కోనసీమలో బోటు ప్రమాదం - సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం - అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో సోనా బోటుకు రంధ్రం
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమలో పడవ ప్రమాదం: (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 25, 2026 at 10:58 PM IST
Konaseema Boat Accident : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. అంతర్వేది సాగర సంగమం వద్ద ఇసుక దిబ్బలను వేగంగా ఢీకొట్టడంతో సోనా బోటుకు రంధ్రం పడింది. అందులో ఉన్న మత్స్యకారులను తీసుకొచ్చేందుకు హార్బర్ నుంచి మరో బోటు వెళ్లగా కెరటాల ధాటికి ఆ దానికీ రంధ్రం పడింది. దీంతో ఆ బోటు వెనక్కి వచ్చేసింది. సముద్రంలో ఉండిపోయిన బోటులో పలువురు మత్స్యకారులు ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక మత్స్యకారులు, మెరైన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

