ETV Bharat / state

మదనపల్లె చిన్నారి హత్య కేసు - చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం

మదనపల్లెలో ఏడేళ్ల బాలిక అదృశ్య ఘటన విషాదంతం - నిందితుడు కులవర్ధన్‌ను అరెస్టు చేసిన పోలీసులు - నిందితుడి ఇంటి వద్ద మంగళవారం స్థానికుల ఆందోళన - నిందితుడిని అప్పగించాలంటూ డిమాండ్‌ చేస్తూ నిరసన

YSR Kadapa Accused in Child Murder Case Dies in Madanapalle
YSR Kadapa Accused in Child Murder Case Dies in Madanapalle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 1:35 PM IST

|

Updated : February 18, 2026 at 2:39 PM IST

3 Min Read
Choose ETV Bharat

YSR Kadapa Accused in Child Murder Case Dies in Madanapalle: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని మదనపల్లెలో చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసు నిందితుడు కులవర్ధన్​గా నిర్ధారించారు. చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చిన్నారిపై హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ శ్రీ ధీరజ్‌ చెప్పారు. నిందితుడిని రక్షక్‌ వాహనంలో మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడన్నారు. మదనపల్లెలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కనసానివారిపల్లె చెరువులో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైందని వెల్లడించారు. దీనిపై అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్పీ ధీరజ్‌ తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే?

బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల బాలిక 2వ తరగతి చదువుతోంది. సోమవారం శివరాత్రి సందర్భంగా బడికి సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4.30 గంటలకు ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి, చిన్నారి గురించి అడిగింది. పాప ఇంట్లో లేదని ఆయన తెలిపారు. స్నేహితుల ఇళ్ల వద్ద ఆడుకోవడానికి వెళ్లిందేమో అని మొదట భావించారు. ఎంత సేపటికీ రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలోకి దిగి గాలింపు మొదలు పెట్టారు. స్థానికంగా వాట్సప్ గ్రూపుల్లో చిన్నారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోస్టు చేశారు.

మదనపల్లె చిన్నారి హత్య కేసు - చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం (ETV Bharat)

చిన్నారి ఎదురు ఇంట్లో ఉంటున్న కులవర్ధన్ (30)కు నేర చరిత్ర ఉందని తెలియడంతో రాత్రి 1.30 గంటలకు పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి వెళ్లారు. తలుపు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుళ్లు కిటికీలోంచి చూశారు. కులవర్ధన్ పడుకుని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక చివరిసారిగా కులవర్ధన్​తోనే కనిపించిందని ఆమె తాత చెప్పారు. దాంతో మంగళవారం (నిన్న) ఉదయం 7 గంటలకు మళ్లీ అతడి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి, ఇంట్లోకి వెళ్లి చూడగా డ్రమ్ములో చిన్నారి విగతజీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

''చిన్నారి హత్య కేసు నిందితుడి మృతదేహం చెరువులో లభ్యమైంది. కులవర్ధన్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాథమిక సమాచారం మేరకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కులవర్ధన్‌ను తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి నిన్న తప్పించుకున్నాడు. రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా కులవర్ధన్‌ తప్పించుకున్నాడు. ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా కులవర్ధన్‌ శవం దొరికింది. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్‌ మృతదేహం గుర్తించాం. కులవర్థన్‌ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం.'' - శ్రీ ధీరజ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంగళవారం దారుణంగా హత్యకు గురైన బాలికకు ఆమె స్వగ్రామమైన వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక మృతదేహాన్ని మంగళవారం రాత్రి గ్రామానికి తీసుకురావడంతో ఒకసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఉదయం వరకు పోలీసులు అక్కడే ఉండి అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేయించారు. రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబులు గ్రామానికి చేరుకుని బాలిక మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య - నిందితులు అరెస్టు

మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య - తల్లిదండ్రులకు హోంమంత్రి అనిత ఫోన్​

Last Updated : February 18, 2026 at 2:39 PM IST