విశాఖలో ఘనంగా 'బ్రిక్స్' సైకిల్ ర్యాలీ - పాల్గొన్న వివిధ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు
విశాఖపట్నం బీచ్ రోడ్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ - కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 23, 2026 at 12:22 PM IST
BRICS Friendship Cycle Rally in Visakhapatnam : విశాఖపట్నం బీచ్ రోడ్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధులు, ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కి క్రీడాకారులను, యువతను ఉత్సాహపరిచారు.
ఆరోగ్యకరమైన జీవనశైలికి : ఈ సందర్భంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా దేశాలతో పాటు పలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి విచ్చేసిన క్రీడా ప్రతినిధులు, యువజన మంత్రులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాల మధ్య సాంకేతికత, క్రీడలు, నైపుణ్యాల భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ, జీవీఎంసీ కార్యాలయంలో ప్రతి సోమవారం సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, అధికారులు సైతం దీన్ని విధిగా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు : యువజన, క్రీడల మంత్రుల సమావేశాల సందర్భంగా శనివారం విశాఖలో సాంస్కృతిక కార్యక్రమాలు, అధికారిక విందు నిర్వహించారు. ఇందులో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. క్రీడల ద్వారా అథ్లెట్లు, కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు, ఈవెంట్ మేనేజర్లు, పారిశ్రామికవేత్తలకు ఎన్నో అవకాశాలు లభిస్తాయని సీఎం చెప్పారు. స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు రావడంతో పాటు అంతర్జాతీయ ఈవెంట్ల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందన్నారు. క్రీడలు ఆరోగ్యవంతమైన వ్యక్తులతో పాటు బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయని తెలిపారు.
ప్రతిభను ప్రోత్సహించే వ్యవస్థ : "ఒలింపిక్స్-2036 ప్రాజెక్టు" కింద గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతిభావంతులకు శాస్త్రీయ శిక్షణ ద్వారా 2036 ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధం చేస్తామని చెప్పారు. 56 స్పోర్ట్స్ స్కూళ్లను రాష్ట్రస్థాయి అకాడమీలు, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లకు అనుసంధానిస్తామని చంద్రబాబు వివరించారు.
దివ్యాంగ విద్యార్థులు ఎలా కోరితే అలానే పింఛన్ - వారి కష్టాలు తీర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం
భార్య కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌కు భర్త - విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజం

