'జూన్ 4' చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు - విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రజాతీర్పునకు రెండేళ్లు: సీఎం చంద్రబాబు
‘అది అధికారం కాదు - పునర్నిర్మాణ బాధ్యత’- హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీయే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు - ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 1:05 PM IST
Chandrababu Tweeted That June 4, 2024 is Historic Day For AP: జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రక దినానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
అధికారం కాదు - మహోన్నత బాధ్యత: ఆ విజయం తమకు అధికారం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జూన్ 4, 2024... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు... రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ… pic.twitter.com/dORzLZbqAN
— N Chandrababu Naidu (@ncbn) June 4, 2026
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం: సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా ప్రతి వర్గ సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ: ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. నాటి తీర్పును గౌరవించేలా, ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నామని వినమ్రంగా ప్రకటించారు. మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ‘జై ఆంధ్రప్రదేశ్’ అంటూ సీఎం చంద్రబాబు నినదించారు.
మళ్లీ అభివృద్ధి బాటలో: ప్రజల గొంతు నొక్కిన రాక్షస పాలనకు చరమగీతం పాడి నేటికీ రెండేళ్లని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదాలు, కేంద్రం సహకారంతో ఏపీ మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని చెప్పారు పరిశ్రమలను తరిమేసిన పాలన మీదని, పరిశ్రమలను తీసుకొచ్చే పాలన మాదని తెలిపారు. సమర్థ నాయకత్వంతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
'సుపరిపాలనకు రెండేళ్లయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం. ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు. చంద్రబాబు సమర్థ, సుస్థిర పాలనతో పెట్టబడిదారుల్లో విశ్వాసం పెరిగింది. రాష్ట్రంలో భయాందోళనలు లేని, ప్రశాంత ప్రజాస్వామ్య పాలనకు రెండేళ్లు పూర్తి. మోదీ, చంద్రబాబు, పవన్ జోడీతో సమగ్రాభివృద్ధి దిశలో ఏపీ పయనిస్తోందని' మంత్రి బీసి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
'జూన్ 4 తేదీని వైఎస్సార్సీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలి'
అంతర్జాతీయ వేదికపై అన్నదాతకు అరుదైన గౌరవం: రైతులు, మహిళా సంఘాల కృషికి సీఎం అభినందనలు

