అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
అయెధ్యలో సీఎం చంద్రబాబు పర్యటన - అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు - సీఎం చంద్రబాబుకు సాదర స్వాగతం పలికిన యూపీ, ఆలయ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 7:48 PM IST
CM Chandrababu Offered Prayers To in Ayodhya : రెండేళ్లలో అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. నేడు అయోధ్య రామాలయంలో బాలరాముడిని దర్శించుకున్న చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ విశేషాలను చంద్రబాబుకు నిర్వాహకులు వివరించారు.
రామ జన్మభూమిలో రాముడిని దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేసే భాగ్యం కలిగిందని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని అవి అందరికీ శాశ్వతమైన పాఠాలని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. అంతకుముందు అయోధ్య చేరుకున్న చంద్రబాబుకు యూపీ, అయోధ్య దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆధ్యాత్మిక హబ్‌గా అయోధ్య: మంచి పాలనను మనం రామరాజ్యంతో పోల్చుతూ ఉంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొనియాడారు. ఏ ప్రభుత్వానికి అయినా అది బెంచ్ మార్క్నని సీఎం అభిప్రాయపడ్డారు. అద్భుతమైన ఈ ఆలయం నిర్మాణంలో భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇది చారిత్రక ఆలయమని గుర్తు చేశారు. భారత ఆధ్యాత్మిక హబ్‌గా భవిష్యత్‌లో అయోధ్య మారనుందని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
"భవిష్యత్తులో మన సంప్రదాయ విలువలను పెంచుతుంది. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. సాంకేతికత, విజ్ఞానం విషయంలో మనల్ని అధిగమించేవారు లేరు. వీటికి సంప్రదాయ విలువలను జోడిస్తే మానవ సమాజానికి ఎంతో మంచిది. ఆధ్యాత్మిక విలువలు పెంచేందుకు అయోధ్య ఆలయం కీలక పాత్ర పోషిస్తుంది." అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Today, I was blessed to have darshan and offer prayers at the divine and magnificent Shri Ram Janmabhoomi Mandir in Ayodhya. It was a peaceful and spiritually uplifting experience to be here once again. Lord Shri Ram’s values and ideals are timeless lessons for us all. May they… pic.twitter.com/jM8ZMk8Cz3
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2025
"మంచి పాలనను మనం రామరాజ్యంతో పోల్చుతూ ఉంటాం. అద్భుతమైన అయోధ్య ఆలయం నిర్మాణంలో భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నాను. భారత ఆధ్యాత్మిక హబ్‌గా భవిష్యత్‌లో అయోధ్య మారనుంది. ప్రస్తుతం భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరో రెండేళ్లలో అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరిస్తుంది. సాంకేతికత, విజ్ఞానం విషయంలో మనల్ని అధిగమించేవారు లేరు. ఆధ్యాత్మిక విలువలు పెంచేందుకు అయోధ్య ఆలయం కీలక పాత్ర పోషిస్తుంది." - సీఎం చంద్రబాబు
రతన్ టాటాకు చంద్రబాబు నివాళులు : మరోవైపు రతన్ టాటా జయంతి సందర్భంగా ఆయన స్మృతికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. రతన్ టాటా దూరదృష్టి గల పారిశ్రామికవేత్త, కరుణతో కూడిన నాయకుడంటూ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా వ్యాపారంలో నాణ్యతను, సేవలో నిబద్ధతను జీవితాంతం ప్రతిబింబించిన మహనీయుడని కొనియడారు. నిజాయితీ, వినయం, సామాజిక బాధ్యతల పట్ల ఆయన చూపిన అంకితభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు : అలాగే నరసాపురం లేస్ క్రాఫ్ట్‌ను గుర్తించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. తరతరాలుగా కుటుంబాలు, సముదాయాలు కాపాడుకుంటూ వచ్చిన సంప్రదాయ కళల్లో నరసాపురం క్రోషే లేస్ ఒక అద్భుతమైన కళారూపమని చంద్రబాబు చెప్పారు. ఈ కళను నిలబెట్టడమే కాకుండా ప్రపంచానికి చాటిచెప్పిన మహిళా కళాకారుల నైపుణ్యం, అంకితభావం అభినందనీయమన్నారు.
మళ్లీ ఈ కళ వికసిస్తూ తగిన గుర్తింపు పొందడం హర్షణీయమని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఈ కళకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందించి, కళాకారులను శక్తివంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. లేస్ క్రాఫ్ట్ అద్భుత కళారూపం లక్ష మంది మహిళలకు జీవనాధారంగా నిలుస్తోంది మంత్రి లోకేశ్ అన్నారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆయన పేర్కొన్నారు.
శతాబ్దాల నాటి గాయాలు ఇవాళ నయం అవుతున్నాయ్ - అయోధ్యలో ప్రధాని మోదీ

