ETV Bharat / state

ముగిసిన బిల్​ గేట్స్​ రాష్ట్ర పర్యటన - అయిదున్నర గంటలపాటు వివిధ కార్యక్రమాలు

సీఎంతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్ గేట్స్- ఆర్టీజీఎస్‌ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరును వివరించిన సీఎం - డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్‌ను తెలుసుకున్న బిల్‌ గేట్స్‌

Bill Gates Visited Amaravati RTGS
Bill Gates Visited Amaravati RTGS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 12:47 PM IST

5 Min Read
Choose ETV Bharat

Bill Gates Visited Amaravati RTGS: బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటన ముగిసింది. విజయవాడ నుంచి ముంబై మీదుగా దిల్లీకి వెళ్లనున్నారు. దాదాపు ఐదున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. బిల్ గేట్స్ అమరావతి పర్యటన సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రభుత్వ పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.

చంద్రబాబును చూడగానే ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్ -ఆర్టీజీఎస్‌ సేవలకు కితాబు (ETV Bharat)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని చంద్రబాబు ఆకాంక్షించారు. బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని సమావేశంలో ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి బిల్ గేట్స్‌ను కలిసిన సంగతి, హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు జరిగిన విధానాన్ని గేట్స్ సమక్షంలో గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు గేట్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి: వైద్యరంగంలో తెచ్చిన మార్పులు-సాధించిన ఫలితాలపైనా ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బిల్ గేట్స్‌ అమరావతి పర్యటన చారిత్రాత్మకమన్న సీఎం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ పర్యటన దోహదం చేస్తుందని అన్నారు. నాడు మైక్రోసాఫ్ట్ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్‌ మేటిగా నిలబడిందని తెలిపారు. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయి, ఇప్పుడు సంపద సృష్టి జరగాల్సి ఉందని అన్నారు. బిల్ గేట్స్ సహకారంతో వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానమన్న సీఎం ఇందుకు సాంకేతికతని విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. అమరావతి డిజైన్ అండ్ ఫౌండ్రీ, క్వాంటం వ్యాలీగా ఆవిష్కృతం అవుతుందన్నారు. డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లును తీర్చిదిద్దుతున్నామన్నారు.

యూనివర్సల్ హెల్త్​ స్క్రీనింగ్​: ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నామన్నారు. విద్యారంగంలో అధునిక విధానాలను పాటిస్తున్నాం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేస్తున్నామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నామన్నారు. మెరుగైన ప్రజారోగ్య సేవలు అందించేందుకు అత్యున్నత స్థాయి నిపుణులతో సలహా మండలి ఏర్పాటు చేశామని వివరించారు. యూనివర్సల్ హెల్త్​ స్క్రీనింగ్​ విధానం ప్రజలకు ముందస్తుగానే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సాంకేతిక వినియోగాన్ని టెక్​ దిగ్గజం బిల్ గేట్స్ ప్రశంసించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందని మెచ్చుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణంలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక గ్రేట్ వర్క్ అని కితాబిచ్చారు.

బిల్​గేట్స్​ కితాబు: అమరావతిలోని రియల్‌టైం గవర్నెన్స్ కేంద్రం -ఆర్టీజీఎస్​ను గేట్స్‌ ఫౌండేషన్​ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ పరిశీలించారు. సచివాలయానికి వచ్చిన గేట్స్‌కు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్​ సాదర స్వాగతం పలికారు. హలో ఫ్రెండ్! హౌ ఆర్ యూ ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. తాను బాగున్నానని, మీరెలా ఉన్నారంటూ బిల్ గేట్స్​ను చంద్రబాబు ఆ తర్వాత మంత్రివర్గ సహచరులు, సీఎంఓ అధికారులను పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆర్టీజీఎస్​ కేంద్రానికి వెళ్లారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని బిల్‌గేట్స్‌కు సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని గేట్స్ కితాబిచ్చారు. అవేర్ 2.O ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్నిసేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు తెలిపారు.

'గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుంది, గ్రేట్‌ వర్క్​': ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్​డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్‌తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ప్రశంసించగా జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చెప్పారు. ఇదే సమయంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలనూ బిల్‌ గేట్స్‌ అడగ్గా చంద్రబాబు వివరించారు. రాజధానిలో 30శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందని, గ్రేట్‌ వర్క్ అని బిల్ గేట్స్‌ మెచ్చుకున్నారు.

ఆరోగ్య రంగంలో ఏఐ సేవల వివరణ: ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. ప్రజల డిజిటల్​ హెల్త్​ రికార్డుల ఆధారంగా లైఫ్​ స్టైల్​, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని సీఎం చెప్పారు. "దట్స్‌ నైస్" అంటూ సంజీవని ప్రాజెక్టు అమలును బిల్‌ గేట్స్ ప్రశంసించారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ అభిప్రాయపడ్డారు.

బిల్​గేట్స్​కు స్వాగతం పలికిన లోకేశ్​: బిల్‌ గేట్స్‌ రాకపై సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్​ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పాలనా రంగాల్లో గేట్స్‌ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పని చేయడానికి ఏపీ ఎదురు చూస్తోందని, లోకేశ్​ ఎక్స్‌లో పేర్కొన్నారు. సహచర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తో కలిసి బిల్ గేట్స్ కు విజయవాడ విమానాశ్రయంలో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.

బిల్​గేట్స్​తో భేటీ అయిన సీఎం చంద్రబాబు​ - ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలపై ప్రధానంగా చర్చ

16న బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు - 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం చంద్రబాబు