నటుడు నవదీప్‌నకు హైకోర్టులో భారీ ఊరట - డ్రగ్స్ కేసు కొట్టేసిన న్యాయస్థానం
టాలీవుడ్ నటుడు నవదీప్‌పై నమోదైన డ్రగ్స్ కేసు కొట్టివేసిన హైకోర్టు - నవదీప్ వద్ద డ్రగ్స్ దొరకలేదని వాదించిన న్యాయవాది సిద్ధార్థ్ - కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించిన హైకోర్టు
Big Relief To Hero Navdeep In High Court (EENADU)

Published : January 9, 2026 at 2:45 PM IST
Big Relief To Hero Navdeep In High Court : మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్‌నకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై గతంలో నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. నవదీప్ వద్ద మాదక ద్రవ్యాలు దొరకలేదని న్యాయవాది సిద్ధార్థ్ వాదించారు. నిందితుడి వివరాల ఆధారంగా నవదీప్‌ను కేసులో చేర్చారని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ దశలో కేసు ఉంది. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

