ETV Bharat / state

సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ : భట్టి విక్రమార్క

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట - 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తాం - సింగరేణిపై అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం

CATH LAB IN RAMAGUNDAM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 1:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Deputy CM Bhatti Vikramarka On Singareni : శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. 75 రోజుల్లో గోదావరిఖనిలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తామని తెలిపారు. సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ చేస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ : సింగరేణిపై అసెంబ్లీలో పలువురు సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇచ్చారు. 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని వాటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతోందన్నారు. రామగుండంలో క్యాత్ ల్యాబ్ నిర్మాణం పీపీపీ మోడల్‌లో చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అవార్డు పూర్తయిందని, 75 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. విశ్రాంత ఉద్యోగులకు సింగరేణి ఆసుపత్రుల్లో ఔషధాల సౌకర్యం కల్పిస్తున్నారు.

సింగరేణి ఆసుపత్రుల్లో మార్చి నాటికి వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ : భట్టి విక్రమార్క (ETV)

ఖాళీ స్థలాల కేటాయింపుపై చర్చిస్తాం : సీపీఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉందని, విశ్రాంత ఉద్యోగులు రూ.8 లక్షల వరకు మందులు తీసుకునే అవకాశం ఇస్తున్నామని భట్టి తెలిపారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి పరిధి ఖాళీ స్థలాల్లో కేటాయింపుపై బోర్డులో చర్చిస్తామన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అభిప్రాయపడ్డారు.

సింగరేణికి ఇవ్వకుండా వేలం వేస్తున్నారు : కేంద్ర విధానాలతో రాష్ట్ర బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వకుండా వేలం వేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆక్షేపించారు. బొగ్గు గనుల వేలం ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలు రంగ ప్రవేశం చేస్తున్నాయన్నారు. గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణికి కొన్ని బొగ్గు బావులు దక్కేలా చేసినట్లు చెప్పారు.

"సూపర్ స్పెషాలిటీ హస్పిటల్​కు సంబంధించి ఇప్పటికే ఉద్యోగుల కోసం రెఫరల్​ ఆసుపత్రులను కూడా చూస్తున్నాం. అట్లాగే ఖాళీగా ఉన్న హస్పిటల్స్​లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని సభ్యులు అడిగారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్​ కూడా ఇచ్చాం. 11 మంది కాంట్రాక్ట్ డాక్లర్లు పనిచేస్తున్నారు. మిగిలిన 32 మందికి సంబంధించి ప్రకటన ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాటిని కూడా భర్తీ చేస్తారు. అలాగే 175 మంది పారామెడికల్​ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియలో ఉన్నది. 2026 మార్చి నెలలో చేపట్టడం జరుగుతావుంది. రిటైర్డ్​ అయిన ఎంప్లాయిస్​కి మెడిసిన్ ఫెసిలిటీ ఉంది. వారికి సీపీఆర్​ఎమ్​ఎస్​ స్కీమ్​ కూడా అందుబాటులో ఉంది. మిగతా టర్మినల్ బెనిఫిట్స్ కూడా అందచేయడం జరుగుతుంది. క్యాత్​ ల్యాబ్​కు సంబంధించి ఇప్పటికే పీపీపీ మోడల్​లో పిలిచారు. కాంట్టాక్ట్ అవార్ట్ చేయడం కూడా జరిగింది. రామగుండంలో దీనిని 75 రోజుల్లో ప్రారంభిస్తాం. ఒకప్పుడు బొగ్గు తీయడం అనేది మోనోపాలి. ఇప్పుడు ఆ మోనోపాలి నుంచి ప్రైవేటైజేషన్​లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది. కేంద్రప్రభుత్వం మన రాష్ట్రంలోని బొగ్గుబావులు కేటాయించాల్సింది పోయి ఇప్పుడు వేలం వేస్తుంది. ఈ పోటీలో ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ కారణంగా సింగరేణి తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగరేణి ఉద్యోగులకు మాత్రం సంక్షేమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం" -భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

జాబ్‌ క్యాలెండర్‌ విషయంలో సామాజిక అంశాన్ని పరిశీలిస్తున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయన్నారు. పోచారం ఇన్ఫోసిస్‌ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 70 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్​ బహిరంగ సభలు!

3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంలో విద్యుత్ ఉత్పత్తే కీలకం : భట్టి విక్రమార్క