ETV Bharat / state

సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లలో శాఖలకు స్థలం - సిబ్బంది సంఖ్య ఆధారంగా కేటాయింపు

ఆయా శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల నుంచి వివరాల సేకరణ - కేటగిరీల వారీగా ప్రామాణిక యూనిట్‌ ఏరియా నిర్దేశించిన ప్రభుత్వం

Based on Cadre Strength Space Allocated For Secretariat and HOD Towers
Based on Cadre Strength Space Allocated For Secretariat and HOD Towers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 2:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

Based on Cadre Strength Space Allocated For Secretariat and HOD Towers: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న పలు హెచ్‌ఓడీ (విభాగాధిపతులు)ల భవనాలు, సచివాలయం, కార్యాలయాల టవర్లలో ఏ శాఖకు ఎంత స్థలం కేటాయించాలన్న అంశంపై కసరత్తులు మరింత ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 13న సమావేశమైంది. ఈ క్రమంలో ఆయా విభాగాలు, శాఖల్లో సిబ్బంది (కేడర్‌ స్ట్రెంగ్త్‌) వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల్లో మంజూరు చేసిన అధికారులు, సిబ్బంది పోస్టులు (శాంక్షన్డ్‌ స్ట్రెంగ్త్‌), ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సంఖ్య (వర్కింగ్‌ స్ట్రెంగ్త్‌) వివరాల్ని గురువారం నాటికి పంపించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. విజయానంద్‌ సర్క్యులర్‌ జారీ చేశారు.

సీఎస్‌ ఆదేశాలు: మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులు, మిడిల్‌ లెవెల్‌ అధికారులు ఇలా వివిధ కేటగిరీల వారీగా కేటాయించే ప్రామాణిక స్థల విస్తీర్ణాన్ని ఆ సర్క్యులర్‌లో పొందుపరిచారు. ఆయా శాఖలు, విభాగాల్లో కేటగిరీల వారీగా వర్కింగ్‌ స్ట్రెంగ్త్‌ , శాంక్షన్డ్‌ స్ట్రెంగ్త్ వివరాలకు అనుగణంగా దేనికోసం ఎంత స్థలం కేటాయించాలనే దానిపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేస్తుంది. శాంక్షన్డ్, వర్కింగ్‌ స్ట్రెంగ్త్‌ వివరాల్ని పట్టిక రూపంలో సాధారణ పరిపాలనశాఖకు ఈ మెయిల్‌ ద్వారా పంపించాలని సంబంధిత అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

సచివాలయ శాఖల్లో కేటగిరీల వారీగా నిర్దేశించిన ప్రామాణిక యూనిట్​ ఏరియా వివరాలు
కేటగిరీ మొత్తం వ్యక్తులు/యూనిట్​లువిస్తీర్ణం చదరపు అడుగుల్లో
మంత్రి మంత్రి, ఒక ఓఎస్​డీ, ఒక పీఎస్​, ఒక పీఏ,12 మంది సిబ్బంది3,500
కార్యదర్శి ఒక కార్యదర్శి, ఒక పీఎస్​,ఒక పీఏ, 10 మంది సిబ్బంది2,000
సలహాదారు/ ప్రత్యేక కార్యదర్శి సలహాదారు, ఒక పీఎస్​, నలుగురు సిబ్బంది 1,000
మిడిల్​ లెవల్​ ఆఫీసర్ ఒకరు250
అసిస్టెంట్​ సెక్రటరీ ఒకరు120
సెక్షన్​ అధికారి ఒక సెక్షన్​ అధికారి, నలుగురు సిబ్బంది300
మినీ కాన్పరెన్స్​ హాల్​ 16 మంది కూర్చునేలా ఒకటి లేదా 8 మంది కూర్చునేలా రెండు320
మధ్యస్థాయి కాన్ఫరెన్స్​ హాల్​ 75 మంది కూర్చునేలా1,500
పెద్ద కాన్ఫరెన్స్​ హాల్​ 125 మంది కూర్చునేలా3,125
మరింత పెద్ద కాన్ఫరెన్స్​ హాల్​ 200 మంది కూర్చునేలా6,000
తపాల్​ కౌంటర్​ 3 వర్క్​ స్టేషన్లతో100
రికార్డు రూమ్​ ఒకటి300
స్టోర్​ రూమ్​ ఒకటి300
సర్వర్​ రూమ్​ ఒకటి1,000
ఐటీ సపోర్ట్​ రూమ్​ ఒకటి200
డిపార్ట్​మెంట్​ లైబ్రరీ ఒకటి100
విభాగాధిపతుల కార్యాలయాల్లో కేటగిరీల వారీగా నిర్దేశించిన ప్రామాణిక యూనిట్​ ఏరియా
కేటగిరీమొత్తం వ్యక్తులు/ యూనిట్​లువిస్థీర్ణం చదరపు అడుగుల్లో
హెడ్​1హెడ్​, ఒక పీఎస్​, 10 మంది సిబ్బంది3,500
హెడ్​2హెడ్​, ఒక పీఎస్​, 10 మంది సిబ్బంది1,200
డిప్యూటీ హెడ్ఒకరు350
సూపర్వైజరీ ఆఫీసర్​ఒకరు120
వర్క్​స్టేషన్​ఒకరిరి60
మినీ కాన్ఫరెన్స్​ హాల్​16 మంది కూర్చునేలా ఒకటి లేదా 8 మంది కూర్చునేలా రెండు320
మీడియం మినీ కాన్ఫరెన్స్​ హాల్​75 మంది కూర్చునేలా1,500
పెద్ద మినీ కాన్ఫరెన్స్​ హాల్​125 మంది కూర్చునేలా3,125
మరింత పెద్ద మినీ కాన్ఫరెన్స్​ హాల్​200 మంది కూర్చునేలా6,000
తపాల్​ కౌంటర్​3 వర్క్​ స్టేషన్లతో300
స్టోర్​ రూమ్​ఒకటి300
సర్వర్​ రూమ్​ఒకటి1000
డిపార్ట్​మెంట్​ లైబ్రరీఒకటి100

రాజధాని అమరావతి విస్తరణలో కీలక ముందడుగు - రెండో దశలో 709.6 చ.కి.మీ.లకు మాస్టర్‌ప్లాన్‌

140 మీటర్ల వెడల్పుతోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు - క్లారిటీ ఇచ్చిన అధికారులు