ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాల్ని వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

వెయ్యి పురాతన ఆలయాల పునరుద్ధరణపైనా దృష్టి పెట్టాలని సూచన - దేవదాయశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

దేవదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
దేవదాయశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 7:39 AM IST

2 Min Read
Choose ETV Bharat

Development Of Temples In Ap : రాష్ట్రవ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్థలాలను త్వరగా ఖరారు చేసి పనులు ప్రారంభించాలన్నారు. వెయ్యి పురాతన ఆలయాల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయాలు, విద్య, వైద్య, ధార్మిక సేవలను మరింత విస్తరిస్తూ టీటీడీని ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.

దేవదాయశాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష (ETV Bharat)

సాధారణ ప్రాంతాల్లో 3 కేటగిరీలుగా : దేవదాయశాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయాల కోసం ప్రతిపాదిత స్థలాలను త్వరగా ఖరారు చేస్తే నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలు, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో 4 వేల 192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎంకు టీటీడీ ఈవో వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల నివాసాలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ 3 కేటగిరీలుగా ఆలయాలను నిర్మించేలా ప్రణాళిక ఉందన్నారు.

శివాలయాల అభివృద్ధిపై దృష్టి : ఇతర రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మారిషస్ వంటి దేశాలూ శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని కోరుకుంటున్నాయని తెలిపారు. అర్చకులను తయారు చేసేలా ప్రత్యేక కోర్సులు నిర్వహించాలన్నారు. శివాలయాలు, శక్తిపీఠాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆలయాల వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించే 5 వేల ఆలయాల నిర్వహణకు ముందుగానే కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకుల సేవలు, ఆలయ నిర్మాణాలను హిందూ ధర్మ ప్రచారంతో అనుసంధానించాలన్నారు.టీటీడీ ప్రాణదానం ట్రస్టును వైద్య సేవల్లో బెస్ట్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. వైద్యులను శ్రీవారి సేవకులుగా భాగస్వామ్యం చేసి వైద్యంతో పాటు బోధనలోనూ వారి సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.

సంపూర్ణ దివ్యక్షేత్రంగా : తిరుమలతో పాటు తిరుపతిని సంపూర్ణ దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు. శ్రీవారి సంప్రదాయాలకు తగ్గట్లు కల్యాణాలు నిర్వహించుకునే వేదికగా తీర్చిదిద్దాలన్నారు. ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించే ప్రత్యేక ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు సూచించారు. నిపుణులైన భక్తులతో టీటీడీ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలని ఆదేశించారు.

బటన్ నొక్కడానికి రాలేదు - పేదలకు భరోసా ఇవ్వడానికే వచ్చా: సీఎం చంద్రబాబు

పట్టణ పేదల సొంతింటి కల సాకారం - ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్