బండి భగీరథ్ పోక్సో కేసు - 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీసు కస్టడీ - బండి భగీరథ్‌ను విచారించనున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు - పోక్సో కేసులో ఈనెల 16న బండి బగీరథ్ అరెస్టు

Published : May 26, 2026 at 7:21 PM IST
|Updated : May 26, 2026 at 10:29 PM IST
Bandi Bhagirath Gets Three Days Police Custody : పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌ని 3 రోజులపాటు కస్టడీకి మల్కాజిగిరి కోర్టు అనుమతించింది. బండి భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు విచారించనున్నారు. బండి భగీరథ్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినా, మూడు రోజులు మాత్రమే కస్టడీకి మల్కాజిగిరి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పోక్సో కేసులో ఈనెల 16న అరెస్టైన భగీరథ్.. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అసలేం జరిగింది : బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. 2025 జూన్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా సదరు మైనర్ బాలికకు బండి భగీరథ్‌తో పరిచయం ఏర్పడిందని, అక్టోబర్, డిసెంబర్ 2025 మధ్య కాలంలో భగీరథ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మద్యం సేవించాలని ఒత్తిడి చేశాడని బాధిత మైనర్ బాలిక ఆరోపించింది. మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో)తో పాటు, తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణల కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని కఠినమైన సెక్షన్లను పోలీసులు ఈ కేసులో చేర్చారు.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ : మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాలను నమోదు చేశారు. పోలీసులు మరికొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం బండి భగీరథ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.
పోలీస్ కస్టడీ : ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు, సమాచారాన్ని రాబట్టేందుకు నిందితుడు భగీరథ్‌ని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇతర వివరాలు ఈ కేసులో దర్యాప్తు చట్ట ప్రకారం జరుగుతోందని, తాము విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని భగీరథ్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కేసులు భగీరథ్‌కు మద్దతుగా, మైనర్ బాలికి ఫోటోలు, వీడియోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కేసును తప్పుదోవ పట్టించేలా వీడియోలు, ఫోటోలు వైరల్ చేశారనే ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి
అసలు ఆరోజు ఏం జరిగింది? : బండి భగీరథ్ స్నేహితులను విచారించిన పోలీసులు

