బాలల దినోత్సవం గిఫ్ట్ ఇదే! - వారి బాల్యమే బహుమతిగా ఇద్దాం
నేడు బాలల దినోత్సవం - తరగని ఆనందం, నియంత్రణలేని ఉద్వేగం ఇవే బాల్యం లక్షణాలు - పసిపిల్లలపై ఒత్తిడి లేకుండా సరైన దారి మళ్లించగలిగితే మంచి బాల్యాన్ని బహుమతిగా అందించినట్టే

Published : November 14, 2025 at 10:27 AM IST
November 14 Children's Day : తొలి ప్రధాని నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. మరి ఈ రోజున పిల్లలకి బహుమతిగా ఏమివ్వబోతున్నారు? ఖరీదైన ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు, మాల్స్, పర్యటనలు? భవిష్యత్తు కోసం ఆర్థిక బాండ్లూ, బీమా పథకాల కానుకలా? మంచిదే! కానీ వీటన్నింటికంటే నేటి పిల్లలకి వారి బాల్యాన్నే బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- పిల్లల్లోని కోపం, ఆవేశం, అసూయ, భయం వంటివాటిని చూపి వాళ్లతో చెడుగా మాట్లాడవద్దు. వారిలో అపరాధ భావం కలిగించొద్దు. కోపాన్ని పట్టుదలగా, ఆవేశాన్ని శ్రమగా, అసూయను పోరాట స్ఫూర్తిగా మార్చుకోవాలని వివరించాలి.
- చిన్నారులకు కార్టూన్, సూపర్ హీరో లేదా ప్రిన్సెస్ వంటివి ఎంతో ఇష్టంగా ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని మీరు హోమ్ పార్టీని నిర్వహించుకోవచ్చు. వారి స్నేహితులను కూడా ఆహ్వానిస్తే పిల్లలు మరింత ఆనందిస్తారు.
నేటితరం తల్లిదండ్రులు చిన్నపిల్లల్నీ ధ్యానం, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ తరగతులకు పంపిస్తున్నారు. కానీ పిల్లలకి ఇవేవీ అక్కర్లేదు. వాళ్లకి ఇవన్నీ ఆటలే అందిస్తాయి. ఆట మైదానం ఉండే పాఠశాలలనే ఎంచుకోవాలి. రోజులో కనీసం గంటైనా ఆడుకోనివ్వాలి. సెలవులప్పుడు రోజంతా ఆటలో మునిగితేలినా ఫర్వాలేదు.
- చిన్నారులకు భవిష్యత్తునిస్తున్నామనే భ్రమలో వారి బాల్యాన్ని తీసేసుకుంటున్నాం. తరగని ఆనందం, నియంత్రణలేని ఉద్వేగం ఇవే బాల్యం లక్షణాలు. పసిపిల్లలపై ఒత్తిడి లేకుండా వీటిని సరైన దారి మళ్లించగలిగితే మంచి బాల్యాన్ని బహుమతిగా అందించినట్టే.
- పిల్లలు ఎక్కువగా బొమ్మలు వేస్తుంటారు. వారు గీసిన చిత్రాలకు చిన్న చిన్న హంగులద్ది మెచ్చుకోవాలి. తద్వారా ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెరుగుతుంది.
- పిల్లలు ఎంతపెద్ద వారైనా లాలనగా దగ్గరకు తీసుకోవడం, వెన్నుతట్టడం మరవొద్దు. దూరం పెట్టడం వల్లే వారిలో ఒంటరితనం పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
- లింగ వివక్ష లేకుండా మైనర్లపై లైంగిన దాడులు, వేధింపులకు గురైతే వారికి రక్షణ కల్పించడమే పోక్సో చట్టం ఉద్దేశం. కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసింది.
- పిల్లలకు సూర్యోదయం, సూర్తాస్తమయం చూపిస్తూ వారితో మాట్లాడుతూ నడవడం మంచిది. మూడు నెలలకోసారైనా పచ్చటి పంటపొలాలకు తీసుకెళ్లాలి.
- 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరంగా భావిస్తూ 1986లో బాల కార్మిక నిరోధక చట్టం అమలులోకి తెచ్చింది.
- పిల్లలు అప్పుడప్పుడు వంటగదిలో సహాయం చేయడానికి ఇష్టపడతారు. చిన్నారులతో కలిసి వారికిష్టమైన ఆహారం, స్వీట్లను తయారు చేయాలి. వారు చేస్తుంటే దగ్గరుండి నేర్పించి మెచ్చుకోవాలి.
''పిల్లలకు తల్లిదండ్రులు వీలైనంత దగ్గరగా ఉండాలి. ఎక్కడికి వెళ్లొచ్చినా ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయమయ్యారా? కొత్త విషయాలు ఏం నేర్చుకున్నారు? అనే చిన్న ప్రశ్నలను వేస్తూ వారితో మమేకమవ్వాలి. తద్వారా స్నేహితులుగా కనిపిస్తారు.'' - అచంట మమతా రఘువీర్, తరుణి సంస్థ వ్యవస్థపకురాలు
చిన్నారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు : నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తు, అభివృద్ధి వారి చేతుల్లోనే ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగం ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, ఆరోగ్యకర జీవనానికి హక్కులు కల్పిస్తోంది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి
- 2015లో జువెనైల్ జస్టిస్ చట్టం అమలులోని వచ్చింది. నేరాల్లో చిక్కుకున్న లేదా భద్రత అవసరమైన పిల్లలకు న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటు చేశారు. బాలల కోసం సంరక్షణ కమిటీలు, పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేశారు.
- చిన్నారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో విద్యాహక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో తీసుకొచ్చింది. దీని ద్వారా పాఠశాల వయసున్న పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందిస్తోంది.
- ఎవరైనా చిన్నారి ప్రమాదంలో ఉన్నారని అనిపిస్తే చైల్డ్‌లైన్ నంబరు 1098కు కాల్ చేస్తే సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పిస్తారు.
- బాలల చట్టాల అమలును సమీక్షకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను 2005లో ఏర్పాటు చేశారు.
బాలల దినోత్సవం 2025 స్పెషల్ - వారిని రక్షించే ఈ చట్టాల గురించి తెలుసుకోండి!
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కహానీ కళా ఖుషీ' కార్యక్రమం - 457 అంగన్వాడీల్లో నిర్వహణ

