ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్​

బొత్సకు బ్రెయిన్​ స్ట్రోక్​ - హుటాహుటిన హైదరాబాద్​కు తరలింపు - కొనసాగుతున్న చికిత్స - ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు - రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేసే అవకాశముందన్న వైద్యులు

Botcha Satyanarayana
Brain Stroke to YSRCP Leader Botcha Satyanarayana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 2:21 PM IST

|

Updated : February 27, 2026 at 2:41 PM IST

1 Min Read
Choose ETV Bharat

Brain Stroke to YSRCP Leader Botsa Satyanarayana: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్​కు గురయ్యారు. హుటాహుటిన బొత్సను హైదరాబాద్​కు తరలించారు. తెల్లవారుజామున సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణకు చికిత్స కొనసాగుతోంది. అయితే బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఇటీవల జరుగుతున్న శాసన మండలి సమావేశాలకు ప్రతిరోజు వైఎస్సార్సీపీ సీనియర్​ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరవుతున్నారు. మండలిలో ప్రభుత్వంపై తన గళం వినిపిస్తున్నారు. అనేక సమస్యలపై చర్చకు పట్టుబడుతూ ఎంతో యాక్టివ్​గా ఉంటున్నారు. అదేవిధంగా సభ సమావేశాల అనంతరం కూడా మీడియాతో తన వాయిస్​ వినిపిస్తుంటున్నారు. ఇలా యాక్టివ్​గా బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బ్రెయిన్​ స్ట్రోక్​కు గురి కావడంతో హుటాహుటిన హైదరాబాద్​కు తరలించారు.

బొత్స సత్యనారాయణ హైదరాబాద్​లోని న్యూరో సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థతకు గురి కావటంతో బొత్స హైదరాబాద్​కు తరలించారు. అనంతరం ఆస్పత్రిలో జాయిన్​ చేయగా, చికిత్స పొందుతున్నారు. అయితే బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉండని వైద్యులు తెలిపారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేసే అవకాశం ఉందని వైద్యులంటున్నారు.

స్పందించిన నేతలు: మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురవడం విచారకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో వైద్యులు చికిత్స పొందుతున్న బొత్స త్వరగా కోలుకుని ప్రజాజీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. అలాగే జనసేన అధ్యక్షుడు బొత్స ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డానన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బొత్సకు ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్​ తెలిపారు.

బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని లోకేశ్​ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యం, ఉత్సాహంతో బొత్స తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని లోకేశ్​ కోరారు.

అదిరిన సీన్​ - పవన్​ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి

Last Updated : February 27, 2026 at 2:41 PM IST