ETV Bharat / state

రామోజీ ఫిల్మ్​సిటీలో మార్చి 14న సినీ మ్యాజికల్ గ్లో రన్​

రామోజీ ఫిల్మ్​ సిటీ వేదికగా మార్చి 14న సినీ మ్యాజికల్ గ్లో రన్ - 3కె, 5కె, 10కె విభాగాల్లో రన్ ​- జెర్సీని ఆవిష్కరించిన కూచిపూడి కళాకారిణి దీపికారెడ్డి, ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతిసురేఖ

Cine Magical Glow Run At RFC on March 14th
Cine Magical Glow Run At RFC on March 14th (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 4:01 PM IST

|

Updated : March 3, 2026 at 4:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cine Magical Glow Run At RFC on March 14th: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీ వేదికగా మార్చి 14వ తేదీన నిర్వహించనున్న సినీ మ్యాజికల్ గ్లో రన్​ అనేది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి కళాకారిణి దీపికారెడ్డి అన్నారు. రన్​కు సంబంధించిన జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఆర్​ఎఫ్​సీలోని సితారలో సందడిగా నిర్వహించారు.

జయాపజయాలతో సంబంధం లేకుండా: కార్యక్రమంలో దీపికారెడ్డితో పాటు అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం పాల్గొని జెర్సీ, పతకాన్ని ఆవిష్కరించారు. దీపికారెడ్డి మాట్లాడుతూ.. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పాలుపంచుకొనే ఈ పరుగులో ప్రతి ఒక్కరూ విజేతలేనని అన్నారు.

'రామోజీ ఫిల్మ్​సిటీకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఒకటే గ్లో రన్. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు అవ్వొచ్చు. దీనిలో 3కే, 5కే, 10 విభాగాల్లో పాల్గొనవచ్చు.​ గెలుపు, ఓటమి పక్కకు పెడితే ప్రయత్నించడం ఎంతో ముఖ్యం కనుక అందరూ మీ పేర్లను ఎన్​రోల్​ చేసుకోండి. నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. 14 మార్చి సాయంత్రం ఈ రన్​ ప్రారంభమవుతుంది. ఇక్కడ కాలుష్య రహిత వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక అందరూ పాల్గొనండి. మీతో పాటు మీ ఇంట్లో వాళ్లనూ తీసుకురండి.' - దీపికారెడ్డి, కూచిపూడి కళాకారిణి

క్రీడాకారిణి జ్యోతి సురేఖ మాట్లాడుతూ.. ప్రశాంతమైన మనసు, శారీరక ఆరోగ్యం కోసం పరుగును జీవనశైలిలో భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమ విశేషాలను రన్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ మిశ్రా వివరించారు.

లాగిన్‌ అవ్వండి ఇలా: ఈనెల 14 సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే 3కె, 5కె, 10కె విభాగాల్లో తొలిసారి పరుగులో కుటుంబాలు, అనుభవజ్ఞులైన రన్నర్‌లు పాల్గొనవచ్చని వివరించారు. కార్యక్రమంలో హెల్తీయాన్‌ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ ప్రభు, రెనోవా హాస్పిటల్స్‌ సీఈవో రవీంద్రనాథ్, రామోజీ ఫిల్మ్‌సిటీ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌ ఏవీ రావు పాల్గొన్నారు. పరుగులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ఎల్బీనగర్‌ నుంచి ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్‌కు www.ramojifilmcity.com లాగిన్‌ అవ్వండి. లేదా 7659876598కు కాల్‌ చేయండి.

ఉమెన్స్​ డే స్పెషల్​ : రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రత్యేక ఆఫర్లు - టికెట్​ ధరల్లో భారీ తగ్గింపు

రామోజీ ఫిల్మ్ సిటీ హాలీవుడ్‌ సినిమాలను గుర్తుచేసేలా గేమ్‌- సరికొత్త హంగులతో రూపకల్పన

Last Updated : March 3, 2026 at 4:30 PM IST