ETV Bharat / state

అలాంటివారు మీ ఖాతాకు రూ.10 పేమెంట్​ చేసినా ఇరుక్కున్నట్లే - 'మాకేం తెలియదు, అతడు ఎవరో తెలియదంటే కుదరదు'

లాభం ఆశించి మోసపోతున్న అమాకులు - అక్రమ మార్గాల్లో డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసే వ్యక్తులను లేయర్‌-1, లేయర్‌-2 ఇలా 10 వరకు వర్గీకరణ - ‘మ్యూల్‌’ ఖాతాలు అంటే ఏంటో తెలుసా

Cheating With Mule accounts In Hyderabad
Cheating With Mule accounts In Hyderabad (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 12:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cheating With Mule Accounts In Hyderabad : మన దగ్గర ఉన్న మనీని బ్యాంక్​ ఖాతాలో జమ చేయాలని బయల్దేరతాం, అలా ఏటీఎం, బ్యాంక్​ వద్దకు వెళ్లాక అపరిచిత వ్యక్తి కనిపిస్తాడు. ఆ డబ్బు తనకిస్తే యూపీఐ ద్వారా మన ఖాతాలో డబ్బులు పంపిస్తానని చెబుతాడు. ఎలాగైనా మన పని అవ్వాలని అది కూడా త్వరగానే అవుతుంది కదానని మన డబ్బులు అతడి చేతిలో పెడతాం. అయితే ఇంకోం ఉంది అక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాం. ఎప్పుడో ఒకసారి పోలీస్​ స్టేషన్​ నుంచి ఒక కాల్​ వస్తే అప్పుడు తెలుస్తోంది. తాను ఇచ్చింది సైబర్​ నేరగాడికి అనీ. ఇకపై ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

దిల్లీకి పిలిపించి విచారణ : డిజిటల్‌ చెల్లింపుల్లో మానవత్వం చూపితే పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నట్లే. మోసపోయిన వ్యక్తి ఖాతాలో ఎన్ని లక్షలున్నా బ్యాంకు అధికారులు స్తంభింపజేస్తారు. ఆర్థిక నేరగాడి ద్వారా ఎంత మందికి డబ్బులు వెళ్లాయో గుర్తించి పోలీసులు సదరు ఖాతాదారులను దిల్లీకి పిలిపించి విచారించే అవకాశం ఉంది.

లేయర్​ 1 లేయర్​2 వర్గీకరణ : అక్రమ మార్గాల్లో డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేసే వ్యక్తులను లేయర్‌-1, లేయర్‌-2 ఇలా 10 వరకు వర్గీకరిస్తారు. గుర్తుతెలియని వ్యక్తులు మన ఖాతాకు రూ.10 బదిలీ చేసినా పంపిన వారు ఆర్థిక నేరగాడైతే ఏదో ఒక లేయర్‌ కింద బుక్కయి పోతాం. 'మాకేం తెలియదు అతడు ఎవరో తెలియదు' అని చెప్పినా ఫలితం ఉండదు. బ్యాంకు ఖాతాను అన్‌ఫ్రీజింగ్‌ చేసుకోవడానికి కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందని సైబర్‌ నేరాలపై అవగాహన కలిగిన నిపుణుడు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆర్థిక నేరగాళ్ల అక్రమ లావాదేవీల వలలో చిక్కుకున్న వారు 6 వేల మంది ఉంటారని అంచనా.

కమీషన్‌ కోసం చూస్తే కష్టాలే! : కమీషన్‌ డబ్బుకు ఆశపడి కొందరు ఆధార్, పాన్‌ కార్డులను ఆర్థిక నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. ఇటీవల మల్యాల మండలానికి చెందిన కొందరు యువకుల ఖాతాలకు నేరగాళ్లు డబ్బులు పంపించడంతో వారిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. జిల్లాలో చాలా మంది యువకులు ఇలా ప్రతి నెలా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. ఖాతాదారులు డిజిటల్‌ చెల్లింపుల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, పరిచయం లేని వ్యక్తుల ఖాతాల నుంచి లావాదేవీలు జరిపితే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మ్యూల్‌ ఖాతాలకు బలి :

  • ఇటీవలి కాలంలో సైబర్‌ నేరస్థులు బెట్టింగ్, మాదకద్రవ్యాల రవాణా, చోరీ సొత్తును అక్రమ మార్గంలో బదిలీ చేయడానికి ‘మ్యూల్‌’ ఖాతాలు వినియోగిస్తున్నారు. వాటి ద్వారా ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడం వల్ల అమాయకులు బలవుతున్నారు.
  • గతంలో వృద్ధుల పేర కూడా ఖాతాలు తెరిచి అక్రమ లావాదేవీలు కొనసాగించినట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లోని కొందరు ఆటో డ్రైవర్ల పేరు మీద 'మ్యూల్‌' ఖాతాలు తెరచి లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం.
  • ఆర్థిక నేరగాళ్లు కొందరు వ్యక్తుల బ్యాంకు ఖాతాకు రూ.లక్ష పంపిస్తూ అందులోంచి రూ.20 వేలు కమీషన్‌ కింద మినహాయించుకొని రూ.80 వేలు డ్రా చేసి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలా డబ్బులు డ్రా చేసి ఇచ్చిన వాళ్లు కూడా ఆర్థిక నేరాల్లో చిక్కుకుంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'మ్యూల్‌' ఖాతాలు అంటే : ఏదైనా ఓ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఓ బాధితుడి నుంచి చోరీ చేసిన డబ్బును రకరకాల అకౌంట్స్‌లోకి నేరస్థులు బదిలీ చేస్తుంటారు. అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కు వెళ్లిందానని ఆరా తీసే లోపే మరో అకౌంట్‌కు డబ్బు బదిలీ అయిపోతుంది. ఇదంతా సైబర్ నేరస్థులకు ఓ ఆట. ట్రాక్ చేయకుండా ఉండేందుకు వేసే ఎత్తుగడ. అయితే ఇలా వాడిన బ్యాంక్ అకౌంట్స్‌ను మ్యూల్ అకౌంట్స్‌గా పిలుస్తారు.

మీ బ్యాంకు అకౌంట్​ ఎవరు వాడుతున్నారు? - పెరిగిపోతున్న మ్యూల్‌ అకౌంట్స్‌ నేరాలు

మన ఫొటోనే కదా అని డీపీలో పెడితే - మార్ఫింగ్​తో బెదిరిస్తున్న సైబర్ నేరగాళ్లు