ETV Bharat / state

పేదలకు అండగా ఉంటాం - ఆదాయం పెంచి ఆనందం పంచుతాం: సీఎం చంద్రబాబు

మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు - వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుంది - పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారు - 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

CM Chandrababu in Swachchhandhra Swarnandhra Program
CM Chandrababu in Swachchhandhra Swarnandhra Program (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 4:51 PM IST

4 Min Read
Choose ETV Bharat

CM Chandrababu in Swachh Andhra-Swarnandhra Program : గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి వంద శాతం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తెలిపారు. మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని చెప్పారు. స్వచ్ఛ రథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారన్నారు. దీంతో పరిసరాల పరిశుభ్రతతోపాటు ప్రజలకు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు.

" వినుకొండలో పీహెచ్‌సీని వందపడకల ఆస్పత్రిగా మారుస్తున్నాం. డయాలసిస్‌, ట్రామా కేర్ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. వినుకొండలో పచ్చదనం పెంచేందుకు నిధులు కేటాయిస్తాం. పశువైద్య కళాశాల, అగ్రికల్చరల్ కాలేజ్‌ ఏర్పాటు చేస్తాం. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2025 జనవరిలో ప్రారంభించాను. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగుతున్నాయి. పచ్చదనం- పరిశుభ్రత, నీరు-మీరుతో ప్రజల వద్దకు వస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.

నేను సీఎంగా వచ్చేనాటికి 108 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోయింది. దానిని క్రమంగా తొలగిస్తున్నాం. వర్షాలు పడినప్పుడు భూ జలాలు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడింది. కలుషిత నీళ్లు తాగితే డయేరియా వంటి అనేక సమస్యలు వస్తాయి. ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టాం" అని చంద్రబాబు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిది: సీఎం చంద్రబాబు (ETV)

ఎక్కడ ఉన్నా కార్యక్రమానికి హాజరువుతున్నా : "ప్రతి నెల మూడో శనివారం ఎక్కడ ఉన్నా కార్యక్రమానికి హాజరువుతున్నా. మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను వంద శాతం సేకరిస్తున్నారు. మార్చి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిది. రాబోయే రోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటికే ‘సూపర్‌ సిక్స్‌’ హిట్‌ అయ్యింది. ‘పేదల సేవలో’ కార్యక్రమం కింద మొదటి తేదీనే ఇంటింటికి వస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తున్నాం.

ప్రతి ఎకరాకు నీళ్లిస్తున్నాం. గిట్టుబాటు వచ్చే పంటలు వేయిస్తున్నాం. రైతులకు టెక్నాలజీ అలవాటు చేస్తున్నాం. అగ్రికల్చర్‌ నిపుణులను అందుబాటులో ఉంచుతున్నాం. రైతులు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్‌, బిందుసేద్యం తదితర కార్యక్రమాలను నేనే ప్రారంభించా. వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే ఆదాయం లేకుండా ఇబ్బందులు వస్తున్నాయి. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో రూ.5కే భోజనం పెడుతున్నాం. మెరుగైన జీవన ప్రమాణాల కోసం పీ4 కార్యక్రమం తీసుకొచ్చాం. ఆదాయం పెంచే మార్గాలను నేర్పించి వారిని ఆదుకుంటున్నాం" అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

"రైతులంతా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్‌, బిందుసేద్యాన్ని నేనే ప్రారంభించా. వారసత్వ పంటల వల్ల ఆదాయం తగ్గిపోయి ఇబ్బందులు వస్తున్నాయి. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తయారుచేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతోనే రూ.5కు భోజనం ప్రారంభించాం. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు అండగా ఉంటున్నాం.పేదల ఆదాయం పెంచి వారి జీవితాల్లో ఆనందం పంచుతాం. మెరుగైన జీవన ప్రమాణాల కోసం పీ4 కార్యక్రమం తెచ్చాం. ఆదాయం పెంచే మార్గాలను నేర్పించి వారిని ఆదుకుంటున్నాం." - సీఎం చంద్రబాబు

"కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముందుంటా. ఆదాయానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలి. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి. దిల్లీలో జరిగిన ఏఐ సమిట్‌కు కాంగ్రెస్‌ వాళ్లు ఆటంకం కలిగించారు. నిన్న దిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తల వైఖరి చూసి చాలా బాధపడ్డా. దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి’’ అని చంద్రబాబు అన్నారు.

మీ పొలాల వద్దకు సాంకేతికత : "ప్రపంచంలో ఉన్న సాంకేతికతను మీ పొలాల వద్దకు తీసుకొస్తున్నాం. దిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. ప్రజలకు మేలు చేసేందుకే ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన మార్పులు గమనించాలి. రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం, కొత్తవి వేస్తున్నాం. ఏడుకొండలవాడికి అపచారం చేసే స్థాయికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రతిచోటా ప్రజలను రెచ్చగొడుతున్నారు.

డ్రగ్స్ మత్తులో ఆడబిడ్డల జోలికొస్తే వారికదే చివరిరోజు అవుతుంది. నేను జైలుకు వెళ్లాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడేందుకే జైలుకు వెళ్లా. నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి. వేంకటేశ్వరస్వామి ఫొటోలను మండలికి తీసుకెళ్లారంటే ఏమనాలి? రాష్ట్రంలో పెనుమార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నా. మన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటున్నా. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని భావిస్తున్నా" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

పనిచేయని, సమస్యలు సృష్టిస్తున్న వారిని భరించాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

ప్రభుత్వ సేవలు ప్రజలకు అత్యంత సులభంగా చేరువ కావడమే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు