చేతిలో ప్రతిభ చాటిచెప్పెలా - ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ కార్యక్రమం
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ కార్యక్రమం - గిరిజన పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఆర్ట్స్‌పై శిక్షణ - రేపటితో ముగియనున్న శిక్షణ కార్యక్రమం

Published : March 1, 2026 at 4:07 PM IST
|Updated : March 1, 2026 at 5:24 PM IST
Arts and Craft Training Program in Telangana : ఆదివాసీ, గిరిజనుల సంస్కృతే కాదు వారి కళాకృతులు కూడా వైవిధ్యమే. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు కళాకృతులపై శిక్షణిచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఐదు రోజులు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టింది. ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు.
ట్రెండ్‌లో ఉన్న బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ : గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4 ఐటీడీఎల నుంచి ఆయా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉన్న ఆర్ట్ టీచర్స్‌కి ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ రకాల చీరలపై ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ ఇవ్వడం వల్ల గిరిజన విద్యార్థులకు కూడా ఇవి ఉపాధ్యాయులు నేర్పగలరు అని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల అంటున్నారు.
గిరిజన విద్యార్థులకు ఆర్థికంగా ఎదిగే శిక్షణ : ఈ నెల 26న ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. పూర్తిగా రెసిడెన్షియల్ మోడ్‌లో కొనసాగుతోంది. ఇందులో 20 మంది ఆర్ట్ టీచర్స్ ఉండగా, 10 మంది ట్రైబల్ ఆర్టిసన్స్ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు ఆర్థికంగా ఎదిగే శిక్షణ కూడా ఉంటుందని, దీని వల్ల డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంటుందని ట్రైనింగ్ కో ఆర్డినేటర్ శైలజ తెలిపారు.
"గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు అందుబాటులో ఉన్నారు. వీరితో పాటు ట్రైబల్ యూత్‌లో ముఖ్యంగా పెయింటర్స్, ఆర్ట్ వర్క్‌లలో ఆసక్తులుగా ఉన్నవారందరినీ పిలిచి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించాం. ప్రత్యేకంగా ఫాబ్రిక్ పెయింట్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనికోసం సరైన వ్యక్తులను నియమించేందుకు కసరత్తులు చేశాం. షాప్ అనే హ్యాండ్లూమ్ సంస్థను గుర్తించాం. వారి ద్వారానే ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో పాల్గొన్నవారంతా తొలిరోజు నుంచే ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి తగ్గట్టుగానే పని చేస్తున్నారు." - డా.సముజ్వల, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ
ఎక్స్పోలోనూ వీటికి అవకాశం : గిరిజనులు తయారు చేస్తున్న ఈ చీరలను అమ్ముకునేందుకు ది షాప్ అనే వారితో కూడా కలిసి పని చేసేందుకు వీరికి అవకాశం ఉంది. ఇందులో బ్లాక్ ప్రింటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ది షాప్ వారు నిర్వహించే ఎక్స్పోలోనూ వీటికి అవకాశం కల్పించనున్నట్లు రిసోర్స్ పర్సన్ డాక్టర్ సునీత ప్రసాద్ తెలిపారు.
ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నూ నిర్వహించాలి : ఇక్కడ నేర్చుకుంటున్న ఈ ఐదు రోజుల శిక్షణ చాలా బాగుందని ఆర్ట్ టీచర్స్ చెబుతున్నారు. గిరిజన యువతకు సైతం ఇలాంటి కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడం నైపుణ్యాభివృద్ధితో పాటు ఆర్థికంగా సాధికారత ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో నూ నిర్వహించాలని కోరుతున్నారు.
గిరిజన సంస్కృతితో పాటు ట్రెండ్‌కి తగ్గట్లుగా : మార్చి 02వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో గిరిజన సంస్కృతితో పాటు ట్రెండ్‌కి తగ్గట్లుగా వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్‌ను చీరలపై ముద్రిస్తూ, ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ గిరిజన సంక్షేమ శాఖ తన ప్రత్యేకత చాటుకుంటోంది.
"ట్రైబల్ పెయింటిగ్ ఆర్ట్ అన్నీ మన వద్ద ఉన్నాయి. దీనిని కాపాడుతూ, ప్రమోట్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉన్న ఈ బ్లాగ్ పెయింటింగ్‌ను కూడా వీరికి తెలియజేయవచ్చనే ఉద్దేశంతో గిరిజన విద్యార్థులకు నేర్పిస్తున్నాం. వీరికి భవిష్యత్తులో, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌గా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ట్రైనింగ్‌ను నిర్వహిస్తున్నాం. ఇది రెసిడెంన్షిల్ మోడ్‌లో ఉన్నందున వీరికి భోజనం, వసతి అందిస్తూ నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్నాం." - అజ్మీర శైలజ, ట్రైనింగ్ సమన్వయకర్త
బంగారు పూతతో ఔరా అనిపించే బహుమతులు - అమూల్యం స్టోర్‌లో అద్భుతమైన గిఫ్ట్స్

