భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది మన రాష్ట్రమే: సీఎం చంద్రబాబు
ఆవకాయ- అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు - పున్నమి ఘాట్‌లో సీఎంకు స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేశ్, అధికారులు - కృష్ణానది జల హారతిని తిలకించ కృష్ణా నదిలో హౌస్‌బోట్‌ను ప్రారంభం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 10:48 PM IST
CM Speech at Avakaya-Amaravathi Festival: తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఆవకాయ- అమరావతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆవకాయ అనగానే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకోవాలన్నారు. 28 ఈవెంట్, 4 వర్క్ షాపులు పెట్టారని వెల్లడించారు. ప్రపంచంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది భారతదేశం భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ప్రపంచానికే ఆతిధ్యం ఇచ్చే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్నారు. గత ఐదేళ్లు ఉత్సవాలు లేవు నవ్వింది లేదన్నారు. గతంలో దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకు వస్తుందన్న సీఎం ఇప్పుడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా విజయవాడ ఉత్సవ్ చేశారని తెలిపారు.
తెలుగు జాతి ఔనత్యాన్ని కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. భగవంతుడు తనకు 2 అవకాశాలు ఇచ్చాడని తాను సీఎంగా ఉండగా 3 పుష్కరాలు చేసే అవకాశం వచ్చిందన్నారు. మన సంప్రదాయాలను మనం కాపాడుకోవాలని తెలిపారు. బ్రిటీష్ వారు కట్టిన ఆనకట్టల వల్ల ప్రజల జీవన విధానం మారిందని గుర్తు చేసారు. ఇంట్లో పిల్లలను ఐటీ చదివించాలని 25 ఏళ్ల క్రితమే తాను చెప్పానన్నారు. అప్పటి విద్యార్థులే నేడు ఉద్యోగులుగా అనేక దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ప్రపంచంలో ఏం మూలకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉంటారని వ్యాఖ్యానించారు. సంపద సృష్టిలో కృష్ణా జిల్లా వారే ముందు ఉన్నారని వీరు చేయని వ్యాపారం లేదన్నారు.
క్రియేటివ్కి చిరునామాగా సినిమా రంగం మారిందని భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు అనేక ప్రయోగాలు చేసారని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు ఇదే జిల్లా నుంచి సినిమా రంగంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి వారు సినీ రంగంలో రాణిస్తున్నారని వెల్లడించారు. కోహినూరు వజ్రం ఇక్కడిదే ఇక్కడి నుంచి నిజాం వద్దకు వెళ్లిందని గుర్తు చేశారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని ఇంటిలోనే గ్యాస్ తయారు చేసుకోవచ్చుని సూచించారు. విశాఖను ఏఐ హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు.
విజయవాడ ఆవకాయ్ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. అనంతరం హౌస్ బోటును ప్రారంభించారు. ఈయూ అంబాసిడర్ హెర్వె డెల్ఫీ, స్థానిక ప్రజాపత్రినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.#AndhraPradesh pic.twitter.com/OyYgBOAV9z
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 8, 2026
అమరావతి బెస్ట్ సిటీ డైనమిక్ సిటీ: మిమ్ములను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎంత బాధపడిన అమరావతి బెస్ట్ సిటీ డైనమిక్ సిటీ అన్నారు. కృష్ణానది వద్ద ఒక గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదని వ్యాఖ్యానించారు. అమరావతి గ్రీన్ సిటీ విజయవాడ క్లినెస్ట్ సిటీ అని తెలిపారు. అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని సూచించారు. రెట్లు పెంచితే భయపడి ఎవరు రారు రెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. సెక్యూరిటీ ఉంటేనే టూరిస్టులు వస్తారని వెల్లడించారు. ఆవకాయ అమరావతిని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత విజయవాడ ప్రజలదే అన్నారు.
అమరావతి దేవతల రాజధాని: ప్రస్తుతం అరకు కాఫీ గ్లోబల్ అయ్యిందని అరకు కాఫీ కేజీ 10 వేలు పలుకుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో మనల్ని ఎవరు బిట్ చేయలేరని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన రాష్ట్రంలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం అన్నారు. అమరావతి దేవతల రాజధాని వెంకటేశ్వర స్వామి దీవెనలతో అమరావతి అభివృధి చెందుతుందని తెలిపారు. ఎవరు ఎక్కడ ఉన్నా సంక్రాంతిని మాత్రం సొంత గ్రామాల్లో చేసుకుంటారని తెలిపారు. 20 సంవత్సరాల కంటే ముందు మా శ్రీమతి ఒక నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారని అలానే నారా వారి పల్లెలో సంక్రాంతి చేసుకుంటామని అన్నారు.
మహిళల శక్తి నాకు తెలుసు - ఆన్‌లైన్‌లో పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు
జలాలు సముద్రం పాలైతే ఎవరికి ఉపయోగం - వాడుకుంటే మేలే కదా: సీఎం చంద్రబాబు

