ETV Bharat / state

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ - అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు

కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దేవ్‌జీ - లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు - ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయిన దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి

Maoist Leader Devji Surrenders
Maoist Leader Devji Surrenders (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 11:20 AM IST

|

Updated : February 22, 2026 at 12:34 PM IST

1 Min Read
Choose ETV Bharat

Maoist Leader Devji Surrenders : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. పార్టీలోని అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయినట్లు సమాచారం. దేవ్​జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్​గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్​కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్​జీ సారథ్యం వహిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్​జీ లొంగిపోవడం పార్టీకి తీరని నష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్​జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా దేవ్ జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. వీరందరి పై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు కూడా ప్రకటించి ఉంది.

Last Updated : February 22, 2026 at 12:34 PM IST