ETV Bharat / state

యువతకు బంపరాఫర్‌ - చదువుకుంటూనే లక్షల విలువైన కార్పొరేట్ శిక్షణ ఉచితం

ఏయూలో అరబిందో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు - 8 కోట్ల రూపాయల వ్యయంతో లాబొరేటరీల, పరికరాలు - పూర్తి శిక్షణ ఉచితంగా అందిస్తోన్న సంస్థ -శిక్షణ పూర్తైన వారికి మంచి వేతనంతో ఉద్యోగావకాశాలు

ఏయూలో అరబిందో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్
ఏయూలో అరబిందో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 3:04 PM IST

3 Min Read
Choose ETV Bharat

Aurobindo Pharma Foundation Providing Free Skill Training To Students : చదువు పూర్తయ్యాక ఉద్యోగం దక్కడం నేటి యువతకు అతి పెద్ద సవాల్‌. ఈ సవాల్‌ను అధిగమించడంలో సాఫ్ట్‌స్కిల్స్‌ కొంత వరకు మేలు చేస్తాయి. కంపెనీలు కోరుకునే సాఫ్ట్‌స్కిల్స్‌ నేర్చుకుంటే చాలా ప్రయోజనం. అలాంటి నైపుణ్యాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ స్థాయి శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది అరబిందో ఫార్మా ఫౌండేషన్. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను సైతం కల్పిస్తోంది. మరి అక్కడ ఎలాంటి స్కిల్స్‌ నేర్పిస్తున్నారు.? విద్యార్థులకు అవి ఎలా ఉపయోగపడతాయి.? ఇప్పుడు చూద్దాం.

చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతకడం కంటే చదువుకుంటూనే కొలువుకు కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఈ ఆలోచనతోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్‌ అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.

యువతకు బంపరాఫర్‌ - చదువుకుంటూనే లక్షల విలువైన కార్పొరేట్ శిక్షణ ఉచితం, రూ.9వేలు స్టైపెండ్‌ (ETV)

విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ : ఈ ఏడాది ఫిబ్రవరి 24న యూనివర్సిటీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభమైంది. మొదటి దశలో ఎమ్మెస్సీ సెకండ్‌ ఇయర్‌ ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ చదువుతున్న 18 మంది విద్యార్థులతో శిక్షణ మొదలైంది. ఇప్పటికే చదువు పూర్తి చేసిన మరో 20 మంది కూడా ఇక్కడ తర్పీదు పొందు తున్నారు. వీరిలో దాదాపు సగం మంది అమ్మాయిలే ఉండటం విశేషం. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్నిఏర్పాటు చేశారు. సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో లాబొరేటరీలు, ఖరీదైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన సిబ్బంది, పరికరాలు, రసాయనాల ఖర్చు మొత్తాన్ని అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ భరిస్తోంది. దీంతో విద్యార్థులకు శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.

"ఇక్కడి ఆంధ్రా యూనివర్సీటీలో ఎమ్మెస్సీ చదివాం. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 15 నుంచి 20 వరకు నైపుణ్యా కోర్సులు నేర్పిస్తున్నారు. అలాగే ప్రతినెల రూ. 9,000 స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. ఇదే స్థాయి శిక్షణకు బయట భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి ఉచితంగా నేర్పిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను సైతం కల్పిస్తున్నారు." - విద్యార్థులు

విద్యార్థులకు పుస్తకాల్లో చదివిన అంశాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. కొన్నిరకాల రసాయనాలను విదేశాల నుంచి కూడా తెప్పించి ప్రయోగాలు చేయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఇదే స్థాయి శిక్షణకు భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండానే శిక్షణ లభిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు.

నెలకు 9 వేల రూపాయల వరకు స్టైపెండ్‌ : బయటి నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు 9 వేల రూపాయల వరకు స్టైపెండ్‌ కూడా అందిస్తోంది ఫౌండేషన్‌. అయితే AUలో రెగ్యులర్ చదువుతో పాటు ఉచితంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపకార వేతనం వర్తించదని అరబిందో ఫార్మా ఫౌండేషన్ మేనేజర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో సుమారు 40 రకాల అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కెమిస్ట్రీ చదివే వారికి ఈ శిక్షణ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే డిగ్రీ పూర్తయ్యే సమయానికే ఉద్యోగానికి సిద్ధంగా ఉండొచ్చని అంటున్నారు. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అరబిందో ఫార్మా సంస్థ. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది.

ఏఐ ప్రొఫెషనల్స్‌గా ఏపీ విద్యార్థులు - ఏడాదికి రూ.10 లక్షల జీతంతో జాబ్​

ఖగోళ ఫొటోగ్రఫీ నుంచి అంతరిక్ష ప్రయోగాల వరకు - విజయనగరం యువకుడి సక్సెస్​ స్టోరీ