లో గూగుల్​ ఫర్​ స్టార్టప్స్​ కేంద్రం ప్రారంభించిన సీఎం రేవంత్​రెడ్డి - ఇన్వెస్టర్లు, పార్టనర్లు, ప్రభుత్వానికి వారథిగా గూగుల్​ ఫర్ స్టార్టప్స్​ - ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి

Google Launches Hub in Hyderabad
Google Launches Hub in Hyderabad (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 10, 2025 at 1:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Google Launches Hub in Hyderabad : గూగుల్​ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్​లు కష్టపడాలని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. స్టార్టప్​ల కోసం ప్రభుత్వం రూ.1000 కోట్ల ఫండ్​ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్​ స్టార్టప్​లపైనే కాదు, యూనికార్న్​లపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. కనీసం హైదరాబాద్​ నుంచి 100 యూనికార్న్​ సంస్థలు రావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్​లోని టీహబ్​లో గూగుల్​ ఫర్​ స్టార్టప్స్​ కేంద్రాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్​ బాబు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, 1998లో గూగుల్​ ప్రస్థానం కూడా ఒక స్టార్టప్​గానే మొదలైందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్​ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకమని అన్నారు. గూగుల్​, యాపిల్​, అమెజాన్​, టెస్లా వంటివి గొప్ప స్టార్టప్​లని ఆయన కొనియాడారు. 100 స్టార్టప్స్​లను 1 బిలియన్​ జాబితాలో చేర్చేలా కృషి చేస్తామన్నారు.

స్టార్టప్​ల కోసం రూ.1000 కోట్ల ఫండ్ - గూగుల్​ అంత ఎత్తుకు ఎదగాలన్న సీఎం రేవంత్​ (ETV)

"1998లో గూగుల్‌ ప్రస్థానం కూడా ఒక స్టార్టప్‌గానే మొదలైంది. గూగుల్‌ విజయ ప్రస్థానం మాకు నిత్యం స్ఫూర్తిదాయకం. గూగుల్‌, యాపిల్, అమెజాన్‌, టెస్లా వంటివి గొప్ప స్టార్టప్‌లు. ఇప్పుడు హైదరాబాద్‌ స్టార్టప్‌లపైనే కాదు, యూనికార్న్‌లపై దృష్టి పెట్టింది. కనీసం హైదరాబాద్‌ నుంచి 100 యూనికార్న్‌ సంస్థలు రావాలి. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం రూ.1000 కోట్ల ఫండ్‌ ఏర్పాటు చేస్తుంది. గూగుల్ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్‌లు కష్టపడాలి." - రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

కొత్త ప్రారంభం - కొత్త ప్రయాణం : మేం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్​ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇదో కొత్త ప్రారంభమని, ఇదో కొత్త ప్రయాణమని కొనియాడారు. స్టార్టప్స్​ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మా స్టార్టప్​లకు గూగుల్​ మెంటార్​గా ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఇక ఇప్పుడు యూనికార్న్​ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని సంతోషించారు. యూనికార్న్​లను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఉందన్నారు.

3 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయని చెప్పారు. ఒక లక్ష్యం అంటూ ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళ్లగలమన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని సూచించారు. దేశంలోని మొదటి ప్రైవేటు రాకెట్​ హైదరాబాద్​లోనే తయారైందన్న విషయాన్ని గుర్తు చేశారు. టీహబ్​కు గూగుల్​ను రప్పించేందుకు చాలా శ్రమించామని, కానీ ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్​ కేంద్రంమని హర్షించారు. ఇది ప్రపంచంలోనే ఐదో గూగుల్​ స్టార్టప్స్​ కేంద్రమన్నారు.

గూగుల్​ ఫర్​ స్టార్టప్స్​ చేసే పని : ఇన్వెస్టర్లు, పార్టనర్లు, ప్రభుత్వానికి గూగుల్​ ఫర్​ స్టార్టప్స్​ వారథిగా నిలవనుంది. ప్రపంచస్థాయి ఆవిష్కరణలను గూగుల్​ ఫర్​ స్టార్టప్​ ప్రోత్సహించనుంది. ప్రాంతీయ అంకుర పరిశ్రమలను ప్రపంచ స్థాయికి గూగుల్​ ఫర్ స్టార్టప్స్​ పరిచయం చేయనుంది. ఏడాదిపాటు టీహబ్​లో అంకుర పరిశ్రమలకు ఉచితంగా సీటింగ్​ కల్పించనుంది. స్టార్టప్స్​లకు అవసరమైన సలహాలు, సూచనలు, నైపుణ్యం గూగుల్​ ఫర్​ స్టార్టప్స్​ పెంపొందించనున్నాయి.

తెలంగాణ గ్లోబల్​ సమిట్​ రూ.5.75 లక్షల కోట్ల ఒప్పందాలు - 66 వేల మందికి ఉపాధి!

Hyderabad as Robo Hub : రోబో హబ్​గా హైదరాబాద్.. టీ హబ్ తరహాలో 'ట్రిక్స్'